లోక్‌సభ సచివాలయం
azadi ka amrit mahotsav

లోక్‌సభ గౌరవ స్పీకరుకు నివేదికను సమర్పించిన న్యాయమూర్తుల విచారణ సంఘం

నాడు పోస్టు చేయడమైనది: 18 MAY 2026 9:31PM by PIB Hyderabad

జస్టిస్ శ్రీ యశ్వంత్ వర్మపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన న్యాయమూర్తుల విచారణ సంఘం ఈ విషయానికి సంబంధించిన నివేదికను లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓమ్ బిర్లాకు ఈ రోజు సమర్పించిందిన్యాయమూర్తుల (విచారణచట్టం-1968 లో పేర్కొన్న చట్టబద్ధ ఆవశ్యకతలకు అనుగుణంగా అందజేసిన ఈ నివేదికను తగిన సమయంలో పార్లమెంటు ఉభయసభలకు సమర్పిస్తారు.
న్యాయమూర్తుల విచారణ సంఘం నివేదికను బాంబే హైకోర్టు న్యాయమూర్తి గౌరవ జస్టిస్ శ్రీ చంద్రశేఖర్కర్నాటక హైకోర్టు సీనియర్ న్యాయవాది శ్రీ బి.విఆచార్యలతో పాటు విచారణ సంఘం ప్రిసైడింగ్ అధికారిసుప్రీంకోర్టు న్యాయమూర్తి గౌరవ జస్టిస్ అరవింద్ కుమార్‌ 2026 మే నెల 18న పార్లమెంటు భవనంలో లోక్‌సభ స్పీకరుకు అందజేశారు.
ఈ  సంఘాన్ని లోక్‌సభ స్పీకర్ 2025 ఆగస్టు12న ఏర్పాటు చేశారు.

 

***


(రిలీజ్ ఐడి: 2262654) సందర్శకుల సూచీ సంఖ్య : : 26
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam