ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

నాడు పోస్టు చేయడమైనది: 28 APR 2026 7:34PM by PIB Hyderabad

ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్ గారురాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారుపార్లమెంటులోని నా సహచరులుబీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబిన్ గారుఉత్తరప్రదేశ్ పార్లమెంటు సభ్యులుయూపీ బీజేపీ అధ్యక్షులు శ్రీ పంకజ్ చౌదరి గారుజిల్లా పంచాయత్ చైర్‌పర్సన్ సోదరి పూనం మౌర్య గారువేదికపై ఉన్న కాశీ నగర మహిళా కౌన్సిలర్లుగ్రామ పెద్దలుఇతర ప్రజా ప్రతినిధులుఇక్కడికి విచ్చేసిన నా తల్లులుసోదరీమణులుఆడబిడ్డలు అందరికీ నమస్కారం.

మిత్రులారా,

మన కాశీ నగరం... మాతా శృంగార గౌరీమాతా అన్నపూర్ణమాతా విశాలాక్షిమాతా సంకటమాతా గంగా వంటి దివ్య శక్తుల నిలయంఈ పవిత్ర ప్రదేశంలోని సోదరీమణులారాఆడబిడ్డలారా... మీ అందరితో ఈ సమావేశం ఈ సందర్భాన్ని అత్యంత దివ్యంగా మార్చిందికాశీ నేల మీద నుంచి... తల్లులకుసోదరీమణులకుఆడబిడ్డలకు అందరికీ నేను నమస్కరిస్తున్నాను.

మిత్రులారా,

ఈనాటి సందర్భం నిజంగా మహిళా శక్తిని గౌరవించిఅభివృద్ధి చేసే ఒక వేడుకకొద్దిసేపటి కిందటే ఇక్కడ వేల కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించిశంకుస్థాపన చేశాంవీటిలో కాశీ నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి సంబంధించిన ప్రాజెక్టులూ ఉన్నాయిదీంతో పాటుగా కాశీ-అయోధ్యల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరిచే పనులూ జరుగుతున్నాయికొద్దిసేపటి కిందటే రెండు అమృత్ భారత్ రైళ్లనూ ప్రారంభించాంకాశీ నుంచి పూణేకుఅయోధ్య నుంచి ముంబయికి నడిచే ఈ రెండు అమృత్ భారత్ రైళ్లు ఉత్తరప్రదేశ్మహారాష్ట్రల మధ్య అనుసంధానాన్ని మరింత మెరుగుపరుస్తాయిఇప్పుడు ముంబయి-పూణే ప్రజలకుయావత్ మహారాష్ట్ర ప్రజలకూ అయోధ్య ధామ్కాశీ విశ్వనాథ ధామ్‌లను చేరుకోవడానికి మరో ఆధునిక మార్గం అందుబాటులోకి వచ్చిందిఈ ప్రారంభోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు నా అభినందనలు.

మిత్రులారా,

దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే యాత్ర నిరంతరం కొనసాగుతూనే ఉందినేను అభివృద్ధి చెందిన భారత్ గురించి మాట్లాడినప్పుడుదానికి అత్యంత బలమైన మూలస్తంభం భారత మహిళా శక్తిఈ నాటి ఈ కార్యక్రమంలోఒక గొప్ప యజ్ఞం ప్రారంభం కోసం మన సోదరీమణులుఆడబిడ్డలందరి ఆశీస్సులు కోరడానికి నేను ఇక్కడకు వచ్చానుకాశీ పార్లమెంట్ సభ్యునిగాదేశ ప్రధానమంత్రిగా ఒక పెద్ద జాతీయ లక్ష్యాన్ని సాధించడానికి మీ ఆశీస్సులు కావాలిఆ పెద్ద లక్ష్యమేంటంటే లోక్‌సభశాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్లను అమలు చేయడంకొద్ది రోజుల కిందటే ఎస్పీకాంగ్రెస్ వంటి పార్టీల కారణంగా పార్లమెంటులో మన ప్రయత్నం విజయవంతం కాలేదుకానీ సోదరీమణులారా... మీ రిజర్వేషన్ హక్కు అమలయ్యేలా చూడటానికి నేను నా శాయశక్తులా కృషి చేస్తానని మీకు మరోసారి హామీ ఇస్తున్నాను.

మిత్రులారా,

ఇంట్లో స్త్రీకి సాధికారత లభించినప్పుడుకుటుంబం మొత్తం బలపడుతుందిసమాజం బలపడుతుందిదేశం బలపడుతుందిగతంలో అక్కాచెల్లెళ్లుకుమార్తెలూ అనుకున్నది చేయడం కోసం ఎంతో పోరాడవలసి వచ్చిందికాశీ సోదరీమణులైన మీరూ ఎన్నో కష్టాలను చూశారుఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారుమన ఆడబిడ్డలు తరచుగా ఇలాంటి ఎన్నో ప్రశ్నలను ఎదుర్కోవలసి వచ్చేదిఇది చేసి నువ్వేం చేస్తావ్నీకేం అవసరంనువ్వేం చేస్తావ్నీకేం అవసరంనోరుమూయ్ఈ పని నువ్వు చేయలేవుఇలా చాలాసార్లు కనీసం ఎలాంటి ప్రశ్నలు కూడా అడగకుండానేఇది నీ పని కాదు అని నేరుగా ఆజ్ఞలు జారీ చేసేవారు.

మిత్రులారా,

ఇలాంటి పరిస్థితులు కేవలం కాశీ సోదరీమణులకే పరిమితం కాలేదుదేశంలోని చాలా మంది సోదరీమణులుఆడబిడ్డలు ఇలాంటి అనుభవాలనే ఎదుర్కొన్నారుదీనిని సహజమైనదిగా భావించేవారుఅందుకే 25 సంవత్సరాల కిందటే నేను గుజరాత్ ముఖ్యమంత్రిని అయినప్పుడు... అలాంటి భావనలను దూరం చేయడం కోసం మొదటగా ప్రయత్నించానుఆ సమయంలో ఆడబిడ్డల కోసం రెండు పెద్ద పథకాలను ప్రారంభించాంఒకటి 'శాల ప్రవేశోత్సవ్'... అంటే బాలికలను పాఠశాలల్లో చేర్పించడంతద్వారా ఆడబిడ్డలు ఎక్కువ సంఖ్యలో పాఠశాలలో చేరేలామధ్యలో చదువు మానేయకుండా చూడటంరెండోది 'ముఖ్యమంత్రి కన్యా కేలవాణి నిధి'... ఆడబిడ్డలకు చదువు కోసం ఫీజుల విషయంలో సహాయం చేయడం.

మిత్రులారా,

అప్పటి నుంచి నేటి వరకూమా ప్రభుత్వ విధానాల్లో మహిళా సంక్షేమానికి నిరంతరం అత్యధిక ప్రాధాన్యం కొనసాగిస్తూనే ఉన్నాం. 2014లో మీకు సేవ చేసే అవకాశాన్ని మాకు మీరు ఇచ్చినప్పుడు... దేశంలో 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు అంటే “ఇజ్జత్ ఘర్‌లు” నిర్మించాం. 30 కోట్లకు పైగా సోదరీమణులకు బ్యాంకు ఖాతాలు అందించాం. 2.5 కోట్లకు పైగా ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లూ అందించాం. 12 కోట్లకు పైగా ఇళ్లకు కుళాయిల ద్వారా నీరు అందిందిఅంటేఅనేక పెద్ద పథకాల్లో సోదరీమణులనుఆడబిడ్డలను ప్రధాన లబ్దిదారులుగా ఉంచాం.

మిత్రులారా,

రెండు సంవత్సరాల కిందట ఇక్కడే బనారస్‌లో సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి ఒక భారీ ప్రచార కార్యక్రమం నిర్వహించాంఆ సమయంలో కేవలం ఒక నెలలోనే ఇక్కడ కాశీలో 27 వేల మంది ఆడబిడ్డలకు సుకన్య సమృద్ధి ఖాతాలు తెరిచారుప్రతి ఆడబిడ్డ బ్యాంకు ఖాతాలోకి 300 రూపాయలు బదిలీ చేశాంఆడబిడ్డల చదువులుఉజ్వల భవిష్యత్తు కోసం సుకన్య సమృద్ధి యోజన కీలక పాత్ర పోషిస్తోందిఈ పథకం ఆడబిడ్డల చదువులను బలోపేతం చేయగాముద్రా యోజన వారి సంపాదనకు భరోసా కల్పించిందిమాతృ వందన యోజనఆయుష్మాన్ భారత్ యోజనలు సోదరీమణులుఆడబిడ్డల వైద్య అవసరాలను తీర్చాయి.

మిత్రులారా,

విద్యసంపాదనసరసమైన ధరలకు మందులతో పాటు... తొలిసారిగా కోట్లాది మంది సోదరీమణులు తమ పేర్ల మీద ఆస్తులను నమోదు చేయించుకున్నారుపీఎం ఆవాస్ యోజన కింద చాలా ఇళ్లు సోదరీమణుల పేర్ల మీదే ఉన్నాయిఈ రోజు మన తల్లులుసోదరీమణులు నిజంగా తమ సొంత ఇళ్లకు యజమానులయ్యారు.

మిత్రులారా,

మా ప్రభుత్వం పూర్తి దృష్టి సోదరీమణుల సౌకర్యంభద్రతపైనే ఉందిఈ రెండే సాధికారతకు పునాదిని బలోపేతం చేస్తాయిఇక్కడ ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితులు ఎలా మారాయో మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారుకొన్ని సంవత్సరాల కిందటఇక్కడ సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు... ఆడపిల్లలు కనీసం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టడం కష్టంగా ఉండేదికానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం హాయాంలో ఆడపిల్లల పట్ల దురభిప్రాయాలు ఉన్నవారికిదాని పర్యవసానాలు ఎలా ఉంటాయో బాగా తెలిసివచ్చింది.

మిత్రులారా,

సోదరీమణులుఆడబిడ్డల భద్రతకు భారతీయ న్యాయ సంహిత కొత్త భరోసాను కల్పించిందిదీని కిందమహిళలపై జరిగే తీవ్రమైన నేరాల విషయంలో తీర్పులు వేగంగా వెలువడుతున్నాయిమహిళా పోలీస్ స్టేషన్లుకౌన్సెలింగ్ కేంద్రాల నెట్‌వర్క్ నిరంతరం విస్తరిస్తోందిఈ రోజు ఇక్కడ మహిళా పోలీస్ అవుట్‌పోస్ట్కౌన్సెలింగ్ కేంద్రం కోసం భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయిఇటువంటి చర్యలు ఆడబిడ్డల భద్రతకు భరోసానిస్తాయి.

మిత్రులారా,

మహిళలు ఆర్థికంగా శక్తిమంతమైనప్పుడుఇంట్లో వారి మాటకు ప్రాధాన్యం పెరుగుతుందిఅందుకే వారికి సౌకర్యంభద్రత కల్పించడంతో పాటు... సోదరీమణుల ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంచడంపైనా మేం దృష్టి సారించాంగత 11 ఏళ్లలో దేశవ్యాప్తంగా సుమారు 10 కోట్ల మంది సోదరీమణులను స్వయం సహాయక బృందాలతో అనుసంధానించాంకాశీలోనే సుమారు 1.25 లక్షల మంది సోదరీమణులు ఇటువంటి బృందాలతో అనుసంధానమై ఉన్నారుఈ బృందాలు లక్షల రూపాయల సహాయాన్ని అందుకుంటున్నాయిదీని ద్వారా సోదరీమణులు తమ పనులను చేసుకుంటున్నారుఇటువంటి ప్రయత్నాల ద్వారా ఇప్పటికే కోట్ల మంది సోదరీమణులు “లక్‌పతి దీదీలు”గా మారారువీరిలో బనారస్‌కు చెందిన వేలాది మంది సోదరీమణులూ ఉన్నారు.

మిత్రులారా,

లక్‌పతి దీదీ ఉద్యమానికి ఊపునివ్వడంలో మన పాడి రంగం పాత్ర కీలకమైనదిఇక్కడబనస్కాంత డెయిరీతో అనుబంధం ఉన్న లక్షలాది మంది సోదరీమణులు అద్భుతమైన కృషి చేస్తున్నారుఈ రోజు ఈ సోదరీమణులు నేరుగా 106 కోట్ల రూపాయల బోనస్‌ను అందుకున్నారుఈ సోదరీమణులందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నానుకాశీలోని పాడి రంగంతో అనుబంధం ఉన్న మహిళలకు నేను చెప్పేది ఏంటంటే ఇది ఆరంభం మాత్రమేబనారస్ ఎదుగుతోందిబనస్కాంత డెయిరీ ఎదుగుతోందిఈ బోనస్ కూడా పెరుగుతూనే ఉంటుంది.

