ప్రధాన మంత్రి కార్యాలయం
కురుక్షేత్రలో తన పర్యటన విశేషాలను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
25 NOV 2025 11:30PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హర్యానాలోని కురుక్షేత్రలో పర్యటించిన సందర్భంగా కొన్ని విశేషాలనుఉ ప్రజలతో పంచుకున్నారు. అక్కడ నిర్మించిన శ్రీకృష్ణ భగవానుడి పవిత్ర శంఖం ‘పాంచజన్య’ స్మారక చిహ్నాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం, అక్కడి మహాభారత్ అనుభవ కేంద్రాన్ని సందర్శించి, ఆ దృశ్యాలను వీక్షిస్తూ తాదాత్మ్యం చెందారు. మహాభారతంలోని కొన్ని కీలక ఘట్టాలను వర్ణించే కళాకృతులు ఈ కేంద్రంలో ఆ ఇతిహాస సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని చాటుతుంటాయి. ఈ కేంద్రం సందర్శన అనంతరం ఆయన సిక్కుల తొమ్మిదో గురువు పూజ్య శ్రీ గురు తేగ్ బహదూర్ 350వ అమర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనడంతోపాటు హాజరైన వారినుద్దేశించి ప్రసంగించారు. అటుపైన శ్రీమద్భగవద్గీత దైవిక ప్రకటనతో ముడిపడినదిగా ప్రాచుర్యంగల దేశంలోని అత్యంత పావన పుణ్యక్షేత్రాలలో ఒకటైన బ్రహ్మ సరోవరంలో దైవ దర్శనం, ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమాలకు సంబంధించి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన వరుస సందేశాల్లో:
“సిక్కుల తొమ్మిదో గురువు పూజ్య శ్రీ గురు తేగ్ బహదూర్ 350వ అమర వార్షికోత్సవం సందర్భంగా ఆయనకు శిరసాభివందనం. సాటిలేని ఆయన సాహసం, అత్యున్నత త్యాగం లక్షలాది ప్రజానీకానికి ఎనలేని స్ఫూర్తినిస్తాయి.”
“సిక్కుల తొమ్మిదో గురువు పూజ్య శ్రీ గురు తేగ్ బహదూర్ 350వ అమర వార్షికోత్సవం సందర్భంగా ఆయనకు శిరసాభివందనం. సాటిలేని ఆయన సాహసం, అత్యున్నత త్యాగం లక్షలాది ప్రజానీకానికి ఎనలేని స్ఫూర్తినిస్తాయి.”pic.twitter.com/84oQU2CGp0
- Narendra Modi (@narendramodi) November 25, 2025
“ਉਨ੍ਹਾਂ ਦੇ 350ਵੇਂ ਸ਼ਹੀਦੀ ਦਿਵਸ 'ਤੇ, ਅਸੀਂ ਸ੍ਰੀ ਗੁਰੂ ਤੇਗ ਬਹਾਦਰ ਜੀ ਨੂੰ ਨਮਨ ਕਰਦੇ ਹਾਂ। ਉਨ੍ਹਾਂ ਦੀ ਬੇਮਿਸਾਲ ਹਿੰਮਤ ਅਤੇ ਸਰਵਉੱਚ ਬਲੀਦਾਨ ਲੱਖਾਂ ਲੋਕਾਂ ਨੂੰ ਪ੍ਰੇਰਿਤ ਕਰਦੇ ਹਨ।”
ਉਨ੍ਹਾਂ ਦੇ 350ਵੇਂ ਸ਼ਹੀਦੀ ਦਿਵਸ 'ਤੇ, ਅਸੀਂ ਸ੍ਰੀ ਗੁਰੂ ਤੇਗ ਬਹਾਦਰ ਜੀ ਨੂੰ ਨਮਨ ਕਰਦੇ ਹਾਂ। ਉਨ੍ਹਾਂ ਦੀ ਬੇਮਿਸਾਲ ਹਿੰਮਤ ਅਤੇ ਸਰਵਉੱਚ ਬਲੀਦਾਨ ਲੱਖਾਂ ਲੋਕਾਂ ਨੂੰ ਪ੍ਰੇਰਿਤ ਕਰਦੇ ਹਨ। pic.twitter.com/wlmjWjyGUd
— Narendra Modi (@narendramodi) November 25, 2025
“कुरुक्षेत्र का 'महाभारत अनुभव केंद्र' अद्भुत होने के साथ-साथ हमारी सांस्कृतिक विरासत की सशक्त अभिव्यक्ति है। यहां हर किसी को महाभारत के प्रसंगों का जीवंत अनुभव होगा।”
“కురుక్షేత్రలోని ‘మహాభారత అనుభవ కేంద్రం’ మన సాంస్కృతిక వారసత్వానికి ఒక ఉత్తేజదాయక, అద్భుత నిదర్శనం. ఇక్కడ ప్రతి ఒక్కరూ మహాభారత సంఘటనల సజీవ చిత్రణను తిలకిస్తూ ఎనలేని తాదాత్మ్యం చెందగలరు. pic.twitter.com/z0R8zOz4xJ
— Narendra Modi (@narendramodi) November 25, 2025
“सिखों के नौवें गुरु श्री तेग बहादुर जी के 350वें शहीदी दिवस पर उनके सम्मान में विशेष सिक्का और स्मारक डाक टिकट जारी कर बहुत गौरवान्वित हूं।”
సిక్కుల తొమ్మిదో గురువు శ్రీ తేగ్ బహదూర్ 350వ అమర వార్షికోత్సవం సందర్భంగా ఆయన గౌరవార్థం ఒక ప్రత్యేక నాణెం, స్మారక తపాలా బిళ్లను ఆవిష్కరించడం నాకెంతో్ గర్వంగా ఉంది.
— Narendra Modi (@narendramodi) November 25, 2025
“कुरुक्षेत्र की प्रदर्शनी में श्री गुरु तेग बहादुर जी के अदम्य साहस, त्याग और हमारी सांस्कृतिक विरासत का साक्षी बनने का सुअवसर मिला।”
కురుక్షేత్రలో నిర్వహించిన ప్రదర్శనలో శ్రీ గురు తేగ్ బహదూర్ అకుంఠిత సాహసం, అత్యున్నత త్యాగంతోపాటు మన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రత్యక్షంగా తిలకించే అవకాశం నాకు లభించింది. pic.twitter.com/I4pN5CcwaT
— Narendra Modi (@narendramodi) November 25, 2025
“कुरुक्षेत्र में श्री गुरु तेग बहादुर जी के 350वें शहीदी दिवस से जुड़े आयोजन में भारी संख्या में आई संगत को मेरा कोटि-कोटि नमन!”
శ్రీ గురు తేగ్ బహదూర్ జీ 350వ అమర వార్షికోత్సవం నేపథ్యంలో కురుక్షేత్రలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన అసంఖ్యాక భక్తులకు నా హృదయపూర్వక నమస్కారం! pic.twitter.com/S5tCsLBJZV
— Narendra Modi (@narendramodi) November 25, 2025
“आज हिंदुस्तान का जो सशक्त स्वरूप है, उसमें श्री गुरु तेग बहादुर साहिब जैसे युगपुरुषों का त्याग और समर्पण भी समाहित है।”
నేటి సుదృఢ భారత్ స్వరూపం శ్రీ గురు తేగ్ బహదూర్ సాహిబ్ వంటి మహనీయుల త్యాగం, అంకితభావాలను ప్రతిబింబిస్తుంది. pic.twitter.com/WzILm9M8H3
— Narendra Modi (@narendramodi) November 25, 2025
“मुझे संतोष है कि बीते 11 वर्षों में हमारी सरकार ने हमारे गुरुओं और सिख समुदाय से जुड़ी पावन परंपराओं को राष्ट्रीय उत्सव के रूप में स्थापित किया है।”
గడచిన 11 ఏళ్లలో మా ప్రభుత్వం మన గురువులతోపాటు సిక్కు సమాజంతో ముడిపడిన పవిత్ర సంప్రదాయాలను జాతీయ వేడుకగా నిర్వహించడం నాకెంతో సంతృప్తినిస్తోంది. pic.twitter.com/6U8HBGAxBg
— Narendra Modi (@narendramodi) November 25, 2025
“पवित्र ‘जोड़ा साहिब’ से जुड़े सभी तथ्यों को देखते हुए हमने यह सामूहिक निर्णय लिया कि इन्हें तख्त श्री पटना साहिब को समर्पित किया जाएगा। इससे यह पावन धरोहर आने वाली पीढ़ियों के लिए भी संरक्षित रहेगी।”
పవిత్ర ‘జోడా సాహిబ్’ సంబంధిత వాస్తవాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటూ, దాన్ని తఖ్త్ శ్రీ పట్నా సాహిబ్‌కు అంకితం చేయాలని మేం సమష్టిగా నిర్ణయించుకున్నాం. తద్వారా ఈ పవిత్ర వారసత్వం భావితరాల కోసం భద్రంగా ఉంటుంది.pic.twitter.com/h2C1NFIXRj
(रिलीज़ आईडी: 2254551)
आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam