ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘‘న్యాయ సహాయాన్ని అందించే యంత్రాంగాలను పటిష్ఠపరచడం’’పై


జాతీయ సమావేశ ప్రారంభ కార్యక్రమ ముఖ్యాంశాల్ని పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 08 NOV 2025 10:22PM by PIB Hyderabad

‘‘న్యాయ సహాయాన్ని అందించే యంత్రాంగాలను పటిష్ఠపరచడం’’ అంశంపై ఈ రోజు భారతదేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఏర్పాటు చేసిన జాతీయ సమావేశ ప్రారంభ కార్యక్రమ ముఖ్యాంశాల్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు. న్యాయ సహాయాన్ని అందించే యంత్రాంగం, న్యాయ సేవల దినోత్సవంతో ముడిపెట్టిన కార్యక్రమాలను బలోపేతం చేసినప్పుడు భారత న్యాయ వ్యవస్థకు కొత్త జవసత్త్వాలు అందుతాయని శ్రీ మోదీ అన్నారు. ఇరవయ్యో జాతీయ సమావేశాల వేళ అందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ అనేక సందేశాలను పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:

‘‘జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు’’.

‘‘సర్వోన్నత న్యాయస్థానంలో ఏర్పాటు చేసిన జాతీయ సమావేశం మన న్యాయ వ్యవస్థను అందరి కోసం, మరింత సులభతరంగా తీర్చిదిద్దే ప్రయత్నాల్ని దృఢతరం చేస్తుందని నేను నమ్ముతున్నాను’’.

‘‘గత కొన్నేళ్లలో, మా ప్రభుత్వం ‘న్యాయ సౌలభ్యాన్ని’ పెంచడానికి అనేక ముఖ్య నిర్ణయాల్ని తీసుకుంది’’.

‘‘వివిధ కార్యక్రమాలు పేదలకూ, సమాజంలో నిరాదరణకు గురైన వర్గాలకూ, మోసపోయిన వర్గాల వారికీ సత్వర, మరింత అందుబాటులో న్యాయం లభించేలా చూశాయి’’.

‘‘భారత సంప్రదాయాల్లో మధ్యవర్తిత్వానికి సదా ఓ ముఖ్య స్థానం ఉంది. కొత్త మధ్యవర్తిత్వ చట్టం మధ్యవర్తిత్వాన్ని ఆధునికీకరించడంతో పాటు, ఇతర అంశాలపై కూడా దృష్టిని కేంద్రీకరిస్తోంది’’.

ఎనభై వేల కన్న ఎక్కువ తీర్పులను విభిన్న భారతీయ భాషల్లోకి అనువాదం చేయాలని సర్వోన్నత న్యాయస్థానం చేపట్టిన కార్యక్రమం నిజంగా ఎంతో అభినందించదగ్గది. ఈ ప్రశంసనీయ ప్రయత్నాన్ని ఉన్నత న్యాయస్థానాలు, జిల్లా న్యాయస్థానాలు మరింత ముందుకు తీసుకుపోతాయని నేను నమ్ముతున్నాను’’.

 

***


(రిలీజ్ ఐడి: 2254511) సందర్శకుల సూచీ సంఖ్య : : 34