ప్రధాన మంత్రి కార్యాలయం
నేపాల్‌లో భారీ వర్షాలతో ప్రాణనష్టం... విచారం వ్యక్తం చేసిన ప్రధాని
प्रविष्टि तिथि:
05 OCT 2025 4:20PM by PIB Hyderabad
నేపాల్‌లో భారీ వర్షాల కారణంగా అపార ఆస్తి నష్టం, ప్రాణనష్టం సంభవించటం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయాల్లో నేపాల్ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ మద్దతునిస్తుందని ఆయన తెలిపారు. స్నేహపూర్వక పొరుగు దేశంగా, సంక్షోభ సమయాల్లో మొదటి ప్రతిస్పందనదారుగా ఉన్న దేశంగా భారత్ పాత్రను ప్రధానంగా పేర్కొంటూ.. అవసరమైన అన్ని సహాయాలను అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు మోదీ ప్రకటించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:
"నేపాల్‌లో భారీ వర్షాల వల్ల ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించటం బాధాకరం. ఈ క్లిష్ట సమయంలో నేపాల్ ప్రజలు, ప్రభుత్వంతో మేం నిలబడతాం. స్నేహపూర్వక పొరుగు దేశంగా, మొదటి ప్రతిస్పందనదారుగా అవసరమైన ఏదైనా సహాయం అందించేందుకు భారతదేశం కట్టుబడి ఉంది."
(रिलीज़ आईडी: 2254287)
आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali-TR
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam