ప్రధాన మంత్రి కార్యాలయం
కర్ణాటకలోని కారవార్‌లో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధాని
పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం అందించనున్నట్లు తెలిపిన ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
24 MAY 2026 6:51PM by PIB Hyderabad
కర్ణాటకలోని కారవార్ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ. 2 లక్షల చొప్పున పరిహారాన్ని అందించనున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఈ ఘటనలో గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున సహాయం చేయనున్నట్లు ఆయన తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:
"కర్ణాటకలోని కారవార్ జిల్లాలో జరిగిన ప్రమాదం గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
మరణించిన వారి కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల చొప్పున పరిహారం అందించనున్నాం. గాయపడిన వారికి రూ. 50,000 అందుతాయి.”
****
(రిలీజ్ ఐడి: 2264886)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam