ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని వడోదరాలో సర్దార్‌ధామ్ హాస్టల్ ప్రారంభోత్సవం సందర్భంగా పీఎం ప్రసంగం

నాడు పోస్టు చేయడమైనది: 11 MAY 2026 10:09PM by PIB Hyderabad

భారత్ మాతాకీ జై.

భారత్ మాతాకీ జై.

ప్రజాదరణ పొందిన గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవికేంద్రమంత్రివ్యవస్థాపక ట్రస్టీ మన్‌సుఖ్ మాండవీయసర్దార్‌ధామ్ అధ్యక్షుడు గగ్జీ భాయ్ సుతారియాదుష్యంత్ భాయ్ పటేల్పంకజ్ భాయ్ పటేల్రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జగదీశ్ విశ్వకర్మవేదికపైనున్న గుజరాత్ మంత్రులుదాతలుట్రస్టీలువిశిష్ట అతిథులుగుజరాత్ నలుమూలల నుంచి విచ్చేసిన నా ప్రియమైన సోదరీసోదరులందరికీ నమస్కారం.

పవిత్రమైన పండగ లాంటి రోజు ఇదిఇక్కడికి రావటానికి ముందుగా నేను సోమనాథ్ ఆలయాన్ని సందర్శించానుసోమనాథ్ ఆలయ పునఃప్రతిష్ట జరిగి ఇవాళ్టికి 75 ఏళ్లు పూర్తయ్యాయిసర్దార్ పటేల్ దృఢ సంకల్పం వల్లే సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం జరిగిందిఈ సందర్భంగా ప్రభాస్ పటాన్‌లో సోమనాథ్ అమృత్ మహోత్సవం ఘనంగా జరుగుతోందిఈ రోజునే వడోదరాలో సర్దార్‌ధామ్‌కు సంబంధించిన పలు కీలక ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలుశంకుస్థాపనలు జరగటం విశేషండాక్టర్ దుష్యంత్దక్షా పటేల్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంవిద్యా సహాయక పథకం ప్రారంభంనూతన ప్రాజెక్టుల భూమిపూజ వంటి కార్యక్రమాలన్నీ భవిష్యత్తులో దేశ నిర్మాణానికి శక్తిమంతమైన సాధనాలుగా మారతాయిఈ సంస్థలు యువత భవిష్యత్తుకు కీలక మార్గాలుగా నిలుస్తాయిఇలాంటి గొప్ప కార్యానికి పూనుకున్న మీ అందరికీసమాజంలోని ప్రతి సభ్యునికి అభినందనలు.

మిత్రులారా,

ఇవాళ మీ అందరి మధ్యకు రావటం చాలా ఆనందంగా ఉందిబెంగాల్అస్సాంపుదుచ్చేరిలో ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా ఉత్సాహభరితమైన వాతావరణాన్ని నెలకొల్పాయిదానితో పాటు మీరంతా కలిసి సరికొత్త చరిత్రను సృష్టించారుగుజరాత్‌లో మున్సిపల్పంచాయతీ ఎన్నికల ఫలితాలు కూడా ప్రత్యేకమైనవిదేశవ్యాప్తంగా అందరూ ఈ ఫలితాల గురించి చర్చించుకుంటున్నారు.

మిత్రులారా,

రాజకీయ స్థిరత్వానికి గుజరాత్ ప్రజలు ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిస్తారురాజకీయాల్లో దూరదృష్టిని ఇది ప్రతిబింబిస్తుందిరాజకీయ స్థిరత్వాన్ని వారు అర్థం చేసుకున్నారుఎప్పుడైతే రాజకీయ స్థిరత్వం నెలకొంటుందో అప్పుడే ఆర్థిక వృద్ధి వేగాన్ని పుంజుకుంటుందిఈ సూత్రాన్ని గుజరాత్ ఎప్పుడో అర్థం చేసుకుందిగుజరాత్ వృద్ధిలోనూవరుస ఎన్నికల విజయాల్లోనూ ఇది స్పష్టమవుతోంది.

మిత్రులారా,

మీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకుమీ అందరి మధ్యకు రావటం నాకు అద్భుతమైన అనుభూతినిస్తుందిసొంతింటికి వచ్చినట్లుగా ఉంటుందిఎందుకంటే మీ మధ్యలో ఉన్నప్పుడు సమాజంలోని శక్తిని నేను అనుభూతి చెందుతానుమనందరికీ తెలుసు.. సమాజ సమష్టి శక్తి వల్లే నిజమైన మార్పు సాధ్యమవుతుందిప్రత్యేకించి ఏ సమాజాలైతే విద్యకు ప్రాధాన్యతనిచ్చివిద్యా రంగంలో సమాన అవకాశాలు కల్పిస్తాయో.. అవి పురోగతి సాధిస్తూఉన్నత శిఖరాలను అధిరోహిస్తాయి.

సోదరీసోదరులారా,

సర్దార్‌ధామ్ ప్రతి ప్రయత్నంలోనూఅవకాశం దొరికిన ప్రతీసారి మీకు అండగా ఉండేందుకు నేను ప్రయత్నిస్తానుగగ్జీభాయ్ ఇందాక చెప్పినట్లుగా 2021లో అహ్మదాబాద్‌లో జరిగిన సర్దార్‌ధామ్ కార్యక్రమంలో నేను పాల్గొన్నానుఅక్కడ బాలికల హాస్టల్‌కు శంకుస్థాపన జరిగిందిదాన్ని గతేడాది ప్రారంభించారునేడు వేలాదిమంది ఆడబిడ్డలు అక్కడ విద్యనభ్యసిస్తూతమ కలలకు దిశానిర్దేశం చేసుకుంటున్నారు. సూరత్రాజ్‌కోట్భుజ్మెహసానాఢిల్లీలో సర్దార్‌ధామ్‌కు చెందిన ఎన్నో సంస్థలు యువత భవిష్యత్తునుల తీర్చిదిద్దుతున్నాయిఇవాళ కూడా అహ్మదాబాద్‌లోని నికోల్‌లో వెయ్యిమంది బాలికలకు వసతి కల్పించేలా నూతన హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.

మిత్రులారా,

మార్పు విస్తృతంగాదాని ఫలితాలు శాశ్వతంగా ఉండాలంటే ప్రజలుప్రభుత్వం కలిసి పని చేయాలిప్రస్తుతం విద్యా రంగంలో క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు జరుగుతున్నాయిజాతీయ విద్యా విధానమే ఇందుకు ప్రధాన ఉదాహరణనేడు యువతకు అడ్డంకులు తొలగిపోతున్నాయిభాషా ప్రాతిపాదికన ఉన్న వివక్ష అంతమవుతోందిఇప్పుడు విద్య కేవలం పుస్తకాలుడిగ్రీలకే పరిమితం కావటం లేదునైపుణ్యాభివృద్ధిఆవిష్కరణలను కూడా విద్యలో అంతర్భాగం చేశారుపరిశోధనలపై ఆసక్తి గల యువతకు సరైన వాతావరణం ఉంటుందిడిగ్రీలు పూర్తయిన తర్వాత అనుభవం లేకపోవటం వల్ల యువత అయోమయంలో పడకుండా ఉండేందుకు అప్రెంటిస్‌షిప్ అవకాశాలు అందుతున్నాయిభవిష్యత్తులో దేశంలో ఎంతటి నైపుణ్యం గల సిబ్బంది ఉంటారో ఒక్కసారి ఊహించుకోండిదీనివల్ల భారత తయారీ రంగానికి పెద్దఎత్తున ప్రయోజనం చేకూరుతుంది.

మిత్రులారా,

సహజంగానే గుజరాత్ యువతకు పారిశ్రామికవేత్తలుగా రాణించగల సత్తా ఉందివారి కలల సాకారానికి స్టార్టప్ ఇండియా మిషన్ దోహదపడుతుందిచిన్న పట్టణాల్లోని యువత పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారుచిన్న నగరాల నుంచి పెద్ద అంకుర సంస్థలు పుట్టుకొస్తున్నాయిఅంకుర సంస్థల్లో మహిళల భాగస్వామ్యం కూడా పెరుగుతోందిఒకప్పుడు సాహసోపేతమని భావించిన రంగాలు ఇప్పుడు యువతకు ప్రాధాన్యతగా మారుతున్నాయిక్రీడల నుంచి అంతరిక్ష సాంకేతికత వరకు గత 10 నుంచి 12 ఏళ్లుగా దేశం సాధించిన విజయాలే ఇందుకు అతిపెద్ద నిదర్శనందీనివల్ల మన గుజరాత్ బిడ్డలు ఎంతగానో లబ్ధి పొందుతున్నారు.

మిత్రులారా,

సమాజంలో సగ భాగమైన మహిళల భాగస్వామ్యమే.. సమాజ పురోగతికి అత్యంత కీలకంఈ విషయాన్ని రెండు దశాబ్దాల కిందటే గ్రహించిన గుజరాత్.. ఆ దిశగా పటిష్ఠమైన చర్యలు తీసుకుంది.

మిత్రులారా,

విజయవంతమైన గుజరాత్ నమూనానే దేశవ్యాప్తంగా పునరావృతమవుతోందినేడు కోట్లాది మంది మహిళలకు బ్యాంకు ఖాతాలున్నాయిమరుగుదొడ్లునీటి కనెక్షన్లుగ్యాస్ కనెక్షన్లను పొందారుముద్ర యోజన ద్వారా మహిళలు స్వావలంబన సాధిస్తున్నారుకుటుంబ పరిధిలో మహిళలు ఆరోగ్యంగా ఉండేందుకు ఆయుష్మాన్ భారత్మాతృవందన్ వంటి పథకాలు రక్షణ కవచంలా పనిచేస్తున్నాయి.

మిత్రులారా,

గతంలో అనేక రంగాల్లో ఆడపిల్లలకు అవకాశాలుండేవి కాదుకానీ నేడు చాలా రంగాల్లో మహిళలు నాయకత్వ స్థాయిలో ఎదుగుతున్నారుఇప్పుడు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మహిళలు శిక్షణ పొందుతున్నారుమన కుమార్తెలు ఫైటర్ పైలట్లుగా మారుతున్నారురాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయిరాజకీయ కారణాల వల్ల దానికి ఆమోదం లభించలేదుకానీ.. మీకుదేశంలోని మహిళలందరికీ నేను హామీ ఇస్తున్నానుఈ దిశగా మా పోరాటం కొనసాగుతుంది.

మిత్రులారా,

ప్రతి రంగంలోనూ మహిళలకు అవకాశాలు కల్పించటం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు.. సమాజ బాధ్యత కూడాసర్దార్‌ధామ్ ఈ బాధ్యతను పూర్తి అంకితభావంతో నెరవేరుస్తున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాఈ ప్రయత్నాలకు మీ అందరికీ ప్రత్యేక అభినందనలుధన్యవాదాలు తెలియజేస్తున్నా.

మిత్రులారా,

మారుతున్న కాలానికనుగుణంగా సమాజం అడుగులు వేయటం గుజరాత్‌కున్న అతిపెద్ద బలంమార్పును అవకాశంగా మలచుకోవటంకొత్త అవకాశాలను అందిపుచ్చుకోవటంభవిష్యత్తుకు సిద్ధమవటం ఎల్లప్పుడూ గుజరాత్ పని సంస్కృతిలో భాగంగా ఉంటుందినేడు ప్రపంచం అత్యాధునిక సాంకేతికత వైపు పయనిస్తుంటేగుజరాత్ కూడా నూతనోత్సాహంతో దూసుకుపోతోందిసెమీకండక్టర్ తయారీఏరోస్పేస్అడ్వాన్స్‌డ్ ఇంజనీరింగ్గ్రీన్ ఎనర్జీఆర్థిక సేవల్లో గుజరాత్ కొత్త గుర్తింపును ఏర్పరచుకుంటోందిసనంద్‌లో మేడ్ ఇన్ ఇండియా సెమీకండక్టర్ల ఉత్పత్తి జరుగుతోందికేన్స్ సెమీకండక్టర్ ప్లాంట్‌లోనూ ఉత్పత్తి ప్రారంభమైందిధోలేరాసూరత్‌లోనూ కొత్త సెమీకండక్టర్ ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయి.

