హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వరదలు, వడగాలులను ఎదుర్కోవడంలో దేశ సన్నద్ధతపై న్యూఢిల్లీలో సమీక్ష నిర్వహించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో సున్నా ప్రాణనష్టంతో విపత్తు నిర్వహణ లక్ష్యాన్ని సాధించేందుకు మనం కృషి చేయాలి

ప్రతి రాష్ట్రంలోనూ వరద సంక్షోభ నిర్వహణ బృందాలను (ఎఫ్‌సీఎంటీ) ఏర్పాటు చేయాలి
వడగాలుల వల్ల వ్యవసాయ రంగానికి జరిగే నష్టం వీలైనంత తక్కువ ఉండేలా ప్రయత్నించాలి, వాతావరణ సంబంధిత ప్రణాళికలు క్షేత్ర స్థాయికి చేయాలి

విపత్తులకు సంబంధించి ఎన్‌డీఎంఏ జారీ చేసిన మార్గదర్శకాల అమలును ప్రతి రాష్ట్రం, జిల్లా, మున్సిపల్ స్థాయుల్లో సమీక్షించాలి

నీటి నిల్వ, చెక్ డ్యాం ప్రాజెక్టుల ద్వారా జల సంరక్షణ, భూగర్భ నీటి మట్టాలను పెంచేందుకున్న విస్తృత అవకాశాలను అన్వేషించాలి

పర్యావరణ సమతుల్యతను నిర్వహించడానికి చేస్తున్న ప్రయత్నాలను బహుముఖంగా మార్చడమే లక్ష్యంగా సీఏఎంపీఏ నిధులను ఉపయోగించాలి

అధిక ముప్పున్న 60 సరస్సులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసే వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేపట్టాలి

అన్ని రాష్ట్రాల్లోనూ సమీకృత రిజర్వాయర్ నిర్వహణ వ్యవస్థను అమలు చేయాలి

వాతావరణ సూచనలను, హెచ్చరికలను విస్తృతంగా, సమర్థంగా ప్రసారం చేయాలి

నాడు పోస్టు చేయడమైనది: 10 MAY 2026 6:47PM by PIB Hyderabad

న్యూఢిల్లీలో జరిగిన అత్యున్నత సమావేశంలో వరదలువడగాలులను ఎదుర్కోవడంలో దేశ సన్నద్ధతను కేంద్ర హోంసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా సమగ్రంగా సమీక్షించారు.

జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏసహకారంతో జమ్మూ కశ్మీర్లద్ధాఖ్ఉత్తరాఖండ్హిమాచల్‌ప్రదేశ్అరుణాచల్‌ప్రదేశ్సిక్కింలోని అత్యధిక ముప్పు కలిగిన 30 సరస్సుల కోసం అభివృద్ధి చేస్తున్న ముందస్తు హెచ్చరికల వ్యవస్థలో కనీసం 60 సరస్సులను చేర్చాలని ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారుకేంద్రరాష్ట్ర స్థాయుల్లో వరద అంచనా కోసం సమీకృత వ్యవస్థ ఉండాలని శ్రీ షా అన్నారు.

దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ వరద సంక్షోభ నిర్వహణ బృందాలను (ఎఫ్‌సీఎంటీఏర్పాటు చేసివాటిని క్రియాశీలకంగా మార్చాలని కేంద్ర హోం మంత్రి శ్రీ షా చెప్పారువిపత్తులకు సంబంధించి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏజారీ  చేసిన మార్గదర్శకాలు.. అవగాహన పెరగడానికిఏకోన్ముఖ ప్రభుత్వ విధాన అభివృద్ధికి దోహదపడ్డాయన్నారుఅయితే రాష్ట్రంజిల్లామున్సిపల్ స్థాయుల్లో ఈ మార్గదర్శకాల అమలును సమీక్షించడం ద్వారా వాటి ఆచరణను మరింత బలోపేతం చేయవచ్చని తెలిపారుఅటవీ అగ్ని ప్రమాదాలువడగాలులువరదలకు సంబంధించి హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలనుఎన్‌డీఎంఏ మార్గదర్శకాలను ఎన్ని రాష్ట్రాలు అనుసరిస్తున్నాయో అంచనా వేసేందుకు ఎన్‌డీఎంఏ ఓ అధ్యయనం చేపట్టాలని ఆయన అన్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో సున్నా ప్రాణనష్టంతో విపత్తు నిర్వహణ దార్శనికతను అమలు చేసేందుకు కృషి చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అన్నారునీటి నిల్వచెక్‌డ్యామ్ ప్రాజెక్టుల ద్వారా జల సంరక్షణభూగర్భ నీటి మట్టాలను పెంచేందుకున్న అవకాశాలను అన్వేషించాలని చెప్పారుచెక్ ‌డ్యాముల నిర్మాణం ద్వారా నీటిని నిల్వ చేయడంవడగాలుల ప్రభావాన్ని తగ్గించాలని తెలిపారుపర్యావరణ సమతుల్యతను నిర్వహించడానికి చేస్తున్న ప్రయత్నాలు మరింత బహుముఖంగా ఉండేలా సీఏఎంపీఏ నిధులను ఉపయోగించుకోవాలని చెప్పారు.

శీతోష్ణస్థితి మార్పుల కారణంగా మారుతున్న వాతావరణ పరిస్థితులుదానివల్ల పెరుగుతున్న విపత్తు సంబంధిత సవాళ్లను పరిష్కరించేందుకు ఏకోన్ముఖ ప్రభుత్వంఏకోన్ముఖ సమాజం అనే విధానాన్ని అనుసరిస్తూ ఒక బృహత్ ప్రణాళికను సిద్ధం చేయాలని శ్రీ అమిత్ షా చెప్పారుకొత్త వెబ్‌సైట్లనుయాప్‌లను అభివృద్ధి చేయడానికి కాకుండా ఇప్పటికే ఉన్నవాటిని ఏకీకృతం చేయడంమెరుగుపరచడంపై దృష్టి సారించాలని ఈ సమావేశానికి హాజరైన మంత్రిత్వ శాఖలువిభాగాల అధికారులకు సూచించారువాతావరణ సూచనలనుహెచ్చరికలను విస్తృతంగాసమర్థంగా ప్రసారం చేయాలని కూడా ఆయన అన్నారు.

వర్షాకాలంలో సంభవించే ప్రాణ నష్టాన్నివాతావరణ సూచనల కచ్చితత్వాన్నివ్యవసాయ రంగానికి జరిగిన నష్టాన్ని అధ్యయనం చేయడం ద్వారా వచ్చే వర్షాకాలానికి అంచనాలను మరింత మెరుగుపరిచే ప్రయత్నాలు చేపట్టాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.

సమావేశంలో పాల్గొన్న మంత్రిత్వ శాఖలువిభాగాలు చేపడుతున్న పనినివాటి మధ్య సమన్వయాన్ని శ్రీ అమిత్ షా అభినందించారువాతావరణ సంబంధిత ప్రణాళికలను క్షేత్ర స్థాయికి చేర్చాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో వరదలుఇతర విపత్తుల ప్రభావాన్ని తగ్గించేందుకు కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా అత్యున్నత ప్రాధాన్యమిచ్చారుఏటా వరదల సన్నద్ధతపై కేంద్ర హోం మంత్రి సమగ్ర సమీక్ష నిర్వహిస్తారుఆయన అందించిన ఆదేశాలకు అనుగుణంగా ముఖ్యమైన చర్యలు చేపట్టారువీటిలో భాగంగా భారత వాతావరణ విభాగం (ఐఎండీ), కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీద్వారా వర్షపాతంవరదలకు సంబంధించిన ముందస్తు అంచనా వ్యవధిని మూడు నుంచి ఏడు రోజులకు పెంచారుఅలాగే వడగాలుల అంచనా ప్రమాణాలను సైతం మెరుగుపరిచారు.

ఈ సమావేశంలో కేంద్ర జల శక్తి మంత్రి శ్రీ సీఆర్ పాటిల్కేంద్ర హోం కార్యదర్శివివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన కార్యదర్శులుఉన్నతాధికారులుజాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏసభ్యులువిభాగాధిపతులువిపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), భారత వాతావరణ విభాగం (ఐఎండీడైరెక్టర్ జనరళ్లుభారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్ఏఐ), కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీఛైర్ పర్సన్లుజాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం (ఎన్‌ఆర్‌ఎస్‌సీ), ఇతర సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

 

***


(రిలీజ్ ఐడి: 2259815) సందర్శకుల సూచీ సంఖ్య : : 10