వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కెనడా-భారత్ సంయుక్త ప్రకటన 2026: వాణిజ్యం, పెట్టుబడుల సమగ్ర వేదిక

నాడు పోస్టు చేయడమైనది: 29 MAY 2026 9:00AM by PIB Hyderabad

ఇరు దేశాల్లో ఆర్థిక వృద్ధికి, వ్యాపారాల కోసం పెరిగిన వాణిజ్య అవకాశాలకు తోడ్పడే స్పష్టమైన ఫలితాలను అందించేందుకు... ద్వైపాక్షిక వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పట్ల కెనడా, భారత్ మంత్రులు శ్రీ సిధూ, శ్రీ గోయల్‌లు తమ ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఇటీవలి మంత్రుల స్థాయి సమావేశాల ద్వారా సాధించిన పురోగతిని కొనసాగిస్తూ... కెనడాలో పర్యటిస్తున్న భారత వాణిజ్య మంత్రి శ్రీ గోయల్‌ సహా ఆయన నేతృత్వంలోని అతిపెద్ద భారతీయ ప్రతినిధి బృందానికి ఆ దేశ మంత్రి సిధూ సాదర స్వాగతం పలికారు. పరిశుద్ధ ఇంధనం, కీలక ఖనిజాలు, వ్యవసాయం-ఆహారం, అధునాతన తయారీ, డిజిటల్ టెక్నాలజీలు, నైపుణ్యాభివృద్ధి వంటి అనుబంధ రంగాల్లో సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి గల అవకాశాలను వారు ప్రధానంగా ప్రస్తావించారు.

ప్రతిష్ఠాత్మక, పరస్పర ప్రయోజనకరమైన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ)ను ముందుకు తీసుకెళ్లడం పట్ల ఇరువురు మంత్రులు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఈ సంవత్సరం చివరి నాటికి దీనికి సంబంధించిన చర్చలను పూర్తి చేయాలనే ఉమ్మడి లక్ష్యాన్నీ వారు ధ్రువీకరించారు. మార్కెట్‌ను మరింత అందుబాటులో ఉండేలా విస్తరించడం, పటిష్ఠమైన సరుకు రవాణా వ్యవస్థలకు మద్దతునివ్వడం, ఇరు దేశాలు ఆర్థిక వృద్ధిని సాధించడంలో సీఈపీఏ ప్రాముఖ్యాన్ని వారు స్పష్టం చేశారు.

కెనడా, భారతీయ వ్యాపార రంగ ప్రముఖులను ఒకచోట చేర్చి, కొత్త వాణిజ్య భాగస్వామ్యాలను పెంపొందించి, వ్యాపార సంబంధాలను వృద్ధి చేసే ఒక కీలక వేదికగా... ఇరు దేశాల మంత్రులు కెనడా-భారత్ వాణిజ్య, పెట్టుబడి ఫోరంను ప్రారంభించారు.

వాణిజ్య విస్తరణ, పెట్టుబడులను సులభతరం చేసే అంశాలైన ప్రజల మధ్య సంబంధాలు, వ్యాపార సంబంధిత రాకపోకలు, ప్రత్యక్ష వాణిజ్య అనుసంధానాలు సహా భారత్-కెనడా మధ్య కనెక్టివిటీని మరింత మెరుగుపరచాల్సిన ప్రాముఖ్యతను ఇరు దేశాల మంత్రులు ప్రధానంగా ప్రస్తావించారు.

భారత మార్కెట్లో తమ ఉనికిని విస్తరించుకోవడంలో కెనడియన్ వ్యాపార సంస్థలకు ఉన్న బలమైన ఆసక్తిని, వాణిజ్య భాగస్వామ్యాలను మరింతగా పెంపొందించుకోవాలనే ఉమ్మడి ఆకాంక్షను ప్రతిబింబిస్తూ... ఈ ఏడాది చివర్లో 'టీమ్ కెనడా ట్రేడ్ మిషన్' నేతృత్వంలో కెనడా బృందం భారత్‌లో పర్యటిస్తుందని మంత్రి సిధూ ధ్రువీకరించారు.

ప్రాధాన్య రంగాల్లో దీర్ఘకాలిక, నాణ్యమైన పెట్టుబడులను ప్రోత్సహించుటను కొనసాగించడానికి, ఇరు దేశాల్లోని వ్యాపారులు, ఆవిష్కర్తలు, సంస్థాగత భాగస్వాముల మధ్య లోతైన సహకారానికి మద్దతునివ్వడానికి కెనడా, భారత్ అంగీకరించాయి. రాబోయే నెలల్లో నిరంతర చర్చలను కొనసాగించడానికి, నిర్దిష్ట ఫలితాలను సాధించడానికి కట్టుబడి ఉన్నట్లు ఇరు దేశాల మంత్రులు ప్రకటించారు.

***


(రిలీజ్ ఐడి: 2266504) సందర్శకుల సూచీ సంఖ్య : : 20
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Punjabi , Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Manipuri , Gujarati , Tamil , Kannada