ప్రధాన మంత్రి కార్యాలయం
ఎస్ఏఎఫ్ఎఫ్-2026 ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న భారత మహిళల ఫుట్‌బాల్ జట్టును అభినందించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
07 JUN 2026 1:58PM by PIB Hyderabad
ఎస్ఏఎఫ్ఎఫ్-2026 ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న భారత మహిళల ఫుట్‌బాల్ జట్టుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు. టోర్నమెంట్ మొత్తం వారు అద్భుతంగా ఆడారని ప్రధానమంత్రి ప్రశంసించారు.
రాబోయే కాలంలో మరింత మంది యువత ఫుట్‌బాల్ ఆడేందుకు ఈ విజయం స్ఫూర్తినిస్తుందని శ్రీ మోదీ అభిప్రాయపడ్డారు. జట్టు ఆడబోయే భవిష్యత్ టోర్నమెంట్ల కోసం ప్రధానమంత్రి తన శుభాకాంక్షలు తెలిపారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“ఎస్ఏఎఫ్ఎఫ్-2026 ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న భారత మహిళల ఫుట్‌బాల్ జట్టుకు అభినందనలు. వారు టోర్నమెంట్ అంతటా అద్భుతంగా ఆడారు. ఇది రాబోయే కాలంలో మరింత మంది యువతను ఫుట్‌బాల్ వైపు ఆకర్షిస్తుంది. భవిష్యత్తులో వారు మరింతగా రాణించాలని కోరుకుంటున్నాను’’.
***
(रिलीज़ आईडी: 2270181)
आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada