ఆయుష్
azadi ka amrit mahotsav

ప్రజలకు అందుబాటులోకి వచ్చిన ‘ఐడీవై 2026’ బహుభాషా హ్యాండ్‌బుక్


అంతర్జాతీయ యోగా దినోత్సవం, కామన్ యోగా ప్రోటోకాల్‌తో పాటు మంత్రిత్వ శాఖ కార్యక్రమాలపై సమగ్ర గైడు ఇక ఇంగ్లీషు, హిందీతో పాటు 21 ప్రాంతీయ భాషల్లో లభ్యం

నాడు పోస్టు చేయడమైనది: 26 MAY 2026 3:46PM by PIB Hyderabad

‘అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై)- 2026’కు సంబంధించిన సన్నాహాలు దేశం నలుమూలలతోపాటు  ప్రపంచం అంతటా కూడా జోరందుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ దీని నిర్వహణతో ముడిపడిన ఆసక్తిదారులందరినీ  దృష్టిలో పెట్టుకొని విస్తృత ‘ఐడీవై హ్యాండ్‌బుక్- 2026’ను తీసుకువచ్చింది. నిర్వాహకులు, సంస్థలు, యోగా సాధకులు, ప్రభుత్వ సంస్థలు, విద్యాసంస్థలు, సాముదాయిక సమూహాల సహకారాన్ని తీసుకుని ఈ బహు భాషా చిన్న పుస్తకాన్నిరూపొందించారు.  ఐడీవై, కామన్ యోగా ప్రోటోకాల్ (సీవైపీ), మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కార్యక్రమాలతో పాటు ప్రజల భాగస్వామ్య అవకాశాలకు సంబంధించి అవసరమైన సమాచారాన్ని పొందడానికి కూడా పనికివచ్చే ఓ సరళమైన దస్తావేజులా తీర్చిదిద్దారు.
ఇంగ్లిషు, హిందీ భాషలతో పాటు 21 ప్రాంతీయ భాషల్లో లభ్యమయ్యే ఈ పుస్తకం.. అంతర్జాతీయ యోగా దినోత్సవం, కామన్ యోగా ప్రోటోకాల్ (సీవైపీ), మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రధాన కార్యక్రమాలతో పాటు 2026వ సంవత్సరానికి సంబంధించిన అవకాశాల సమాచారాన్ని ఒకే చోట గుదిగుచ్చి అందిస్తోంది.
ఈ పుస్తకం యోగాతో పాటు ఐడీవైతో ముడిపడిన ప్రామాణిక సమాచారాన్ని అనేక భారతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకువచ్చి దీని సౌలభ్యాన్ని పెంచి, విస్తృత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించనుంది.  విద్యాసంస్థలు, ప్రభుత్వ విభాగాలు, పౌర సమాజ సంస్థలతో పాటు యోగాకు సంబంధించిన కార్యకలాపాలను ఏర్పాటు చేయడంలో భాగం పంచుకున్న సాముదాయిక సమూహాలు సహా దేశమంతటా ఆసక్తిదారులకు సహకారాన్ని అందించడం కోసం ఈ పుస్తకాన్ని రూపొందించారు.
ఐక్యరాజ్యసమితి 2014లో ఆమోదం తెలిపినప్పటి నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవం పురోగమిస్తూ వచ్చిన తీరుపై  సంక్షిప్త వివరణను ఈ చిన్నపుస్తకం అందిస్తుంది. అంతేకాక, ఐడీవై 2026 సందర్భంగా నిర్వహించాలనుకుంటున్న ప్రధాన కార్యక్రమాల రూపురేఖలను కూడా ఇది తెలియజేస్తుంది. ఆయా కార్యక్రమాల్లో.. ‘యోగా సంగమ్’, ‘హరిత యోగా’, ‘యోగా సమావేశ్’, ‘యోగా పార్కు’, ‘యోగా అన్‌ప్లగ్‌డ్’ వంటి మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యక్రమాల వివరణను చేర్చారు. అలాగే 2026 జూన్ 21 వరకూ చేపట్టబోయే కార్యకలాపాలను ఒక క్రమపద్ధతిలో పొందుపరిచారు.
సమాచారాన్ని తెలియజేయడం ఒక్కటే కాకుండా, ఆచరణీయ డిజిటల్ టూల్‌కిట్‌గా కూడా ఈ చిన్నపుస్తకం ఉపయోగపడుతుంది. దీనిలో క్యూఆర్ కోడ్, సూచనలతో కూడిన సామగ్రికి దారితీసే లింకులను ఇచ్చారు. వాటిలో ఇంగ్లిషు, హిందీ భాషలతో పాటు 21 ప్రాంతీయ భాషల్లోనూ ఉమ్మడి యోగా ప్రోటోకాల్ వీడియోలు ఉన్నాయి. వాటిని చూసి, దేశ పౌరులు ప్రామాణిక యోగా మార్గదర్శకత్వాన్ని సులభ శైలిలో అవగాహనను ఏర్పరుచుకోవచ్చు.
ఈ చిన్న పుస్తకంలో మైగవ్ (MyGov) ద్వారా ఏర్పాటు చేసే పోటీలు,  ప్రజల భాగస్వామ్యం తాలూకు వివిధ కార్యకలాపాలతో పాటు భాగస్వామ్యానికి గల అవకాశాల సమాచారాన్ని పొందుపరిచారు. ఇవి ఈ సంవత్సరంలో రానున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పౌరులు చురుకుగా పాలుపంచుకొనేటట్లు వారికి ప్రోత్సాహాన్ని ఇస్తాయి.
ఈ చిన్న పుస్తకాన్ని IDY Handbook 2026 లో పొందవచ్చు.

 

***


(రిలీజ్ ఐడి: 2265459) సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Tamil , Kannada