హోం మంత్రిత్వ శాఖ
పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితులకు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా నివాళులు
మన వాళ్లను కోల్పోయామన్న దుఃఖం, వేదన ఇప్పటికీ ఇంకా భారతీయులందరి గుండెనూ పిండేస్తోంది
మానవతకు అతి పెద్ద శత్రువు ఉగ్రవాదమే.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడి, దానిని తుదముట్టించడంలో మనమంతా ఏకతాటి మీద నిలిచి తీరాలి….
ఉగ్రవాదానికీ, ఉగ్రవాదానికి కొమ్ము కాసే వారికీ వ్యతిరేకంగా భారత్ జీరో-టాలరెన్స్ విధానాన్ని ఇక ముందూ అనుసరిస్తుంది
నాడు పోస్టు చేయడమైనది:
22 APR 2026 10:05AM by PIB Hyderabad
పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగి ఏడాది పూర్తి అయింది. ఈ సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా నివాళులు అర్పించారు. మన వాళ్లను కోల్పోయామన్న దుఃఖం, వేదన ఇప్పటికీ ఇంకా భారతీయులందరి గుండెనూ పిండేస్తోందని ఆయన అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ‘‘సరిగ్గా ఏడాది కిందట జరిగిన భయానక పహల్గామ్ ఉగ్రవాద దాడిలో తోటి పౌరులు ప్రాణాలను కోల్పోయిన సంగతిని మనం బరువెక్కిన హృదయాలతో ఈ రోజు గుర్తుచేసుకుంటున్నాం. మన వాళ్లను కోల్పోయామన్న దుఃఖం, వేదన ఇప్పటికీ ఇంకా భారతీయులందరి గుండెనూ పిండేస్తోంది. మానవత్వానికి అతి పెద్ద శత్రువు ఉగ్రవాదమే.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడి, దానిని తుదముట్టించడంలో మనమంతా తప్పక ఏకతాటి మీద నిలుద్దాం. ఉగ్రవాదానికీ, ఉగ్రవాదానికి కొమ్ము కాసే వారికీ వ్యతిరేకంగా భారత్ జీరో-టాలరెన్స్ విధానాన్ని ఇక ముందూ అనుసరిస్తుంది’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2254380)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8