మిత్రులారా,

ప్రపంచ సరఫరా వ్యవస్థలో ప్రధాన కేంద్రాలుగా భారతదేశాన్నిగుజరాత్‌ను మార్చేందుకు మేం నిరంతరం కృషి చేస్తున్నాంరాబోయే ఏళ్లలో వడోదరా కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తుందిఇక్కడ తయారైన మెట్రో కోచ్‌లు ఇతర దేశాలకు ఎగుమతవుతున్నాయిసావ్లీలో ఆధునిక రైలు వ్యవస్థలుకోచ్‌లు సిద్ధమవుతున్నాయిఇంజనీరింగ్భారీ యంత్రాలురసాయనాలుఫార్మాస్యూటికల్స్విద్యుత్ పరికరాలుఎంఎస్ఎంఈ రంగాల్లో బలమైన తయారీ కేంద్రంగా వడోదరా ఎదిగిందిఇక్కడి గతి శక్తి విశ్వవిద్యాలయం రవాణాలాజిస్టిక్స్ రంగాల్లో నిపుణులను తీర్చిదిద్దుతోందిఇప్పుడు ఏరోస్పేస్ రంగంలోనూ కొత్త గుర్తింపు దిశగా వడోదరా అడుగులు వేస్తోందిఇక్కడి విమానాల తయారీ ప్రాజెక్టు వేగంగా పురోగమిస్తోంది.

మిత్రులారా,

గుజరాత్‌లోదేశంలోనూ జరుగుతున్న ఈ అభివృద్ధి ప్రయత్నాల మధ్య మరో అంశం రోజురోజుకీ సున్నితంగా మారుతోందికొన్నేళ్లుగా ప్రపంచం అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటోందిమొదట కరోనా సంక్షోభంతర్వాత ఆర్థిక సవాళ్లుఇప్పుడు పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులుఈ పరిస్థితులు నిరంతరం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయిభారత్ పైనా వాటి ప్రభావం పడుతోందిఈ శతాబ్దపు అతిపెద్ద సంక్షోభం కరోనా అయితే.. పశ్చిమాసియాలోని యుద్ధ పరిస్థితులు ఈ దశాబ్దపు అతిపెద్ద సంక్షోభాల్లో ఒకటిమనమంతా కలిసి మహమ్మారిని జయించినట్లే.. ఈ సంక్షోభాన్ని కూడా అధిగమిద్దాం.

ప్రజల ఇబ్బందులను తగ్గించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందిఇలాంటి సమయంలో దేశానికి ప్రజా భాగస్వామ్య శక్తి అవసరంభారత పౌరులుగా బాధ్యతలకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలిగతంలోనూ దేశం యుద్ధాలనుపెద్ద పెద్ద సంక్షోభాలను ఎదుర్కొన్నప్పుడల్లా ప్రభుత్వ పిలుపు మేరకు పౌరుల బాధ్యతలను నెరవేర్చారుదేశ వనరులపై భారాన్ని తగ్గించేందుకు ఇప్పుడు కూడా మనమంతా కలిసి పనిచేయాలిపలు ఉత్పత్తుల దిగుమతికి లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని భారత్ ఖర్చు చేస్తోందిఅదే సమయంలో దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయిసరఫరా వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయిదీనివల్ల ప్రస్తుతం దేశం రెండు రకాల సవాళ్లను ఎదుర్కొంటోంది.

ఒక్కో నీటి బొట్టుతో కుండ నిండినట్లుగా.. చిన్న చిన్న ప్రయత్నాలతో దిగుమతి వస్తువుల వినియోగాన్ని తగ్గించాలివిదేశీ మారక ద్రవ్య ఖర్చుకు దారితీసే వ్యక్తిగత పనులకు దూరంగా ఉండాలి.

మిత్రులారా,

భారతదేశ దిగుమతుల్లో ముడి చమురు ప్రధానమైనదిప్రపంచానికి చమురును సరఫరా చేసే ప్రాంతందురదృష్టవశాత్తు యుద్ధంఘర్షణలతో అట్టుడుకుతోందికాబట్టి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు మనమంతా చిన్న ప్రతిజ్ఞలు చేయాలినిన్న కర్ణాటకతెలంగాణలోనూ ఇదే విషయం గురించి మాట్లాడానుఇవాళ గుజరాత్ లోనూ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నానుమీపై నాకున్న హక్కుతో ఎంతో ఆప్యాయంగా చెబుతున్నానువీలైనంతగా పెట్రోల్డీజిల్ వాడకాన్ని తగ్గించండిమెట్రో సర్వీసులుఎలక్ట్రిక్ బస్సులుప్రజా రవాణాను వినియోగించండికార్ పూలింగ్‌ను ప్రోత్సహించండికార్లు ఉన్నవారు ఇతరులతో కలిసి ప్రయాణించండిఎలక్ట్రిక్ వాహనాలున్నవారు ఇతరులకు సహాయం చేయటానికి ముందుకు రావాలి.

మిత్రులారా,

డిజిటల్ సాంకేతికత జీవితాలను సులభతరం చేసిందిదీనివల్ల మనకు ఎన్నో ప్రయోజనాలున్నాయిప్రభుత్వప్రైవేటు కార్యాలయాలు వర్చువల్ సమావేశాలకుఇంటి నుంచి పనిచేసే విధానాలకు ప్రాధాన్యతనివ్వటం చాలా ముఖ్యంపాఠశాలలు కొంతకాలం పాటు ఆన్‌లైన్ తరగతుల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నా.

మిత్రులారా,

కేవలం ఇంధనం మాత్రమే కాదు.. వంట నూనెల దిగుమతులకు కూడా భారీ మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయాల్సి వస్తుందివంట నూనెల వినియోగాన్ని తగ్గిస్తే.. దేశానికిఆరోగ్యానికి మేలు జరుగుతుందిముఖ్యంగా సూరత్ ప్రజలకు నేను ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెబుతున్నాను.

మీ కుటుంబసభ్యుడిలా సోదరీసోదరులుకు ఒక విన్నపం చేస్తున్నానుబంగారం దిగుమతి వల్ల విదేశీ మారక ద్రవ్యం భారీగా దేశం దాటి పోతుందిపరిస్థితులు చక్కబడే వరకు దేశ ప్రజలంతా బంగారం కొనుగోలును వాయిదా వేయాలని కోరుతున్నాప్రస్తుతానికి బంగారం అవసరం అంతగా లేదు.

మిత్రులారా,

"ఓకల్ ఫర్ లోకల్నినాదాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఎంతో ఉందివిదేశీ వస్తువులకు బదులుగా స్వదేశీ ఉత్పత్తులను వాడండిమీ గ్రామాలుపట్టణాలుదేశంలోని పారిశ్రామికవేత్తలను బలోపేతం చేయండిఇక్కడున్న వారిలో చాలామంది అద్భుతమైనప్రపంచ స్థాయి ప్రమాణాలు గల వస్తువులను ఉత్పత్తి చేస్తున్నారు.

మిత్రులారా,

మనలో చాలా మంది రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లేవ్యవసాయంలో స్వదేశీ ఎరువులనుప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలిడీజిల్ పంపు సెట్ల స్థానంలో సోలార్ పంపులను తీసుకురావాలిమనం రైతు బిడ్డలంమన పొలాలనుభూమిని కాపాడుకోవటం ప్రథమ కర్తవ్యంరసాయనిక ఎరువులతో నేలను మనం నాశనం చేసుకోకూడదుమీ గ్రామంలోని ప్రతి రైతును రసాయనిక ఎరువుల నుంచి విముక్తి చేసిప్రకృతి వ్యవసాయం దిశగా నడిపించాలని మిమ్మల్ని కోరుతున్నా.

మిత్రులారా,

మీలో చాలా మందికి వర్తించే మరో ముఖ్యమైన విషయం... దయచేసి తప్పుగా భావించవద్దుఈ రోజుల్లో సెలవులు రాగానే పిల్లలను విదేశీ పర్యటనలకు పంపటం ఫ్యాషన్ గా మారిందిసెలవులను గడిపేందుకు ప్రజలు విదేశాలకు వెళ్తున్నారువేసవి సెలవులు సమీపిస్తున్నాయిప్రస్తుతం విదేశీ ప్రయాణాలువిదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ ధోరణి పెరుగుతుందిగతంలో ప్రజలు నాకు ఆహ్వాన పత్రికలు పంపేవారుఇప్పుడు రావటం లేదుఎందుకంటే వివాహాలన్నీ విదేశాల్లోనే జరుగుతున్నాయిదీనివల్ల విదేశీ మారక ద్రవ్యం భారీగా ఖర్చవుతోంది.

మిత్రులారా,

ఒకసారి ఆలోచించండిసెలవులను గడిపేందుకు భారతదేశంలో అందమైన ప్రదేశాలు లేవామన పిల్లలకు చరిత్రను నేర్పిద్దాంమన ప్రాంతాల పట్ల గర్వపడేలా చేద్దాందేశవ్యాప్తంగానే విహారయాత్రలు చేయటం ఎంతో ముఖ్యంవివాహాలకు భారత్ కంటే పవిత్రమైన ప్రదేశం మరొకటి ఉండదని నా విశ్వాసంఇక్కడ వివాహాలు జరిగితే.. మాతృభూమి మనల్ని ఆశీర్వదిస్తుంది.

వివాహ వేడుకల కోసం భారత్ లో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలున్నాయిమనం వాటినే ఎంచుకోవాలిగుజరాత్‌లోనే లెక్కలేనన్ని అందమైన ప్రదేశాలున్నాయిముఖ్యంగా నా పాటిదార్ సోదరులకు నేను చెప్పేదేమిటంటే.. ఇకపై మీరు ఐక్యతా విగ్రహం వద్ద వివాహ వేడుకలను నిర్వహించాలిఅక్కడ ప్రతి జంటను స్వయంగా సర్దార్ పటేల్ ఆశీర్వదిస్తారుశాంతిఆధ్యాత్మికత కోసం హరిద్వార్రిషికేశ్‌లో ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయో.. అదేవిధంగా ఐక్యతా విగ్రహం వద్ద కూడా వివాహాల కోసం అన్ని వసతులను అభివృద్ధి చేయాలి.

ఇటీవల కాలంలో ఐక్యతా విగ్రహంఏక్తా నగర్ ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా మారాయివీలైనంత ఎక్కువ మంది ఐక్యతా విగ్రహాన్ని సందర్శించేలా ప్రోత్సహించాలని మనం సంకల్పించుకుందాంవిదేశాల్లో నివసించే భారతీయులందరికీ నేనొక విషయం చెబుతున్నాభారతదేశాన్ని చూపించేందుకు విదేశీ కుటుంబాలను ప్రోత్సహించటం వారి బాధ్యతభారత్విదేశాల్లోనూ మీకు తెలిసినఐక్యతా విగ్రహాన్ని సందర్శించని ప్రతి కుటుంబాన్ని కనీసం ఒక్కసారైనా అక్కడికి వెళ్లేలా ప్రోత్సహించండివివాహాలకు అద్భుతమైన గమ్యస్థానంగా ఏక్తా నగర్ మారగలదుఐక్యతా విగ్రహం వద్ద సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయిప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం సర్దార్ వల్లభాయ్ పటేల్‌ది కావటం మనకు గర్వకారణందీన్ని చూసిన ఏ భారతీయుడైనా గర్వంతో ఉప్పొంగిపోతాడు.

మిత్రులారా,

నేను చెప్పినవన్నీ చిన్న చిన్న ప్రయత్నాలేకష్టమైన పనులు చేయమని నేను మిమ్మల్ని కోరలేదుకానీ గుర్తుంచుకోండి. 140 కోట్ల మంది భారతీయులు సంకల్పంతో కలిసి చేసే ఈ చిన్న ప్రయత్నాలే దేశానికి మహాశక్తిగా మారతాయి. 140 కోట్ల మంది ప్రజలు ఒక అడుగు ముందుకు వేస్తే.. దేశం 140 కోట్ల అడుగులు ముందుకు సాగుతుంది.

ఏ సంక్షోభం కూడా మన అభివృద్ధినిపురోగతిని అడ్డుకోకుండా మనం మరోసారి ఏకమవ్వాలిమనమంతా కలిసి ఈ తీర్మానాలను నెరవేర్చిదేశాన్ని బలోపేతం చేస్తామనే నమ్మకం నాకుంది.

