ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సౌదీ అరేబియా యువరాజు, పీఎం గౌరవ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్‌తో ప్రధానమంత్రి చర్చలు

నాడు పోస్టు చేయడమైనది: 28 MAR 2026 9:17PM by PIB Hyderabad

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో సౌదీ అరేబియా యువరాజుపీఎం గౌరవ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్‌తో ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారుఆ ప్రాంతంలోని ఇంధన మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారునౌకాయాన స్వేచ్ఛసముద్ర మార్గాల భద్రత వంటి అంశాల ప్రాముఖ్యతను ఆయన స్పష్టం చేశారు. "సౌదీ అరేబియాలోని భారతీయుల సంక్షేమానికి అందిస్తున్న మద్దతుకు ధన్యవాదాలుఅని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు:

"పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై సౌదీ అరేబియా యువరాజుపీఎం గౌరవ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్‌తో మాట్లాడాను.

ఆ ప్రాంతంలోని ఇంధన మౌలిక సదుపాయాలపై జరిగిన దాడులను ఖండించాను.

నౌకాయాన స్వేచ్ఛసముద్ర మార్గాలను సురక్షితంగాఅందరికీ అందుబాటులో ఉంచాల్సిన అవసరంపై మేం చర్చించాం.

సౌదీ అరేబియాలోని భారతీయుల సంక్షేమానికి అందిస్తున్న మద్దతుకు గౌరవ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్‌‌కు ధన్యవాదాలు తెలిపాను"


(రిలీజ్ ఐడి: 2254374) సందర్శకుల సూచీ సంఖ్య : : 19