ప్రధాన మంత్రి కార్యాలయం
పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో జరిగిన ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి సహాయాన్ని ప్రకటించిన ప్రధాని
प्रविष्टि तिथि:
06 JUN 2026 6:22PM by PIB Hyderabad
పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో జరిగిన ప్రమాదంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు ప్రధాని ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు ఆయన తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:
"పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో జరిగిన ప్రమాదం గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఈ ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తాం."
(रिलीज़ आईडी: 2269907)
आगंतुक पटल : 6