ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి ‘ఈస్టర్‌’ శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 05 APR 2026 9:02AM by PIB Hyderabad

‘ఈస్టర్‌’ పర్వదినం సందర్భంగా దేశంలోని క్రైస్తవ సోదరులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ శుభాకాంక్షలు తెలిపారు.

మానవాళిలో ఆశ, పునరుజ్జీవనం విశిష్టతను ఈ పర్వదినం చాటిచెబుతుందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ పవిత్ర దినాన ప్రతిఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు కలగాలని, కొత్త వెలుగును తేవాలని ఆయన ఆకాంక్షించారు.

అలాగే, యేసుక్రీస్తు బోధనలు అందరిలో కరుణా భావనను ప్రోది చేయాలని, సమాజంలో ఐక్యతా స్ఫూర్తి నింపి, బంధాలను బలోపేతం చేయాలని శ్రీ మోదీ పేర్కొన్నారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“అందరికీ ‘ఈస్టర్’ శుభాకాంక్షలు.. ఆశ, పునరుజ్జీవనం ప్రాశస్త్యాన్ని ఈ పర్వదినం చాటిచెబుతుంది. ఈ పవిత్రదినాన ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, ఆనందం, వెలుగు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను. యేసుక్రీస్తు బోధనలు అందరిలోనూ కరుణా భావన నింపి, సమాజంలో ఐక్యతా స్ఫూర్తిని ప్రోది చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

****


(రిలీజ్ ఐడి: 2254237) సందర్శకుల సూచీ సంఖ్య : : 30
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam