రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

హనోయ్‌లో ద్వైపాక్షిక చర్చలు జరిపిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వియత్నాం ఉప ప్రధాని, రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ జియాంగ్


ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతినీ, స్థిరత్వాన్నీ, భద్రతనూ, సురక్షితమైన-స్వేచ్ఛాయుతమైన వాణిజ్యాన్నీ కొనసాగించేందుకు నిబద్ధతను పునరుద్ఘాటించిన ఉభయపక్షాలు

వియత్నాంలోని ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ కాలేజీలో లాంగ్వేజ్ ల్యాబ్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన మంత్రులు

ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ రంగాల్లో ఎంవోయూ కుదుర్చుకున్న ఇండియా, వియత్నాం

నహత్రాంగ్ లోని టెలి కమ్యూనికేషన్స్ విశ్వవిద్యాలయంలో ఏఐ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన రక్షణ మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 19 MAY 2026 12:38PM by PIB Hyderabad

2026 మే 19న హనోయ్‌లో వియత్నాం ఉప ప్రధానిజాతీయ రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ జియాంగ్‌తో రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారురెండు దేశాల మధ్య వృద్ధి చెందుతున్న రక్షణ భాగస్వామ్యాన్ని నాయకులిద్దరూ సమీక్షించారునౌకా వాణిజ్య భద్రతరక్షణ పరిశ్రమశిక్షణప్రాంతీయ స్థిరత్వంలో కొనసాగుతున్న సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాల గురించి చర్చించారు.

 

image.jpeg

ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా మారుతున్నపరస్పరం ఆసక్తి ఉన్న భద్రతా పరిణామాలపై తమ అభిప్రాయాలను ఉభయ పక్షాలు పంచుకున్నాయిఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతినీస్థిరత్వాన్నిభద్రతనూస్వేచ్ఛాయుతమైనసురక్షితమైన నౌకా వాణిజ్యాన్నీ కొనసాగించేందుకు ఇవ్వాల్సిన ప్రాధాన్యాన్ని స్పష్టం చేశాయిసైనిక శిక్షణరక్షణ పారిశ్రామిక సహకారంనౌకావాణిజ్య భద్రతసామర్థ్య నిర్మాణంఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణసైబర్ భద్రతఅత్యున్నత స్థాయి వినిమయం తదితర అంశాల్లో సహకారాన్ని విస్తరించే మార్గాలపై చర్చించారుక్రమం తప్పకుండా చర్చలూసంయుక్త విన్యాసాలూవినియమ కార్యక్రమాల నిర్వహణ ద్వారా రెండు దేశాల రక్షణ బలగాల మధ్య సహకారాన్ని పెంపొందించుకొనేందుకు వారు అంగీకరించారు.

image.jpeg

 

వియత్నాం, భారత్ మధ్య కొనసాగుతున్న విస్తరించిన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నామని రక్షణ మంత్రి స్పష్టం చేశారుద్వైపాక్షిక రక్షణ భాగస్వామ్యం పరిధిలో వియత్నాం రక్షణ ఆధునికీకరణకూసామర్థ్య విస్తరణ కార్యక్రమాలకూ తోడ్పాటునందించడంలో భారతదేశానికున్న చిత్తశుద్ధిని ఆయన పునరుద్ఘాటించారు.

 

వియత్నాంకు భారత్ అందిస్తున్న నిరంతర మద్దతునూ, రెండు దేశాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న స్నేహాన్నీపెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్నీ జనరల్ ఫాన్ వాన్ జియాంగ్ ప్రశంసించారు.

 

image.jpeg

 

వియత్నాంలో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన లాంగ్వేజ్ ల్యాబ్‌ను రక్షణ మంత్రులిద్దరూ వర్చువల్ విధానంలో ప్రారంభించారుభారత దేశ సహకారంతో దీనిని ఏర్పాటు చేశారునహత్రాంగ్ లోని టెలి కమ్యూనికేషన్స్ ల్యాబ్ వద్ద ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తామని రక్షణ మంత్రి ప్రకటించారు.

 

కృత్రిమ మేధక్వాంటమ్ టెక్నాలజీ రంగాల్లో భారత్‌లోని మిలటరీ కాలేజ్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్వియత్నాంలోని టెలి కమ్యూనికేషన్స్ విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయిఇది రెండు దేశాల మధ్య విస్తరించిన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో ముఖ్యమైన అధ్యాయాన్ని సూచిస్తుంది.

 

దైపాక్షిక సమావేశం అనంతరం వియత్నాం ప్రధాన కార్యదర్శి, అధ్యక్షుడు శ్రీ టో లామ్‌తో రక్షణ మంత్రి సమావేశమయ్యారుభారత రాష్ట్రపతిప్రధానమంత్రి తరఫున ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేశారుఅలాగే రక్షణ-భద్రతవాణిజ్యం-పెట్టుబడులునౌకా వాణిజ్య సహకారంఅనుసంధానతడిజిటల్ పరివర్తనప్రజా సంబంధాలు తదితర రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడం పట్ల భారతదేశానికున్న నిబద్ధతను పునరుద్ఘాటించారు.

 

image.jpeg

ఉమ్మడి నాగరికతా సంబంధాలు, పరస్పర విశ్వాసంఉమ్మడి వ్యూహాత్మక ప్రయోజనాలపై ఆధారపడిన భారత్వియత్నాం మధ్య ఉన్న బలమైనశాశ్వతమైన స్నేహాన్ని నాయకులిద్దరూ పునరుద్ఘాటించారుఇండియా-వియత్నా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధిస్తున్న వృద్ధి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

 

భారత్‌లో తన పర్యటనను వియత్నాం అధ్యక్షుడు గుర్తు చేసుకున్నారు. ద్వైపాక్షిక సహకారంలో సాధించిన వృద్ధిని ప్రశంసించారువియత్నాం అభివృద్ధివ్యూహాత్మక ప్రాధాన్యాల్లో కీలక భాగస్వామిగా భారత్ పోషిస్తున్న పాత్రను గుర్తించారురెండు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో ప్రధాన ఆధారంగా రక్షణ సహకారం బలోపేతమవడాన్ని ఆయన స్వాగతించారుభవిష్యత్తులో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడతాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

 

image.jpeg

వియత్నాం వ్యవస్థాపకుడు, మాజీ అధ్యక్షుడు హో చి మిన్ 136వ జయంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పుష్ఫగుచ్ఛం ఉంచి నివాళులర్పించారుఅనంతరం అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ‘‘ఆయన దార్శనికతనాయకత్వంజాతీయ స్వేచ్ఛప్రపంచ ఐక్యత పట్ల నిబద్ధత తరతరాలకూ స్ఫూర్తినిస్తూనే ఉంటుందిఉమ్మడి విలువలుపరస్పర గౌరవంతో కూడిన భారత్-వియత్నాం స్నేహానికి ఆయన బలమైన పునాది వేశారు’’ అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.

పరస్పర విశ్వాసం, ఉమ్మడి విలువలురక్షణభద్రతప్రాంతీయ స్థిరత్వంలో సన్నిహిత సహకారంపై ఆధారపడిన బలమైన బంధం భారత్వియత్నాం మధ్య ఉంది.

 

image.jpeg

***


(రిలీజ్ ఐడి: 2262826) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Tamil , Malayalam