మిత్రులారా,

బీజేపీ-ఎన్‌డీఏ ప్రభుత్వం సోదరీమణులను స్వయం సమృద్ధి దిశగా నడిపిస్తూనేఅభివృద్ధి చెందిన భారత్ సాధన ప్రయాణానికి నాయకత్వం వహించే అవకాశాలను వారికి కల్పిస్తోందిడిజిటల్ చెల్లింపుల పురోగతిలో వేలాది మంది 'బ్యాంక్ సఖీలుకీలక పాత్ర పోషిస్తున్నారుభీమా సంబంధిత పనుల్లో 'బీమా సఖీలుముందున్నారుప్రకృతి వ్యవసాయ పురోగతిలో 'కృషి సఖీలుకీలక పాత్ర పోషిస్తున్నారుఇక వ్యవసాయ రంగంలో వస్తున్న డ్రోన్ విప్లవంలో మన 'నమో డ్రోన్ దీదీలుముందున్నారుగత దశాబ్ద కాలంలో సైన్యంనావికాదళంవైమానిక దళంలోనూ మన ఆడబిడ్డలకు కొత్త అవకాశాలు లభిస్తున్నాయితొలిసారిగా సైనిక్ పాఠశాలలురక్షణ అకాడమీల్లోనూ ఆడబిడ్డలకు ప్రవేశం లభిస్తోందిబీజేపీ-ఎన్‌డీఏ ప్రభుత్వ లక్ష్యం మహిళా సాధికారతమహిళల అభ్యున్నతిమహిళల జీవితాలను సులభతరం చేయడం.

మిత్రులారా,

నేడు ప్రతి రంగంలోనూ మన ఆడబిడ్డలు అద్భుతంగా రాణిస్తున్నారుకాబట్టి సహజంగానేదేశ భవిష్యత్తుకు సంబంధించిన విధాన రూపకల్పననిర్ణయాల్లో సోదరీమణులుఆడబిడ్డల పాత్ర మరింత పెరగాలిఈ రోజు దేశానికి ఇది చాలా అవసరందీని కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నాంకొత్త పార్లమెంటును నిర్మించడం వెనక ఉన్న ఒక పెద్ద కారణం... మహిళల భాగస్వామ్యం పెంచే ఆలోచనేకొత్త పార్లమెంటును నిర్మించినప్పుడుమేం చేసిన మొదటి పని మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం. 40 సంవత్సరాలుగా మన సోదరీమణుల ఈ హక్కు అక్కడే నిలిచిపోయిఅటకెక్కిందిఅందువల్ల2023లో మేం పార్లమెంటులో నారీ శక్తి వందన అధినియమ్‌ను ఆమోదింపజేశాం.

మిత్రులారా,

ఒక చట్టం చేసిన తర్వాత దానిని అమలు చేయడం అవసరంఇప్పుడు ఈ చట్టాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాల్సిన అవసరం ఉందిఇటీవలే పార్లమెంటులో దీనిపై చర్చ జరిగిందిమేం రాజ్యాంగ సవరణ కోసం ఒక చట్టాన్ని తీసుకువచ్చాంఈ సవరణ వల్ల మరింత మంది మహిళలు శాసనసభలకుపార్లమెంటుకూ చేరేవారు.

మిత్రులారా,

కాంగ్రెస్సమాజ్‌వాదీ పార్టీటీఎంసీడీఎంకే వంటి పార్టీలు దేశ మహిళలకు మరోసారి ద్రోహం చేశాయిఇలాంటి పార్టీలు 40 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్‌ను అడ్డుకుంటూనే ఉన్నాయిఇప్పుడు సమాజ్‌వాదీ పార్టీ మరోసారి దీనికి అడ్డుపడింది.

మిత్రులారా,

అసలు విషయం ఏమిటంటే... ఈ కుటుంబ ఆధారితబుజ్జగింపు ధోరణి గల పార్టీలన్నీ మహిళా శక్తికిమీ అందరికీ భయపడుతున్నాయికళాశాల ప్రాంగణాల నుంచి పంచాయతీలుస్థానిక సంస్థల వరకూ ప్రతిచోటా తమ సొంత శక్తితో నాయకత్వం వహిస్తున్న దేశపు ఆడబిడ్డలు శాసనసభలకుపార్లమెంటుకు చేరుకోవడం ఈ కుటుంబ ఆధారిత పార్టీలకు ఇష్టం లేదుక్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆడబిడ్డలు గనుక తిరగబడితే... తమ నియంత్రణ అంతమవుతుందనితమ అధికారంపై ప్రశ్నలు తలెత్తుతాయని వారికి తెలుసుఅందుకే ఈ కుటుంబ ఆధారిత పార్టీలు పార్లమెంటులో ప్రతిపక్షంలో ముందు వరుసలో ఉన్నాయి.

మిత్రులారా,

దేశంలోని సోదరీమణులుఆడబిడ్డలంతా అలాంటి వారి చర్యలతో వారి కుటిల ఉద్దేశాలను గుర్తించడం నాకు సంతృప్తి కలిగించిందిమీరు చూస్తున్నారుగా... అస్సాంకేరళపుదుచ్చేరిబెంగాల్తమిళనాడులలో సోదరీమణులు రికార్డు స్థాయిలో ఓటు వేశారుసోదరీమణుల ఈ ఓటు... ఈ మహిళా వ్యతిరేక పార్టీలను శిక్షించడానికేనని మహిళా రిజర్వేషన్‌ను వ్యతిరేకించే పార్టీలు గ్రహించడం లేదు.

మిత్రులారా,

బీజేపీ-ఎన్‌డీఏ ప్రభుత్వానికి ఒకే ఒక మంత్రం ఉంది నాగరిక్ దేవో భవదేశ పౌరుల విద్యసంపాదనవైద్యంనీటిపారుదలవారు చెప్పేది వినడం మా ప్రాధాన్యాలుఈ స్ఫూర్తితోనే నేడు కాశీ అభివృద్ధినీ విస్తరిస్తున్నాంగంగానదిపై ప్రతిష్ఠాత్మక వంతెన నిర్మాణంతో పూర్వాంచల్ అనుసంధానం మరింత బలోపేతమవుతుంది.

మిత్రులారా,

గత దశాబ్దంలో ఉత్తరతూర్పు భారత్‌కు ఒక ప్రధాన ఆరోగ్య కేంద్రంగా కాశీ అభివృద్ధి చెందింది. 500 పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కాశీ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందిదీనికి అదనంగా100 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్‌కూ శంకుస్థాపన జరిగిందిఇది కాశీలో తీవ్రమైన వ్యాధుల చికిత్స కోసం ఒక అతిపెద్ద సదుపాయాన్ని అందిస్తుంది.

మిత్రులారా,

గంగానది ప్రక్షాళన... ఘాట్‌ల అభివృద్ధి... పరిపాలననిర్వహణ సంబంధిత భవనాల నిర్మాణాలు... హర్హువాభవానీపూర్‌లలో రైతుల కోసం నిల్వ సౌకర్యాలు... వృద్ధాశ్రమాలు... మహిళా వసతి గృహాలు... ఇవన్నీ కాశీ అభివృద్ధికి నిదర్శనాలుఈ అభివృద్ధి పనులతో బనారస్ ప్రజలు అత్యధికంగా లబ్ధి పొందుతున్నారు.

మిత్రులారా,

కాశీ వారసత్వాన్నిసంస్కృతినీ బలోపేతం చేసే ప్రచారం నిరంతరం కొనసాగుతోందిసంత్ కబీర్ పవిత్ర స్థల అభివృద్ధినాగ్వాలోని సంత్ రవిదాస్ ఉద్యానవన పునరుద్ధరణ ఈ ప్రచారంలో భాగమే.

మిత్రులారా,

మన కాశీ శాశ్వతమైనదిఅది నిరంతరం కొనసాగే నగరంఅదే విధంగాఈ అభివృద్ధి ఉద్యమం నిరంతరం ముందుకు సాగుతుందిమహిళా శక్తిని గౌరవిస్తూమాకు ఆశీస్సులు అందించినందుకు మీకు మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానుఈ అభివృద్ధి పనుల సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నానునాతో పాటు మీరంతా చెప్పండి-

భారత్ మాతా కీ జై.

భారత్ మాతా కీ జై

భారత్ మాతా కీ జై.

వందే మాతరంవందే మాతరంవందే మాతరం.

హర-హర మహాదేవ్.

 

***


(రిలీజ్ ఐడి: 2256417) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati