ప్రధాన మంత్రి కార్యాలయం
భారత్-ఒమన్ సీఈపీఏ… దాని ప్రయోజనాలను వివరిస్తున్న వ్యాసాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
01 JUN 2026 12:52PM by PIB Hyderabad
కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
ఈ వ్యాసం ప్రధానంగా భారత్-ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) భారతీయ ఎగుమతిదారు సంస్థలకు మార్కెట్లను విస్తరించుకొనే అవకాశాన్ని ఇవ్వడం, ఉద్యోగావకాశాల్ని పెంచడం, రైతుల ప్రయోజనాల్ని కాపాడడంతో పాటు, ఇరు దేశాల మధ్య సమృద్ధిని ఎలా పెంపొందింప చేస్తుందో వివరించింది. అభివృద్ధి చెందిన దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకునే దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషి దేశ పౌరుల జీవితాన్ని మెరుగుపరచడంలో తోడ్పడుతోందని కూడా ఈ వ్యాసం స్పష్టం చేస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘భారత్-ఒమన్ సీఈపీఏ.. భారతీయ ఎగుమతిదారు సంస్థలకు మార్కెట్లను విస్తరించుకొనే అవకాశాన్ని ఇవ్వడం, ఉద్యోగావకాశాలను పెంచడం, రైతుల ప్రయోజనాలను కాపాడడంతో పాటు ఇరు దేశాల మధ్య సమృద్ధిని ఎలా పెంపొందింప చేస్తుందో ఈ వ్యాసంలో కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ వివరించారు.
అభివృద్ధి చెందిన దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకునే దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు దేశంలో ప్రతి ఒక్కరి జీవితాన్ని మెరుగుపరచడంలో తోడ్పడుతున్నాయని ఆయన స్పష్టం చేశారు’’ అని పేర్కొంది.
***
(రిలీజ్ ఐడి: 2267479)
సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam