హోం మంత్రిత్వ శాఖ
మిషన్ దృష్టిని నిర్మించిన గెలాక్స్‌ఐ యువ శాస్త్రవేత్తలకు,
ఇంజినీర్లకు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అభినందనలు
ఆప్టికల్ కెమెరాలు, అన్ని వాతావరణ పరిస్థితుల్లో పనిచేసే రాడార్‌ను మిళితం చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఆప్టోసార్ ఉపగ్రహమిది
అంతరిక్ష శక్తిగా భారత్‌ను తీర్చిదిద్దాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను సాకారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న భారతదేశపు అతిపెద్ద ప్రైవేటు ఉపగ్రహ ప్రయోగం
ఇది మన యువ ప్రతిభా సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది
భవిష్యత్తులో గెలాక్స్‌ఐ బృందం చేపట్టబోయే అన్ని మిషన్లకు శ్రీ అమిత్ షా శుభాకాంక్షలు
నాడు పోస్టు చేయడమైనది:
03 MAY 2026 8:15PM by PIB Hyderabad
మిషన్ దృష్టిని నిర్మించిన గెలాక్స్‌ఐ యువ శాస్త్రవేత్తలను, ఇంజినీర్లను కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అభినందించారు. ఆప్టికల్ కెమెరాలను, ఎలాంటి వాతావరణంలోనైనా పనిచేసే రాడార్‌ను మిళితం చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఆప్టోసార్ ఇది.
‘‘మిషన్ దృష్టిని నిర్మించిన గెలాక్స్‌ఐ యువ శాస్త్రవేత్తలకు, ఇంజినీర్లకు అభినందనలు. ఆప్టికల్ కెమెరాలను, ఎలాంటి వాతావరణంలోనైనా పనిచేసే రాడార్‌ను మిళితం చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఆప్టోసార్ ఇది. భారతదేశంలో చేపట్టిన అతిపెద్ద ప్రైవేటు ఉపగ్రహ ప్రయోగం మనం భూమిని పరిశీలించే విధానాన్ని మార్చేస్తుంది. ప్రపంచ యవనికపై మన దేశ యువత ప్రతిభను ప్రదర్శిస్తోంది. అదేవిధంగా, అంతరిక్ష శక్తిగా భారతదేశాన్ని నిలబెట్టాలన్న మోదీ లక్ష్యాన్ని సాకారం చేస్తోంది. భవిష్యత్తులో మీరు చేపట్టబోయే కార్యక్రమాలన్నింటికీ నా శుభాకాంక్షలు’’ అని సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2257797)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11