ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిక్కిం ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 16 MAY 2026 1:32PM by PIB Hyderabad

సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది సిక్కిం తన 50వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ తరుణం, ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో సిక్కిం అందిస్తున్న సహకారం ఎంతో విలువైనదనిప్రశంసనీయమైనదని ప్రధానమంత్రి కొనియాడారు. ఈ 50వ అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా ఇటీవల తాను సిక్కింలో పర్యటించిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ... అక్కడి ప్రజలు చూపిన ఆప్యాయతఅభిమానం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని శ్రీ మోదీ అన్నారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

 

‘‘నా సిక్కిం సోదర సోదరీలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. దేశ ప్రగతిలో సిక్కిం పాత్ర ఎంతో విశిష్టమైనది. ఆ రాష్ట్ర ప్రజలు నిరంతర ఆయురారోగ్యాలతోఐశ్వర్యంతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.

 

సిక్కిం తన 50వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న తరుణంలో ఈ శుభ సందర్భం వచ్చింది. కొన్ని రోజుల కిందటే ఈ వేడుకల సందర్భంగా సిక్కిం ప్రజల మధ్య ఉండే అదృష్టం నాకు కలిగింది. సిక్కింలో నేను పొందిన ఆదరణ నా జ్ఞాపకాలలో చిరకాలం నిలిచిపోతుంది. రాబోయే కాలంలో కూడా సిక్కిం అభివృద్ధి పథానికి కేంద్ర ప్రభుత్వం మద్దతునిస్తూనే ఉంటుంది’’.

***


(రిలీజ్ ఐడి: 2261834) సందర్శకుల సూచీ సంఖ్య : : 4