ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పురుషుల అండర్‌ 18 ఆసియా కప్ 2026 విజేతగా నిలిచిన భారత హాకీ జట్టుకు ప్రధానమంత్రి అభినందనలు

प्रविष्टि तिथि: 06 JUN 2026 6:18PM by PIB Hyderabad

భారత యువ హాకీ క్రీడాకారులు సాధించిన అద్భుతమైన విజయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. పురుషుల అండర్-18 ఆసియా కప్ 2026 హాకీ టోర్నమెంట్‌ ఛాంపియన్‌గా నిలిచిన భారత యువ హాకీ జట్టును ప్రధానమంత్రి అభినందించారు.

 

ఈ టోర్నమెంట్‌ అంతటా భారత జట్టు అద్భుతమైన నైపుణ్యాన్ని, అత్యుత్తమ సమష్టి కృషిని ప్రదర్శించిందని, తుది పోరులో చిరస్మరణీయ విజయం సాధించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ అద్భుత విజయం దేశంలోని యువతలో హాకీ క్రీడకు పెరుగుతున్న ఆదరణను ప్రతిబింబిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా భారత జట్టు భవిష్యత్తు ప్రయత్నాలకు తన శుభాకాంక్షలు తెలియజేశారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

 

‘‘మన యువ హాకీ ఆటగాళ్లు సాధించిన అద్భుతమైన ఘనత ఇది!

 

పురుషుల అండర్-18 ఆసియా కప్ 2026 విజేతగా నిలిచిన భారత హాకీ జట్టుకు హృదయపూర్వక అభినందనలు. ఈ టోర్నమెంట్‌ పొడవునా మన జట్టు అసాధారణ నైపుణ్యాన్ని, అద్భుతమైన సమష్టి స్ఫూర్తిని ప్రదర్శించి.. తుదిపోరులో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ఈ విజయం మన యువతలో హాకీకి పెరుగుతున్న ప్రజాదరణను చాటిచెబుతోంది. భవిష్యత్తులో మన జట్టు మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను".


(रिलीज़ आईडी: 2269908) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Gujarati , Kannada , Malayalam