రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రూ.993 కోట్ల ఖర్చుతో అరక్కోణమ్-చెంగల్పట్టు డబ్లింగ్ ప్రాజెక్టుకు భారతీయ రైల్వేల ఆమోద ముద్ర


ఈ ప్రాజెక్టుతో చెన్నై సబర్బన్ రైల్ నెట్‌వర్కుకు ఊతం

రద్దీని తగ్గించి, ప్రయాణికుల రాకపోకలను సుగమం చేయడంతో పాటు సిమెంటు, ఆటోమొబైల్స్, ఆహారధాన్యాల రవాణాకు దన్నుగా అరక్కోణమ్-చెంగల్పట్టు డబ్లింగ్ ప్రాజెక్టు: శ్రీ అశ్వినీ వైష్ణవ్

प्रविष्टि तिथि: 19 MAY 2026 11:05AM by PIB Hyderabad

రూ.993 కోట్ల ఖర్చుతో అరక్కోణం-చెంగల్పట్టు రైలు మార్గం డబ్లింగ్ ప్రాజెక్టు (దీని పొడవు 68 కిలోమీటర్లు)కు భారతీయ రైల్వేలు ఆమోదముద్ర వేసిందిఈ ప్రాజెక్టుతో దేశమంతటా సురక్షితవేగవంతసమర్థవంతమైన రైలు రవాణా సౌకర్యాన్ని అందిస్తానన్న భారతీయ రైల్వేల వాగ్దానం మరింత బలాన్ని పుంజుకోనుందిచెన్నై బీచ్తాంబరమ్అరక్కోణమ్‌లను కలిపే ప్రధానమైన చెన్నై సబర్బన్ ర్క్యులర్ రైల్ నెట్‌వర్కులో ఓ భాగం ఈ అరక్కోణం-చెంగల్పట్టు సెక్షన్.
ఒత్తిడి ఎక్కువగా ఉండే చెన్నై సబర్బన్ రైల్ నెట్‌వర్కులో రద్దీని తగ్గించడంతో పాటు సమయపాలననీకార్యకలాపాల నిర్వహణలో సమర్ధతనీ మెరుగుపరచడంలో అరక్కోణం-చెంగల్పట్టు రైలు మార్గం డబ్లింగ్ ప్రాజెక్టు ఒక ముఖ్య పాత్రను పోషించనుందని రైల్వే శాఖ కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ తెలిపారుఈ ప్రాజెక్టు.. ఈ ప్రాంతంలో ప్రయాణికుల రాకపోకలతో పాటు సరకు రవాణానూ పటిష్ఠపరుస్తుందనీఫలితంగా సిమెంటుఆటోమొబైల్స్ఆహార ధాన్యాలుఇనుముఉక్కు వంటి కీలక సరకుల రవాణాకు కూడా ప్రయోజనం కలుగుతుందనీ ఆయన వివరించారు.
ఇప్పటికే ఉన్న డబల్ లైనును పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటున్నారురాబోయే సంవత్సరాల్లో రాకపోకలు మరింత ఎక్కువ అవుతాయన్న అంచనా ఉందిదీనిని దృష్టిలో పెట్టుకొనిఅదనపు మౌలిక సదుపాయాల్ని అందుబాటులోకి తీసుకు రావాల్సిన అవసరం ఏర్పడింది. డబ్లింగ్ పనులు పూర్తి చేసిన తరువాత రైళ్లు నిలిచి ఉండాల్సిన సమయం తగ్గిసమయపాలనలో మెరుగుదల చోటుచేసుకొంటుందిశివారు ప్రాంతాలకు అందుతున్న సేవలు ఇప్పటితో పోలిస్తేమరింత పెరుగుతాయి.
ఈ మార్గం మహీంద్రా వరల్డ్ సిటీశ్రీపెరుంబుదూర్ఒరగడమ్ఇరుంగట్టుకోట్టై సహా అనేక ప్రధాన ఆర్థికపారిశ్రామిక కూడళ్లతో పాటు ముఖ్య ఆటోమొబైల్సిమెంట్తయారీ పరిశ్రమలకు సేవలను అందిస్తోందికాంచీపురం సమీపంలో ప్రతిపాదించిన పరండూర్ విమానాశ్రయ ప్రాజెక్టు ఇదే మార్గానికి దగ్గరగా ఏర్పడటం ఈ మార్గానికి వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని మరింత పెంచుతోంది.
దేశంలో రైల్వే రంగంలో మౌలిక సదుపాయాల్ని ఆధునికీకరించేనెట్‌వర్క్ సామర్థ్యాల్ని పెంపొందింపచేసేకీలక కారిడార్లలో కార్యకలాపాల నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరిచే దిశగా భారతీయ రైల్వేలు చేపడుతున్న నిరంతర ప్రయత్నాల్లో అరక్కోణం-చెంగల్పట్టు రైలు మార్గం డబ్లింగ్ ప్రాజెక్టుకు ఆమోదం తెలపడం కూడా ఒకటిఈ ప్రాజెక్టు.. శివారు ప్రాంతాలకు రాకపోకల్ని పటిష్ఠపరచడంసరకు రవాణాకు సంబంధించిన అనుసంధానాన్ని ఇప్పటి కన్న బలోపేతం చేయడంప్రాంతీయ పారిశ్రామికాభివృద్ధికి ఇతోధిక ప్రోత్సాహాన్ని అందించడంతో పాటు శీఘ్రసురక్షితమరింత ఎక్కువ విశ్వసనీయ రవాణా సేవల్ని అందుబాటులోకి తీసుకువస్తుందని భావిస్తున్నారు.

***
 


(रिलीज़ आईडी: 2262672) आगंतुक पटल : 63
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , हिन्दी , Punjabi , Gujarati , Tamil , Kannada