భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

శాసనసభలకు సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలు- 2026


ఈసీఐనెట్‌లో ఇండెక్స్ కార్డులు, గణాంక నివేదికల ప్రచురణ

प्रविष्टि तिथि: 08 MAY 2026 1:24PM by PIB Hyderabad

1.     2026 మే 6న ముగిసిన శాసనసభల సార్వత్రిక ఎన్నికలుఉప ఎన్నికలకు సంబంధించిన ఇండెక్స్ కార్డులుగణాంక నివేదికలను భారత ఎన్నికల సంఘం ప్రచురించిందిఎన్నికలు జరిగిన మొత్తం 830 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కార్డులునివేదికలు ప్రచురితమయ్యాయిపశ్చిమ బెంగాల్‌లోని 144-ఫల్తా నియోజకవర్గానికి 2026 మే 21న తిరిగి ఎన్నికలు జరగనున్నాయి.

2.     మునుపెన్నడూ లేనివిధంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన 72 గంటల్లోనే శాసనసభల సాధారణ ఎన్నికలుఉప ఎన్నికలకు సంబంధించిన ఇండెక్స్ కార్డులు అందుబాటులోకి వచ్చాయిగత ఏడాది కాలంలో ఎన్నికల సంఘం చేపట్టిన 30కి పైగా కార్యక్రమాల్లో ఇండెక్స్ కార్డులుగణాంక నివేదికల డిజిటల్ నవీకరణవేగవంతమైన ప్రచురణ ఒకటిగా గుర్తించవచ్చుఈసీఐనెట్‌ను ప్రవేశపెట్టక ముందు క్షేత్రస్థాయి అధికారులు డేటాను వారే స్వయంగా నింపాల్సి రావడం వల్ల ఈ ప్రక్రియకు కొన్ని వారాల నుంచి నెలల వరకు సమయం పట్టేది.

3.     ఇండెక్స్ కార్డుల్లో అభ్యర్థులుఓటర్లుపోలైన ఓట్లులెక్కించిన ఓట్లుపార్టీల వారీగాఅభ్యర్థుల వారీగా పోలైన ఓట్లు మొదలైన అనేక అంశాలకు సంబంధించిన సమాచారముంటుందిఈసీఐనెట్ యాప్ (ఎబోట్ ఎలక్షన్స్ ట్యాబ్ → కరెంట్ ఎలక్షన్స్ → ఇండెక్స్ కార్డులు), ఈసీఐ అధికారిక వెబ్‌సైట్ https://www.eci.gov.in/statistical-reports రెండింటి నుంచి ఈ కార్డులను పొందవచ్చు.

4.     సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈసీఐ ఏకకాలంలో 14 గణాంక నివేదికలను ప్రచురించిందిఎన్నికల ఫలితాలు వెలువడిన 72 గంటల్లోపే గణాంక నివేదికలను ప్రచురించడం ఇదే మొదటిసారి.

5.     రాష్ట్ర స్థాయిఅసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వివరాలుపోలింగ్ కేంద్రాల సంఖ్యరాష్ట్రఅసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతంఓట్లు వేసిన స్త్రీలుపురుషుల సంఖ్యపార్టీల వారీగా ఓట్ల వాటానియోజకవర్గ డేటా సంగ్రహ నివేదికనియోజకవర్గాల వారీగా వివరణాత్మక ఫలితాల వంటి అనేక అంశాలు గణాంక నివేదికల్లో ఉంటాయి.

6.     విద్యావేత్తలుపరిశోధకులుప్రజలందరికీ ఎన్నికల సంబంధిత సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చి పారదర్శకతను ప్రోత్సహించడం లక్ష్యంగా.. ఎన్నికల సంఘం సుమోటోగా గణాంక నివేదికలను ప్రచురిస్తోందిఇండెక్స్ కార్డుల్లో నింపిన తుది సమాచారం ద్వారా ఈ నివేదికలను రూపొందించారు.

7.     సంబంధిత రిటర్నింగ్ అధికారులు నిర్వహించే చట్టబద్ధమైన పత్రాల్లో ప్రాథమిక సమాచారం ఉంటుందివాటిలోని సమాచారమే అంతిమమైనది

 

***


(रिलीज़ आईडी: 2259054) आगंतुक पटल : 69
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Gujarati , Bengali , Bengali-TR , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Tamil , Malayalam