మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నీట్‌-యూజీ 2026 పునఃపరీక్ష సన్నద్ధతపై ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కే రాధాకృష్ణన్‌తో కలిసి కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ సమీక్ష నిఘా చర్యల అంచనా, బలోపేతంపై సమావేశంలో సుదీర్ఘ చర్చ

నాడు పోస్టు చేయడమైనది: 27 MAY 2026 7:57PM by PIB Hyderabad

త్వరలో నిర్వహించే నీట్-యూజీ పునఃపరీక్ష (రీ ఎగ్జామ్‌సన్నాహాలనుఏర్పాట్లను సమీక్షించేందుకు ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కే రాధాకృష్ణన్‌తో కలిసి కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారునేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి (ఎన్‌టీఏసంబంధించిన సిఫార్సుల అమలును పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి స్టీరింగ్ కమిటీకి డాక్టర్ కే రాధాకృష్ణన్ ఛైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.

ఈ కీలక సమావేశంలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శినేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ఎన్‌టీఏ ఉన్నతాధికారులుకేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.

సమావేశం సందర్భంగా పరీక్షల భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికిఎలాంటి ఆటంకాలు లేకుండా పరీక్షను ప్రశాంతంగా నిర్వహించడానికి చేపట్టిన అదనపు చర్యల గురించి ఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్ కమిటీ సభ్యులకు వివరించారుపరీక్షా కేంద్రాలలో ప్రస్తుతం ఉన్న నిఘా వ్యవస్థల సమగ్ర పరిశీలనతో పాటుభద్రతను మరింత పెంచేందుకు రూపొందించిన ప్రణాళికలపై చర్చించారు.

పరీక్షల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం ఎల్లప్పుడూ ముఖ్యమేనని పేర్కొంటూ.. దేశవ్యాప్తంగా ఉన్న పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను కల్పించడానికీవారికి అనుకూలమైన వాతావరణాన్ని అందించడానికి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు.

నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నీట్-యూజీ రీ ఎగ్జామ్‌ 2026 జూన్ 21వ తేదీన జరగనుందిదేశవ్యాప్తంగా 550 నగరాల్లో ఏర్పాటు చేసిన 5,400 పైగా పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు.

***


(రిలీజ్ ఐడి: 2266301) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Bengali , Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Tamil