ప్రధాన మంత్రి కార్యాలయం
భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ, దాని ప్రయోజనాలపై వచ్చిన ఒక వ్యాసాన్ని పంచుకున్న ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
27 APR 2026 5:31PM by PIB Hyderabad
కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
భారతీయ ఎగుమతులపై సుంకాలను తొలగించటం ద్వారా భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ).. శ్రామిక ఆధారిత రంగాలకు ఊతమిస్తూ ఎంఎస్‌ఎంఈలను బలోపేతం చేస్తుందన్న విషయాన్ని ఈ వ్యాసం వివరిస్తోంది. అదే సమయంలో వ్యవసాయం, పాడి పరిశ్రమ వంటి రంగాలకు పూర్తి సంరక్షణ ఉండేలా ఈ ఒప్పందం చూసుకుంటోందని పేర్కొంది. ఈ ఒప్పందం విద్యార్థులు, నైపుణ్యం కలిగిన నిపుణులకు అవకాశాలను విస్తరిస్తుందని.. అలాగే వ్యవసాయ ఉత్పాదకత, పెట్టుబడి కట్టుబాట్లకు మద్దతునిస్తుందని ఈ వ్యాసం ప్రధానంగా తెలియజేసింది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు:
“భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ గురించి వివరిస్తూ కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్.. భారతీయ ఎగుమతులపై సుంకాలను తొలగించే ఈ ఒప్పందం కార్మిక-ఆధారిత రంగాలకు ఊతమిస్తూ ఎంఎస్‌ఎంఈలను బలోపేతం చేసే తీరును తెలియజేశారు. అదే సమయంలో వ్యవసాయం, పాడి పరిశ్రమ వంటి రంగాలకు పూర్తి సంరక్షణ ఉండేలా ఈ ఒప్పందం భరోసానిస్తుంది.
ఈ ఒప్పందం విద్యార్థులు, నైపుణ్యం కలిగిన నిపుణులకు అవకాశాలను విస్తరించడమే కాకుండా వ్యవసాయ ఉత్పాదకత, పెట్టుబడి కట్టుబాట్లకు కూడా మద్దతునిస్తుంది."
***
(రిలీజ్ ఐడి: 2256171)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam