ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్‌లోని వల్సాద్‌లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి సంతాపం
నాడు పోస్టు చేయడమైనది:
22 APR 2026 8:34PM by PIB Hyderabad
గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలో ప్రాణనష్టం జరిగిన ప్రమాదం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన పోస్టులో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం విచారకరం. ఈ ఘటనలో తమ వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ’’.
***
(రిలీజ్ ఐడి: 2254709)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6