రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రయాణాల్లో అప్రమత్తంగానూ, జాగ్రత్తగానూ ఉండాలంటూ ప్రయాణికులకు రైల్వేల విజ్ఞప్తి


నా అనుమానాస్పదమైన పనులుగానీ, లేదా అలాంటి పని చేసే వ్యక్తుల సమచారాన్ని హెల్ప్‌లైన్ నంబరు 139కి తెలియజేయండి..

దీని ద్వారా రైల్వేల్ని లక్ష్యంగా చేసుకొనే సంఘ వ్యతిరేక శక్తుల్ని అడ్డుకోవచ్చు

రైల్వేల్ని లక్ష్యంగా చేసుకుని ఇటీవల జరిగిన సంఘటనల నేపథ్యంలో క్షేత్ర అధికారులతో న్యూఢిల్లీలో భద్రతా సమావేశం నిర్వహణ.. రైల్వే మంత్రి సమీక్ష

ఆధునిక సాంకేతికతతో క్షేత్రాల వారీ రహస్య సమాచార సేకరణ ప్రక్రియకు మెరుగులు: శ్రీ అశ్వినీ వైష్ణవ్

నాడు పోస్టు చేయడమైనది: 21 MAY 2026 2:13PM by PIB Hyderabad

రైళ్లు, ప్రయాణికులుస్టేషన్ పరిసరాలతో పాటు రైల్వేల విస్తృత వ్యవస్థకు ఇప్పుడున్న భద్రతను పెంచడానికి కృత్రిమ మేధ (ఏఐ)నీడ్రోన్లనీసీసీటీవీ వంటి అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాల్నీ రైల్వేల శాఖ ఉపయోగించుకుంటోందిఇందులో భాగంగా రైల్వే పరిరక్షక దళం (ఆర్‌పీఎఫ్బీటు స్థాయిలో రహస్య సమాచారాన్ని సమీకరించే యంత్రాంగాన్ని బలోపేతం చేస్తున్నారుఈ రోజు న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక కీలక ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశంలోరైల్వే మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో దేశవ్యాప్తంగా ఉన్న క్షేత్ర స్థాయి అధికారులతో చర్చించారు. రైల్ భవన్‌లో సాగిన ఈ సమావేశానికి రైల్వే మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ అధ్యక్షత వహించారురైల్వేల సహాయ మంత్రి శ్రీ విసోమన్నరవ్‌నీత్ సింగ్ బిట్టూతో పాటు రైల్వే బోర్డు చైర్మన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
గత కొన్ని రోజులుగాఅగ్నిప్రమాద ఘటనలు సహా వివిధ సంఘటనలు చోటుచేసుకోగా వాటిపై ప్రాథమిక దర్యాప్తును చేపట్టినప్పుడు అసాంఘిక శక్తుల ప్రమేయం ఉన్నట్లు బయటపడిందిఇలాంటి ఘటనలను భారతీయ రైల్వే తీవ్రంగా పరిగణిస్తోందిఈ ఘటనలపై ఆర్‌పీఎఫ్ చురుకుగా దర్యాప్తు చేస్తోందిఅనేక కేసుల్లోరైల్వేలు తక్షణం క్రియాత్మక చర్యల్ని చేపట్టడంతో పెద్ద దుర్ఘటనలను నివారించగలిగారురహస్య సమాచార సేకరణ వ్యవస్థల్ని బలోపేతం చేయడందొరికిన ఆధారాల్ని శీఘ్రంగా పరిశీలించడానికి సాంకేతికతను ఉపయోగించుకోవడానికి తోడుప్రయాణికుల్ని వారి యాత్రాకాలంలోనూవారు స్టేషన్లలో వేచి ఉండటానికి ఏర్పాటు చేసిన గదుల్లో బస చేసినప్పుడూ అసాంఘిక కార్యకలాపాల్ని అరికట్టే యత్నాలకు చురుకైన సహకారాన్ని అందించేటట్లుగా రైల్వే శాఖ ప్రోత్సహించాలన్న అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైందిప్రయాణికులు ప్రయాణ వేళల్లో అప్రమత్తంగా ఉండాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసిందిరైల్వేలకు సంబంధించిన పరిసరాల్లో ఏదైనా అనుమానాస్పదంగా ఉన్న పనిగానీలేదా అనుమానాస్పద వ్యక్తులను చూసినప్పుడు గానీ వెంటనే ఆ సమాచారాన్ని రైల్వే హెల్ప్‌లైన్ నంబరు 139కి అందించాలని కోరారు.
మెరుగైన రిపోర్టింగ్ వ్యవస్థ సాయంతో క్షేత్ర స్థాయిలో రహస్య సమాచారాన్ని సమీకరించే యంత్రాంగాల్ని పటిష్ఠపరిచే దిశగా శ్రద్ధ తీసుకోవాలని భద్రతా సమీక్ష సమావేశ చర్చల్లో సంకల్పించారుసాంకేతికత ఆధారిత భద్రతా వ్యవస్థల్ని మెరుగుపరచడంరైల్వే వ్యవస్థలో సీసీటీవీ సేవాపరిధిని విస్తరించడంతో పాటు రైల్వే బోర్డు ప్రధానకేంద్రానికీఫీల్డ్ జోన్లకూ మధ్య కార్యకలాపాల నిర్వహణ సంబంధిత భద్రతా సమన్వయాన్ని బలోపేతం చేయడం ఎంతైనా అవసరమని స్పష్టం చేశారుసైబర్ భద్రతకెమెరాలకు నిర్దేశించిన ప్రమాణాల్ని పెంచడంఏఐ ఆధారిత నిఘాపర్యవేక్షణ వ్యవస్థల్ని వినియోగించడంపైనా సమావేశంలో చర్చించారు.  రైల్వే వ్యవస్థ అంతటా మరింత దీటైన భద్రతా నిర్వహణ కోసం ఆర్‌పీఎఫ్‌కీప్రభుత్వ రైల్వే పోలీసు (జీఆర్‌పీ)కీ మధ్య సమాచారాన్ని పంచుకునే యంత్రాంగాల్ని ఇప్పటి కన్నా మెరుగ్గా తీర్చిదిద్దిపరస్పర సహకారాన్ని బలపరిచడంపైనా సమావేశంలో దృష్టిని కేంద్రీకరించారు.

****

 

(రిలీజ్ ఐడి: 2263963) సందర్శకుల సూచీ సంఖ్య : : 16