నేను గగ్జీ భాయ్‌కి ఒక మాట చెప్పాలనుకుంటున్నామీరు నన్ను సర్దార్ గౌరవ్ రత్న అవార్డుతో గౌరవించారుసర్దార్ పటేల్ పేరుతో ఉన్న సత్కారం బాధ్యతను పెంచుతుందిఒక రకంగా చెప్పాలంటే.. గగ్జీ భాయ్ తెలివిగా నాకు ఈ బాధ్యతను ముడిపెట్టివెనకడుగు వేయవద్దని చెప్పారుబహుశా సర్దార్ సాహెబ్ కలలనుఆయన వదిలిన అసంపూర్ణ పనులను పూర్తి చేయాలని నా నుదుటి రాతలో ఉందేమో.

ఈ రోజు ఈ గౌరవాన్నిఅవార్డును అందుకున్న తర్వాత మీ అందరి ఆశీస్సులతో నేనొక హామీ ఇస్తున్నాగుజరాత్ నేల నాకు ప్రసాదించిన శక్తివిలువలతో సర్దార్ సాహెబ్ కలలను సాకారం చేసే విషయంలో నేనెప్పుడూ వెనకడుగు వేయనునా గురించి గుజరాత్‌కు బాగా తెలుసువెనకడుగు వేయటం నా నిఘంటువులోనే లేదు.

ఈ గౌరవం నాకు ఎంతో విలువైనదిజనరల్ కరియప్ప గురించి నేనొక చిన్న కథ చదివానుఒకానొక సందర్భంలో సొంత గ్రామంలో ఆయన్ని సన్మానించేందుకు ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారుదానికి ఆయన ఎంతో సంతోషించారుఎందుకంత సంతోషంగా ఉన్నారని ప్రజలు ఆయన్ని అడిగినప్పుడు.. "సైనిక సంప్రదాయాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నాకు ఎన్నో గౌరవ వందనాలుమర్యాదలు లభించాయికానీ సొంత గడ్డపైమన వారి మధ్య లభించే గౌరవం వల్ల కలిగే అనుభూతే వేరుఅని ఆయన సమాధానమిచ్చారు.

భారతదేశం శక్తిమంతంగా మారుతున్న తరుణంలో నేడు భారత ప్రధానమంత్రికి ప్రపంచవ్యాప్తంగా గౌరవం దక్కుతుందిఅయితే ఒక వ్యక్తికి సొంత ప్రజల నుంచిసొంత కుటుంబం నుంచి ఆశీర్వాదాలు లభించినప్పుడు.. పని చేసే శక్తి రెట్టింపవుతుంది.

మీరందరూ ఈ సర్దార్ రత్న అవార్డు రూపంలో నాకు అందించిన ఆశీర్వాదాలకు ఎంతో కృతజ్ఞుడినిఈ గౌరవాన్ని వినమ్రతతో స్వీకరిస్తున్నాను.

మీరు ఏ ఆశయాలతోసంకల్పాలతో ముందుకు సాగుతున్నారో.. వాటిని నెరవేర్చుకునేందుకు ఆ దేవుడు తగిన శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాసర్దార్ పటేల్ ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలనిపంకజ్ భాయ్ వంటి సహచరుల తోడ్పాటు మీకు నిరంతరం లభించాలని ఆకాంక్షిస్తున్నాఇక్కడున్న మన ముగ్గురి మధ్య ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉందిపంకజ్ భాయ్నరహరి అమీన్నేనుమేమంతా నవనిర్మాణ ఉద్యమం నుంచి వచ్చిన బిడ్డలమేఇవాళ పంకజ్ భాయ్ ఒక గొప్ప బాధ్యతను స్వీకరించటం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది.

మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.

సర్దార్ వర్ధిల్లాలిసర్దార్ వర్ధిల్లాలిధన్యవాదాలుధన్యవాదాలు.

గమనికపీఎం ప్రసంగానికి ఇది స్వేచ్ఛా అనువాదంఅసలు ప్రసంగం హిందీలో ఇచ్చారు.

***


(రిలీజ్ ఐడి: 2260527) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Kannada , Malayalam