యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ క్రీడా పరిపాలక మండలి నియమాలతో పాటు జాతీయ క్రీడా ప్రత్యేక న్యాయస్థానం నియమాలు-2026ను ప్రకటించిన ప్రభుత్వం


జాతీయ క్రీడా సంస్థల గుర్తింపుతో పాటు పాలన ప్రమాణాలను పర్యవేక్షించనున్న జాతీయ క్రీడా మండలి

క్రీడా వివాదాల్ని సత్వరంగా, స్వతంత్రంగా, తక్కువ ఖర్చులో పరిష్కరించనున్న జాతీయ క్రీడా ప్రత్యేక న్యాయస్థానం

నాడు పోస్టు చేయడమైనది: 26 MAY 2026 8:01AM by PIB Hyderabad

జాతీయ క్రీడా పరిపాలన చట్టం-2025 నిబంధనల్లో భాగంగా జాతీయ క్రీడా పరిపాలన (జాతీయ క్రీడా ప్రత్యేక న్యాయస్థానం) నియమాలు-2026తో పాటు జాతీయ క్రీడా పరిపాలన (జాతీయ క్రీడా ప్రత్యేక న్యాయస్థానం) నియమాలు-2026ను కూడా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది.
జాతీయ క్రీడా పరిపాలన (జాతీయ క్రీడా మండలి) నియమాలు-2026లో మండలి కూర్పు, చైర్‌పర్సన్‌తో పాటు సభ్యుల పదవీకాలం, జీతం, భత్యాలు, సేవకు సంబంధించిన ఇతర షరతులు సహా మండలికి ఉండే అధికారాలు, విధులను పొందుపరిచారు.
నియమాల ప్రకారం, జాతీయ క్రీడా మండలి (అన్వేషణ సహా ఎంపిక సంఘం) నియమాలు-2026లో భాగంగా ఏర్పాటు చేసిన అన్వేషణ సహా ఎంపిక సంఘం సిఫార్సు చేసిన పేర్ల ప్యానల్ నుంచి కేంద్ర ప్రభుత్వం నియమించిన చైర్‌పర్సన్, ఇద్దరు సభ్యులతో జాతీయ క్రీడా మండలిని ఏర్పాటు చేస్తారు.
జాతీయ క్రీడా సంస్థలకు గుర్తింపును ఇవ్వడమే కాక పరిపాలన, ఆర్థిక, నైతిక ప్రమాణాలను పాటించేటట్లు నిర్ధారించే కేంద్ర ప్రాధికార సంస్థగా కూడా జాతీయ క్రీడా మండలి పనిచేస్తుంది.
ప్రత్యేక న్యాయస్థానం చైర్‌పర్సన్, సభ్యుల పదవీకాలం, వారి నియామకం, పునర్నియామక ప్రక్రియ, జీత భత్యాలు, సేవకు సంబంధించిన షరతులు, ప్రత్యేక న్యాయస్థానానికి ఉండే అధికారాలను  జాతీయ క్రీడా పరిపాలన (జాతీయ క్రీడా ప్రత్యేక న్యాయస్థానం) నియమాలు-2026లో పొందుపరిచారు.
ఈ నియమాల్లో డిజిటల్ మాధ్యమం ద్వారా అమలుకు సంబంధించిన సాంకేతిక, చట్టపరమైన చర్యలను కూడా చేర్చారు. వీటిలో కేంద్ర ప్రభుత్వం ద్వారా వివాదాలు, నోటీసులు, జవాబులు, దస్తావేజులు, వివరణలను సమర్పించడంతో పాటు, ప్రత్యేక న్యాయస్థానం పంపించే కమ్యూనికేషన్, ఆదేశాల ప్రచురణ, దృశ్య మాధ్యమం సహాయంతో విచారణలకు తోడు, రికార్డుల నిర్వహణకే ఉద్దేశించిన ఒక ప్రత్యేక పోర్టల్‌కు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఉంది.
దేశంలో క్రీడలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి ఒక ప్రత్యేక న్యాయ నిర్ణయ సంస్థ (అజుడికేటరీ బాడీ)గా  జాతీయ క్రీడా ప్రత్యేక న్యాయస్థానం పనిచేస్తుంది. సివిల్ కోర్టులపై ఆధారపడటాన్ని తగ్గించడం, క్రీడల నిర్వహణ, పరిపాలనలకు సంబంధించిన వివాదాలను స్వతంత్రంగా, శీఘ్రంగా, ప్రభావవంతంగా, తక్కువ ఖర్చులో పరిష్కరించేటట్లు చూడడం దీని లక్ష్యాలు.
అంతకంతకూ పెరుగుతున్న వ్యాజ్యాల సంఖ్యను తగ్గించడం, క్రీడా వివాదాలను త్వరిత గతిన, సరళ రీతిన, అన్ని వర్గాలకు సులభమైన పద్దతిలో పరిష్కరించడానికి ఒక ఏక గవాక్ష యంత్రాంగాన్ని ఈ ప్రత్యేక న్యాయస్థానం అందిస్తుందని భావిస్తున్నారు.
జాతీయ క్రీడా ప్రత్యేక న్యాయస్థానం-2026 కు సంబంధించి నోటిఫై చేసిన పూర్తి వివరాలు ఈ కింది లింకులో చదువగలరు:
https://egazette.gov.in/WriteReadData/2026/272847.pdf
జాతీయ క్రీడా మండలి -2026 కు సంబంధించి నోటిఫై చేసిన నియమాల పూర్తి  వివరాలను ఈ కింది లింకులో చదువగలరు:
https://egazette.gov.in/WriteReadData/2026/272844.pdf

***


(రిలీజ్ ఐడి: 2265350) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Manipuri , Gujarati , Tamil , Kannada , Malayalam