ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గోవా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 30 MAY 2026 8:36AM by PIB Hyderabad

 గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా  ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

 

గోవా అనగానే అక్కడి ఉజ్వలమైన సంస్కృతి, సుసంపన్నమైన వారసత్వం, ప్రకృత్రి అందాలు, ఆప్యాయతో కూడిన ప్రజలకు ప్రసిద్ధి చెందిందని ప్రధానమంత్రి అన్నారు.

 

గోవా రాష్ట్రం సాధించిన ప్రగతికి, దాని ప్రత్యేక గుర్తింపు కోసం అహర్నిశలు శ్రమించిన మహానుభావులందరినీ  కృతజ్ఞతతో స్మరించుకోవడానికి నేడు గొప్ప అవకాశమని పేర్కొన్నారు.

 

భవిష్యత్తులో గోవా మరింతగా అభివృద్ధి చెందుతూ, వికసిత్‌ భారత్ నిర్మాణంలో రాష్ట్రం మరింత కీలకమైన పాత్ర పోషిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

 

‘‘గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక సందర్భంలో రాష్ట్ర ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. గోవా  ఉత్సాహభరితమైన సంస్కృతి, గొప్ప వారసత్వం, సహజ సిద్ధమైన ప్రకృతి అందాలు, అక్కడి ప్రజల ఆప్యాయత అందరికీ ఎంతో సుపరిచితం. ఈ రాష్ట్ర ప్రగతి కోసం, గుర్తింపు కోసం అవిశ్రాంతంగా శ్రమించిన వారందరినీ కృతజ్ఞతతో గుర్తుచేసుకోవడానికి నేడు ఒక మంచి సందర్భం. గోవా ఇలాగే నిరంతరం అభివృద్ధి చెందుతూ, వికసిత్‌ భారత్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని కోరుకుంటున్నాను. ప్రతి గోవా పౌరుడి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నాను’’.

***


(రిలీజ్ ఐడి: 2267159) సందర్శకుల సూచీ సంఖ్య : : 55