ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఇంధన వనరుల భద్రతపై భారత్, కొరియా సంయుక్త ప్రకటన

నాడు పోస్టు చేయడమైనది: 20 APR 2026 10:56PM by PIB Hyderabad
  1. బహిరంగసమ్మిళితసంపన్న ఇండో-పసిఫిక్ ప్రాంతం కోసం ఉమ్మడి దార్శనికత కలిగిన ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వాములు భారత్కొరియా

  2. మా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రధాన ఆధారం సుదీర్ఘమైనవిశ్వసనీయమైన ఆర్థికఇంధన వనరుల భాగస్వామ్యంఇది బహిరంగ మార్కెట్లునియమాల ఆధారిత వాణిజ్యంపై ఉమ్మడి నిబద్ధతతో కూడుకున్నదిఇది మా శ్రేయస్సుఆర్థిక భద్రతకు మూలాధారంప్రస్తుత తరుణంలో ఈ ఉమ్మడి సూత్రాలను పునరుద్ఘాటించడం.. పరిశ్రమలుమార్కెట్లపై ప్రస్తుత పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకోవడం ఎంతో అవసరం.

  3. భారత-కొరియా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ), సంబంధిత ద్వైపాక్షిక విధానాల ద్వారా మా ఇంధన వనరుల వాణిజ్యంపెట్టుబడుల సహకారాన్ని పెంపొందించడానికి మేం కృషి చేస్తున్నాంకొరియా‌కు ఇతర పెట్రోలియం ఫీడ్‌స్టాక్‌లను సరఫరా చేసే కీలక దేశంగా భారత్ ఉండగా.. భారతదేశానికి పెట్రోలియం ఉత్పత్తులులూబ్రికెంట్ బేస్ ఆయిల్స్‌ను సరఫరా చేసే ప్రముఖ దేశంగా కొరియా ఉంది.

  4. ఇంధన వనరుల సరఫరా వ్యవస్థ దృఢత్వాన్ని బలోపేతం చేయడానికి ప్రాంతీయ సహకారాన్ని మరింత పటిష్ఠం చేయటంఇంధన పరివర్తనను వేగవంతం చేయడంఇంధన వనరుల కోసం బహిరంగ వాణిజ్య ఏర్పాట్లకు మద్దతు ఇవ్వడం ద్వారా మేం కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నాంమార్కెట్ స్థిరత్వంపారదర్శకతను పెంపొందించడానికి.. అలాగే కొనుగోలుదారుల దృక్పథాలను మెరుగ్గా ప్రతిబింబించేలా చేయడానికి ప్రధాన ఎల్‌ఎన్‌జీ వినియోగదారులుగా మరింత సన్నిహిత సహకారాన్ని అన్వేషించాల్సిన అవసరాన్ని మేం గుర్తించాం

  5. ఇంధన వాణిజ్యంలో దృఢత్వం పట్ల మాకున్న ఉమ్మడి నిబద్ధతను మేం గుర్తిస్తున్నాంనౌకల నిర్మాణంతో సహా దృఢమైన సముద్ర మౌలిక సదుపాయాలు రెండు దేశాల ఇంధన భద్రతను నిర్ధారించడంలో కీలకమని మేం గుర్తిస్తున్నాంఇంధన వనరుల సురక్షితమైననమ్మదగినసమర్థవంతమైన రవాణాకు మద్దతు ఇవ్వడంలో పటిష్ఠమైనవైవిధ్యభరితమైన నౌకా నిర్మాణ వ్యవస్థకు ఉన్న ప్రాముఖ్యతను మేం అంగీకరిస్తున్నాం

  6. ఈ నేపథ్యంలో భారత్కొరియా (రిపబ్లిక్ ఆఫ్ కొరియాకింది విషయాలకు కట్టుబడి ఉన్నాయి లేదా కృషి చేస్తున్నాయి

  • పరస్పరం స్థిరమైనసురక్షితమైననమ్మదగిన ఇంధన వనరుల సరఫరాను నిర్వహించడంఇందులో నాఫ్తాఇతర పెట్రోలియం ఉత్పత్తుల బహిరంగ వాణిజ్యాన్ని కొనసాగించేందుకు రెండు దేశాలూ ప్రయత్నిస్తాయిమొత్తం ఇంధన విలువ పరిధిలో సహకరించుకుంటాయి

  • ఎల్‌ఎన్‌జీ వినియోగించే దేశాల మధ్య మరింత సన్నిహిత సహకారాన్ని అన్వేషించడం.

  • నౌకానిర్మాణ రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడంఇందులో భారతదేశంలో ఓడరేవుల ఏర్పాటువాటి ఆధునీకరణమానవ వనరుల అభివృద్ధిసాంకేతిక భాగస్వామ్యం వంటివి ఉన్నాయిఅయితే ఈ విషయంలో వీటికే వీటికి మాత్రమే పరిమితం కాదు.

  1. మా ప్రజల భద్రతశ్రేయస్సు ప్రయోజనం కోసం ప్రపంచ ఇంధన వనరుల సరఫరా గొలుసులు తెరిచి ఉండేలా చూడటంలో భాగస్వాములు కావాలని భారతదేశంకొరియా ప్రాంతీయ భాగస్వాములకు పిలుపునిస్తున్నాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2254035) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Kannada , Malayalam