ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలో రాయబార కార్యాలయాధిపతుల సమావేశంలో పాల్గొన్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 30 APR 2026 10:42PM by PIB Hyderabad

న్యూఢిల్లీలో ఇవాళ నిర్వహిస్తున్న రాయబార కార్యాలయాధిపతుల సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఇందులో భాగంగా- వాణిజ్యం, సాంకేతికత, వ్యూహాత్మక భాగస్వామ్యాల పెంపు ద్వారా ప్రపంచంతో భారత్‌ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం సహా ప్రవాస భారతీయులతో సంబంధాల పెంపుపైనా విస్తృతంగా చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“న్యూఢిల్లీలో ఈ రోజు రాయబార కార్యాలయాధిపతుల సమావేశంలో పాల్గొన్నాను. ఈ సందర్భంగా వాణిజ్యం, సాంకేతికత, వ్యూహాత్మక భాగస్వామ్యాల పెంపు ద్వారా ప్రపంచ దేశాలతో భారత్‌ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై సమగ్రంగా చర్చించాం. అంతేకాకుండా ప్రవాస భారతీయులతో సంబంధాల విస్తృతిపైనా మేం చర్చించాం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

***


(रिलीज़ आईडी: 2257272) आगंतुक पटल : 22
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam