ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో దుర్ఘటన... ప్రాణనష్టం పట్ల సంతాపం తెలిపిన ప్రధానమంత్రి


పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్‌గ్రేషియాను ప్రకటించిన ప్రధాని

प्रविष्टि तिथि: 29 APR 2026 11:25PM by PIB Hyderabad

మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో ప్రాణ నష్టానికి దారి తీసిన  ఓ ప్రమాదం పట్ల  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.
దుర్ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రధానమంత్రి సంతాపాన్ని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు.
మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియాను శ్రీ మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50,000 చొప్పున అందిస్తారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో  ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ -
‘‘మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో ఓ ప్రమాదం ప్రాణ నష్టానికి దారితీసిందని తెలిసి బాధపడ్డాను. ఈ దుర్ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాల సభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియా అందిస్తారు. గాయపడిన వారికి రూ.50,000 చొప్పున అందిస్తారు: ప్రధానమంత్రి’’ అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 2256864) आगंतुक पटल : 43
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam