ప్రధాన మంత్రి కార్యాలయం
ఆది శంకరాచార్యకు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
21 APR 2026 1:09PM by PIB Hyderabad
భారత్ మహనీయ ఆధ్యాత్మిక గురువుల్లో ఒకరైన ఆది శంకరాచార్య జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ఆది శంకరాచార్య లోతైన బోధనలు, ఆలోచనలు, అద్వైత వేదాంత తత్త్వం ప్రపంచవ్యాప్తంగా ఎందరికో మార్గదర్శకంగా ఉన్నాయని శ్రీ మోదీ అన్నారు. ఆధ్యాత్మిక చింతనను పునరుత్తేజితం చేసేందుకు ఆయన చేసిన ప్రయత్నాలూ, దేశమంతటా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కేంద్రాలూ కలకాలం స్ఫూర్తినిస్తాయన్నారు. ‘‘ఆయన జ్ఞానం మనకు దారి దీపంగా నిలవాలనీ, సత్యం, దయలతో పాటు సకల వర్గాల శ్రేయస్సుకు పాటుపడాలన్న మన నిబద్ధతను బలోపేతం చేయాలనీ కోరుకుంటున్నాను’’ అని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘భారతదేశ మహనీయ ఆధ్యాత్మిక గురువుల్లో ఒకరైన ఆది శంకరాచార్య జయంతి సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఆయన ప్రబోధాలు, ఆలోచనలు, అద్వైత వేదాంత తత్త్వం ప్రపంచవ్యాప్తంగా ఎందరికో మార్గదర్శకత్వం వహిస్తున్నాయి. సద్భావన, క్రమశిక్షణలతో పాటు, అందరిలో ఉన్నది ఒక ఆత్మేనని ఆయన స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక భావాలకు నూతన జవసత్త్వాలను అందించి, దేశంలో వివిధ చోట్ల ఆధ్యాత్మిక కేంద్రాల్ని స్థాపించేందుకు ఆయన చేసిన కృషి నిత్య స్ఫూర్తిదాయకం. ఆయన జ్ఞానం మనకు దారి దీపంగా నిలవాలనీ, సత్యం, దయ, సకల వర్గాల శ్రేయానికి పాటుపడాలన్న మన నిబద్ధతను పటిష్ఠపరచాలనీ కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2254106)
సందర్శకుల సూచీ సంఖ్య : : 23