ప్రధాన మంత్రి కార్యాలయం
త్వరలో ఇజ్రాయెల్ పర్యటనకు ప్రధానమంత్రి ఇరుదేశాల మధ్య దృఢతరమైన బంధం: ప్రధాని
प्रविष्टि तिथि:
22 FEB 2026 11:18PM by PIB Hyderabad
భారత్, ఇజ్రాయెల్ మధ్య చిరకాలంగా మంచి మైత్రి నెలకొందనీ, రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు పరస్పర నమ్మకం, నూతన ఆవిష్కరణలు, ప్రగతి విషయంలో ఉమ్మడి నిబద్ధత పునాదులపై నిలిచాయనీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
స్నేహపూర్వక భావనల్ని శ్రీ మోదీ ప్రశంసిస్తూ, భారత్, ఇజ్రాయెల్‌ల సంబంధాల్లోని దృఢత్వం, భిన్నత్వం పట్ల పూర్తి సమ్మతిని వ్యక్తం చేశారు.
ఇజ్రాయెల్‌తో భాగస్వామ్యానికి భారత్ ఎంతో విలువనిస్తుందనీ, పరస్పర నమ్మకం, నూతన ఆవిష్కరణలు, ఉమ్మడి నిబద్ధత అనే పునాదులపై ఈ భాగస్వామ్యం రూపుదిద్దుకొందనీ ప్రధాని తెలిపారు. త్వరలో ఇజ్రాయెల్‌లో తాను పర్యటించనున్న సందర్భంగా, అర్థవంతమైన చర్చలు చోటుచేసుకొంటాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఇజ్రాయెల్ ప్రధాని శ్రీ బెంజమిన్ నెతన్యాహూ పొందుపరిచిన ఒక సందేశానికి ప్రధానమంత్రి స్పందిస్తూ :
‘‘నా మిత్రుడా ప్రధాని నెతన్యాహూ.. మీకు ధన్యవాదాలు.
ఇజ్రాయెల్, భారత్ మధ్య సంబంధాల దృఢత్వంతో పాటు మన ద్వైపాక్షిక సంబంధాల విభిన్నత్వం విషయంలో మీరు వెల్లడించిన అభిప్రాయాలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఇజ్రాయెల్‌తో దీర్ఘకాలంగా కొనసాగుతున్న మైత్రికి భారత్ ఎంతో విలువ ఇస్తోంది. పరస్పర విశ్వాసం, నూతన ఆవిష్కరణలు, శాంతితో పాటు ప్రగతి పట్ల ఉమ్మడి నిబద్ధత అనే పునాదులపై ఈ మైత్రి నిర్మితమైంది.
త్వరలో ఇజ్రాయెల్‌లో నేను పర్యటించనున్నాను. ఈ సందర్భంగా మన మధ్య జరిగే చర్చల కోసం నేను ఉత్సాహంతో ఎదురుచూస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 2254806)
आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam