పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2025 సంవత్సరానికి జాతీయ పంచాయతీ పురస్కారాల ప్రకటన

17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

42 పంచాయతీలకు పురస్కారాలు

జాతీయ పంచాయతీ గౌరవ పురస్కారాల్లో కర్ణాటకకు 6... ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు చెరో 5 పురస్కారాలు

అగ్రశ్రేణి జిల్లా పంచాయతీలకు రూ.5 కోట్ల వరకు పురస్కారాలు

అత్యుత్తమ పనితీరుతో ప్రథమ బహుమతి పొందిన గ్రామ పంచాయతీలకు రూ.1 కోటి

నాడు పోస్టు చేయడమైనది: 09 MAY 2026 3:53PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా మొత్తం 42 పంచాయతీలను ‘జాతీయ పంచాయతీ పురస్కారాల (ఎన్‌పీఏ-2025)’ విజేతలుగా పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పురస్కారాల ప్రదానోత్సవం 2026 జూన్ 3వ తేదీన న్యూఢిల్లీలో జరగనుంది.

 

రెండు విలక్షణ కేటగిరీల కింద ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ (డీడీయూపీఎస్‌వీపీ) కోసం సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎల్ఎస్‌డీజీల) స్థానికీకరణకు సంబంధించిన 9 అంశాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన గ్రామ పంచాయతీలను ఎంపిక చేస్తారు. అవి పేదరిక రహితమైన, మెరుగైన జీవనోపాధి గల, ఆరోగ్యకరమైన పంచాయతీ, బాలల-హితమైన పంచాయతీ, నీటి-సమృద్ధి గల పంచాయతీ, పరిశుభ్రత-పచ్చదనం గల పంచాయతీ, స్వయం సమృద్ధి గల మౌలిక సదుపాయాలు, సామాజిక న్యాయం-సామాజిక భద్రత గల పంచాయతీ, సుపరిపాలన గల పంచాయతీ, మహిళా-హితమైన పంచాయతీ. ప్రతి అంశం కోసం ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3 కేటాయించి ఆయా పంచాయతీలకు పురస్కారాలను ప్రదానం చేస్తారు. ఎన్‌పీఏ-2025 కోసం 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 34 గ్రామ పంచాయతీలను డీడీయూపీఎస్‌వీపీ కింద ఎంపిక చేశారు. ఇందులో సంయుక్త విజేతలూ ఉన్నారు. ఈ పురస్కారాలను పంచాయతీ పురోగతి సూచిక (పీఏఐ) 2.0 స్కోరుతో అనుసంధానించారు. నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాన్ని జిల్లా, మండల, గ్రామ పంచాయతీ స్థాయిల్లో సమగ్రత ప్రాతిపదికన ఉత్తమ పనితీరు కనబరిచిన పంచాయతీలకు ప్రదానం చేస్తారు. ఎన్‌పీఏ-2025 కింద 8 పంచాయతీలు విజేతలుగా ఎంపికయ్యాయి. వీటిలో 3 ఉత్తమ జిల్లా పంచాయతీ విభాగంలో, 2 ఉత్తమ మండల పంచాయతీ విభాగంలో, 3 ఉత్తమ గ్రామ పంచాయతీ విభాగంలో ఉన్నాయి.

విజేతగా నిలిచిన పంచాయతీలకు వాటి శ్రేణి, వర్గం ఆధారంగా... ఒక్కో పురస్కార గ్రహీతకు రూ. 50 లక్షల నుంచి రూ. 5 కోట్ల వరకు ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తారు. కేంద్ర ప్రాయోజిత పథకమైన రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (ఆర్‌జీఎస్ఏ) కేంద్ర భాగమైన పంచాయతీల ప్రోత్సాహక పథకం (ఐవోపీ) కింద ఈ పురస్కారాలను అందజేస్తారు. ఏప్రిల్-2025లో జరిగిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం–2025 సందర్భంగా... కింది ప్రత్యేక వర్గాల క్రింద పంచాయతీలు, సంస్థలకు జాతీయ పంచాయతీ పురస్కారాలు–2025ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆ ప్రత్యేక పురస్కారాల్లో... (i) వాతావరణ కార్యాచరణ ప్రత్యేక పంచాయతీ పురస్కారం (సీఏఎస్‌పీఏ), (ii) ఆత్మనిర్భర్ పంచాయతీ ప్రత్యేక పురస్కారం (ఏఎన్‌పీఎస్ఏ), (iii) పంచాయతీ క్షమత నిర్మాణ సర్వోత్తమ్ సంస్థాన్ పురస్కార్ (పీకేఎన్ఎస్ఎస్‌పీ)లు ఉన్నాయి.

జాతీయ పంచాయతీ పురస్కారాలు-2025


(రిలీజ్ ఐడి: 2259423) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Kannada , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Gujarati , Odia , Tamil