యు పి ఎస్ సి
azadi ka amrit mahotsav

ఫేస్ ఆథెంటికేషన్ ప్రోటోకాల్‌ను రూపొందించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

పరీక్ష పరంగా నైతికతను పెంపొందించడానికి

సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష-2026లో విజయవంతంగా అమలు

प्रविष्टि तिथि: 04 JUN 2026 3:51PM by PIB Hyderabad

పరీక్షల నిర్వహణ ప్రక్రియలో నైతికతను పెంచడంతో పాటు ఒక అభ్యర్థికి బదులుగా మరొకరు పరీక్ష రాయడాన్ని అడ్డుకొనే దిశగా  ‘ముఖ ప్రామాణికత’ (ఫేస్ ఆథెంటికేషన్) ప్రక్రియను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) ఇటీవల జరిగిన సివిల్ సర్వీసులు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ప్రిలిమినరీ) పరీక్ష-2026లో విజయవంతంగా అమలు చేసింది. ఈ ఫేస్ ఆథెంటికేషన్ ప్రోటోకాల్ ఏ అభ్యర్థి ఫోటో దరఖాస్తు పత్రాన్ని నింపేటప్పుడు అప్‌లోడ్ అయిందో, అదే వ్యక్తి పరీక్ష రాయడానికి ప్రవేశ పత్రంతో వచ్చినట్లు నిర్ధారిస్తుంది. ఈ వ్యవస్థ పరీక్ష కేంద్రాల వద్ద పర్యవేక్షకులు మొబైల్ ఫోన్‌ను ఉపయోగించి అభ్యర్థులను ప్రత్యక్షంగా (లైవ్), వాస్తవ కాల ప్రాతిపదికన సరిచూసే పద్ధతిని నిర్ధారిస్తుంది. దీంతో ఎలాంటి ఇబ్బందులకూ తావు ఇవ్వని విధంగా గుర్తింపు సాధ్యపడుతుంది. ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయడానికి గాని, లేదా దుష్ప్రవర్తనకు పాల్పడేందుకు గాని అవకాశాలు ఉండనే ఉండవు.
ఈ సంవత్సరం సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్షల కాలంలో, యూపీఎస్‌సీ దేశవ్యాప్తంగా మొత్తం 2,072 పరీక్ష కేంద్రాల్లో వాస్తవిక కాలంలో ముఖ గుర్తింపు పద్ధతిని అమలుపరిచింది. ముఖ ప్రామాణికతకు సంబంధించిన ఈ అప్లికేషన్‌ను ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ ఈ-పరిపాలన డివిజన్ (ఎన్ఈజీడీ) అందించిన సాంకేతిక సహకారంతో యూపీఎస్‌సీ రూపొందించి, ఆచరణలో పెట్టింది.
పరీక్ష హాలులో అడుగు పెట్టడాని కన్నా ముందు ప్రతి ఒక్క అభ్యర్థి తన ముఖాన్ని సరి చూపించుకొని, తనే సిసలైన అభ్యర్ధినని నిర్ధారించుకోవడం యూపీఎస్‌సీ అభివృద్ధి చేసిన కార్య ప్రణాళిక ప్రకారం తప్పనిసరి అయిపోయింది. యూపీఎస్‌సీ ఈ ప్రక్రియలో భాగంగా, ఒక విస్తృత ఎస్ఓపీని (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్) కూడా రూపొందించింది. దీనిని అన్ని రాష్ట్రాలు, జిల్లాలు, పరీక్షా కేంద్రాలతో పంచుకున్నారు. పర్యవేక్షకులకు అనేక దశలలో శిక్షణను ఇచ్చారు. దీని అమలుకు ఏ ఖరీదైన హార్డ్‌వేర్‌తోనో అవసరం పడక పోవడమే ఈ పరిష్కారంలో అన్నింటి కన్నా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. ఇది ఏ యాండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లోనైనా పనిచేస్తుంది. దీని కోసం పర్యవేక్షకులు తమ మొబైల్ ఫోన్లను వాడారు. ఫలితంగా హార్డ్‌వేర్ మీద పెట్టాల్సిన ఖర్చు తగ్గిపోయింది. ఆధునిక రవాణా వ్యవస్థతో ముడిపడి ఉండే భారం కూడా తొలగిపోయింది.
ఈ అప్లికేషన్‌కు సంబంధించి మరొక ముఖ్య విశేషం దీని ప్రతిస్పందన వేగం. దీనిని ఉపయోగించి ఏ అభ్యర్థి ముఖాన్నైనా గుర్తించడానికి కేవలం 6 సెకన్లు లేదా 8 సెకన్ల సమయం సరిపోతుంది. దీంతో పరీక్షాకేంద్రాల్లోకి ప్రవేశించడం సులభం అయింది. బారులు తీరి ఎదురుచూడాల్సిన అవసరం లేకపోయింది. దీనిని ఒకే కాలంలో 7,000 కన్నా ఎక్కువ పర్యవేక్షకులు ఉపయోగించారంటే ఈ అప్లికేషన్ సామర్థ్యం ఎంత ఎక్కువగా ఉందో తెలుసుకోవచ్చు. రద్దీ బాగా ఎక్కువగా ఉన్న సమయంలో, ఒక్కో నిమిషానికీ ఇంచుమించు 12,000 గుర్తింపులను ఇది పూర్తి చేసింది.
ఈ కార్యక్రమాన్ని గురించి యూపీఎస్‌సీ చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ, ‘‘ఇది ఒకరు మరొకరుగా నడుచుకొనే వీలు లేకుండా చూడటానికి (ఇంపర్సనేషన్) యూపీఎస్‌సీ తీసుకున్న ఒక కొత్త నిర్ణయం. ఈ సాంకేతికతను ఎన్ఈజీడీ (NeGD) సహాయాన్ని తీసుకుని పూర్తి సొంతంగా తయారు చేశాం. ఏమైనా, ఈ పరిష్కారపూర్వక చర్య కోసం విధి నిర్వహణలో ఉన్న పర్యవేక్షక సిబ్బంది సేవల్ని వినియోగించుకోవడం, ముఖ గుర్తింపును నిర్ధారించడానికి వారికి శిక్షణను ఇవ్వడం.. ఈ పనులన్నిటినీ కొద్ది కాలంలోనే పూర్తి చేయడంతో పాటు దీనిని విస్తృత స్థాయిలో అమలు చేయడం అంటే అది ఒక పెద్ద సవాలు లాగా అనిపించింది. సుమారు 5.5 లక్షల అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని 2,000 కన్నా ఎక్కువ చోట్లలో దీనిని విజయవంతంగా అమలుపరచడంలో యూపీఎస్‌సీ, ఎన్ఈజీడీ, ఎమ్ఈఐటీవై బృందాలు గొప్పగా పనిచేశాయి’’ అని పేర్కొన్నారు.
వాస్తవ కాలంలో ముఖ ప్రమాణీకరణ ప్రణాళికను విజయవంతంగా అమలు చేసే ప్రయోగం సివిల్ సర్వీసెస్ పరీక్ష ప్రక్రియ సమగ్రతను పటిష్ఠపరిచే దిశగా ఒక కీలక చర్య. పబ్లిక్ పరీక్షల్లో పారదర్శకత్వాన్ని, నిష్పాక్షికతని, సాంకేతిక నవకల్పనలని పరిరక్షించే విషయంలో కమిషన్ తన నిబద్ధతను నిరంతరం కొనసాగిస్తుండటాన్ని ఈ విధానం చాటిచెబుతోంది.

***


(रिलीज़ आईडी: 2269155) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati , Tamil , Malayalam