ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పోచిషే బోయిషాఖ్ సందర్భంగా గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్‌కు ప్రధానమంత్రి నివాళులు

प्रविष्टि तिथि: 09 MAY 2026 9:10AM by PIB Hyderabad

నేడు పోచిషే బోయిషాఖ్ (రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ జయంతి) సందర్భంగా గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక నివాళులర్పించారు.

గురుదేవ్ ఠాగూర్ అసాధారణ ప్రతిభ కలిగిన రచయిత, ఆలోచనాపరుడు, కవి అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆయన ఒక గొప్ప తత్వవేత్తగా, విద్యావేత్తగా, కళాకారుడిగా, దేశ నాగరికతా ఆత్మకు కాలాతీత స్వరంగా తనదైన ముద్ర వేశారని కొనియాడారు.

మానవత్వంలోని లోతైన భావోద్వేగాలకు, మన సంస్కృతిలోని అత్యున్నత ఆదర్శాలకు ఆయన ఒక రూపమిచ్చారని శ్రీ మోదీ తెలిపారు. నూతన ఆలోచనలతో, సృజనాత్మక శక్తితో, సాంస్కృతిక విశ్వాసంతో ఆయన మన సమాజాన్ని సుసంపన్నం చేశారని అన్నారు.

దేశం ఠాగూర్‌ను ఎంతో గౌరవంతో, కృతజ్ఞతతో స్మరించుకుంటోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆయన ఆలోచనలు మన మనసులను నిరంతరం ప్రకాశింపజేయాలని, మన ప్రయత్నాల్లో మార్గదర్శకంగా నిలవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

‘‘నేడు పోచిషే బోయిషాఖ్ ప్రత్యేక సందర్భంలో గురుదేవ్ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌కు మేం హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాం.

గురుదేవ్ ఠాగూర్‌ అసాధారణ ప్రతిభ కలిగిన రచయిత, ఆలోచనాపరుడు, కవి. ఆయన ఒక విశిష్టమైన తత్వవేత్తగా, విద్యావేత్తగా, కళాకారుడిగా, దేశ నాగరికతా ఆత్మకు కాలాతీత స్వరంగా తనదైన ముద్ర వేశారు. మానవాళి ప్రగాఢమైన భావోద్వేగాలకు, మన సంస్కృతిలోని అత్యున్నత ఆదర్శాలకు ఆయన ఒక రూపాన్ని ఇచ్చారు. నూతన ఆలోచనలు, సృజనాత్మక శక్తి, సాంస్కృతిక విశ్వాసంతో ఠాగూర్‌ మన సమాజాన్ని సుసంపన్నం చేశారు.

ఆయన్ను మనం ప్రగాఢమైన భక్తిశ్రద్ధలతో స్మరించుకుందాం. ఠాగూర్‌ ఆలోచనలు మనసులను ప్రకాశవంతం చేస్తూ, మన ప్రయత్నాలలో మనకు మార్గదర్శకంగా నిలవాలని ఆశిస్తున్నా’’.


(रिलीज़ आईडी: 2259309) आगंतुक पटल : 69
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Bengali-TR , Manipuri , Punjabi , Gujarati , Odia , Odia , Tamil , Kannada , Malayalam