వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
సెక్షన్ 301 విచారణ, కార్యాచరణ ఒప్పందం ఖరారుపై అమెరికాతో సంప్రదింపులు చేపడుతోన్న భారత్
प्रविष्टि तिथि:
03 JUN 2026 12:22PM by PIB Hyderabad
వస్తువుల దిగుమతిని నిరోధించడానికి భారతదేశంతో సహా 60 ఆర్థిక వ్యవస్థలు తీసుకున్న చర్యలకు సంబంధించి, యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్‌టీఆర్) ఆ దేశాలపై దర్యాప్తును ముగించింది. ఫలితంగా, యూఎస్ వాణిజ్య చట్టం-1974 ప్రకారం ఈ 60 ఆర్థిక వ్యవస్థల నుంచి చేసుకొనే దిగుమతులపై అదనపు సుంకాలు విధించాలని యూఎస్‌టీఆర్ ప్రతిపాదించింది. సెక్షన్ 232 సుంకాల పరిధిలోకి వచ్చే ఉత్పత్తులు, కొన్ని ఇతర ఉత్పత్తులకు సుంకాల ప్రతిపాదనల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఎంపిక చేసిన ఆర్థిక వ్యవస్థల నుంచి నిర్ధిష్ట పరిమాణంలో జౌళి, వస్త్ర ఉత్పత్తుల దిగుమతులు తక్కువ పన్ను రేట్లతో అమెరికాలోకి ప్రవేశించడానికి అనుమతించేలా ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ప్రతిపాదించారు.
నివేదిక ప్రకారం, ప్రతిపాదిత సుంకాలు ఇంకా ఖరారు కాలేదు. బహిరంగ విచారణలో పాల్గొనేందుకు సంబంధిత దేశాలు 2026 జూన్ 22 లోగా అభ్యర్థనలను సమర్పించవచ్చు. లిఖితపూర్వక వ్యాఖ్యలను 2026 జులై 6 వరకు సమర్పించవచ్చు. బహిరంగ విచారణ 2026 జులై 7న జరుగుతుంది. ప్రతిపాదిత చర్యలకు సంబంధించి తుది నిర్ణయాన్ని తీసుకొనే ముందు తనకు అందిన వ్యాఖ్యలను, నివేదనలను యూఎస్‌టీఆర్ పరిగణనలోకి తీసుకుంటుంది.
సెక్షన్ 301 విచారణలో భాగంగా ఈ విషయంపై అమెరికాతో భారత్ సంప్రదింపులు కొనసాగిస్తోంది. 2026 ఫిబ్రవరి 2న ప్రకటించినట్లుగా, 2026 ఫిబ్రవరి 7న జారీ చేసిన ఉమ్మడి ప్రకటనకు అనుగుణంగా, కార్యాచరణ ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు కూడా అమెరికాతో భారత్ సంప్రదింపులు చేపడుతోంది.
***
(रिलीज़ आईडी: 2268320)
आगंतुक पटल : 10