పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పశ్చిమాసియాలో తాజా పరిణామాలపై వివిధ మంత్రిత్వ శాఖల వివరణ

· పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో గ్రామీణ పథకాలను కాపాడేందుకు సంసిద్ధతను పటిష్ఠం చేస్తోన్న గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

· అంతర్జాతీయ అనిశ్చితులు ఉన్నప్పటికీ నిరంతర ఉపాధి కల్పన, నిధులను సకాలంలో విడుదల చేయటం, గృహ నిర్మాణం, గ్రామీణ రహదారులు, జీవనోపాధి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

· నిన్న పరిశ్రమ వ్యాప్తంగా 99 శాతానికి పెరిగిన ఆన్‌లైన్ ఎల్‌పీజీ సిలిండర్ బుకింగ్‌లు

· 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల విషయంలో 7000కు పైగా అవగాహన సదస్సులను నిర్వహించిన ప్రభుత్వ రంగ చమురు సంస్థలు… 2026 ఏప్రిల్ 3 నుంచి విక్రయమైన 1,00,000కు పైగా 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు

· గత 5 రోజుల్లో రోజుకు సగటున విక్రయమైన 7000 మెట్రిక్ టన్నుల‌కు పైగా వాణిజ్య ఎల్‌పీజీ

· భారతీయ నావికుల భద్రత, రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తోన్న కేంద్ర ప్రభుత్వం

· గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల నుంచి ఇప్పటివరకు స్వదేశానికి సురక్షితంగా వచ్చిన 2,563 మందికి పైగా భారతీయ నావికులు

· గల్ఫ్ దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలను కొనసాగిస్తున్న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

నాడు పోస్టు చేయడమైనది: 20 APR 2026 5:28PM by PIB Hyderabad

పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులపై మీడియాకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు జాతీయ మీడియా కేంద్రంలో ఒక సమావేశాన్ని నిర్వహించింది. పెట్రోలియం- సహజ వాయువు, ఓడరేవులు- నౌకాయానం- జలమార్గాలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల అధికారులు ఇంధన లభ్యత, సముద్రయాన కార్యకలాపాలు, ఆ ప్రాంతంలోని భారతీయలకు అందుతున్న సహాయం, కీలక రంగాలలో స్థిరత్వాన్ని కాపాడేందుకు తీసుకుంటున్న చర్యల గురించి తాజా సమాచారాన్ని అందించారు. ఈ సమావేశంలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కూడా తాజా విషయాలను పంచుకుంది.

 

గ్రామీణాభివృద్ధి రంగం

 

పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులు.. వాటి వల్ల ప్రపంచ సరఫరా గొలుసులు, వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణ ధోరణులపై ప్రభావం ఉండే అవకాశం ఉన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన గ్రామీణ సంక్షేమ, మౌలిక సదుపాయాల పథకాల అమలులో ఎటువంటి అంతరాయం కలగకుండా చూసేందుకు తీసుకున్న ముందస్తు సన్నద్ధత చర్యలపై సమగ్ర సమీక్షను గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ చేపట్టింది.

 

గ్రామీణ జీవనోపాధి, గృహ నిర్మాణం, రోడ్ల అభివృద్ధి, జలవనరుల పనులపై పరోక్ష ప్రభావం చూపే అవకాశం ఉన్న పరిణామాలను మంత్రిత్వ శాఖ నిశితంగా పర్యవేక్షిస్తోంది. ప్రయోజనాల కొనసాగింపు, నిధులను సకాలంలో విడుదల చేయటం, కొనసాగుతున్న పథకాలు సజావుగా అమలయ్యేలా చూసుకునేందుకు తగిన ముందస్తు యంత్రాంగాలను ఏర్పాటు చేసింది.

ఉపాధి భద్రత, వేతన మద్దతు

ప్రతిపాదిత వీబీ–జీ రామ్ జీ చట్టం- 2025 అమలులోకి వచ్చే వరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ)- 2005 పూర్తిగా అమలులో ఉంటుంది. గ్రామీణ కుటుంబాలకు వేతన ఉపాధి కల్పించడంలో ఎటువంటి అంతరాయం ఉండదు.

 

· డిమాండ్ ఆధారిత ఉపాధి, సకాలంలో వేతన చెల్లింపులతో సహా అన్ని శాసనబద్ధమైన హక్కులు ఎటువంటి మార్పులు లేకుండా యథావిధిగా కొనసాగుతాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన వేతనాలే వర్తిస్తాయి.

 

· తగినంత నగదు లభ్యతను ఉంచడానికి, వేతనాల పంపిణీలో ఎటువంటి అంతరాయం లేకుండా చూసేందుకు ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ కింద వేతన విభాగం కోసం మొదటి విడతగా సుమారు రూ. 17,744 కోట్లను విడుదల చేస్తున్నారు.

 

· ఈ ప్రతిపాదిత వీబీ–జీ రామ్ జీ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత 125 రోజుల వేతన ఉపాధికి మెరుగైన హామీని కల్పించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన సవరించిన వేతన రేట్లను విడిగా నోటిఫై చేస్తారు.

 

· సరఫరా గొలుసు సవాళ్లను ఎదుర్కొనేందుకు గృహ నిర్మాణ పథకం సిద్ధంగా ఉంది.  

 

· గ్రామీణ ప్రాంతాల్లో ‘అందరికీ గృహవసతి’ లక్ష్యాన్ని సాధించేందుకు 2029 మార్చి నాటికి 4.95 కోట్ల ఇళ్లను నిర్మించేలా గ్రామీణ ప్రధాన మంత్రి ఆవాస్ యోజనను (పీఎంఏవై-జీ) మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది.

 

· సామాగ్రి సరఫరాలో అంతరాయాలు లేదా ధరలలో హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు సన్నద్ధతలో భాగంగా ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) నిధులను సకాలంలో విడుదల చేయడానికి.. ఆవాస్‌సాఫ్ట్ ద్వారా తక్షణ పర్యవేక్షణ, జియో-ట్యాగింగ్‌కు, కొనసాగుతున్న ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి మంత్రిత్వ శాఖ ప్రాధాన్యతనిస్తోంది.

 

· లబ్ధిదారులకు కనీస సౌకర్యాల పూర్తి ప్యాకేజీ అందేలా చూడటానికి ఉపాధి దినాలు, పారిశుద్ధ్యం, తాగునీరు, ఎల్‌పీజీ, విద్యుత్ వంటి అంశాల ద్వారా బలమైన అనుసంధాన మద్దతును మంత్రిత్వ శాఖ నిర్ధారిస్తోంది.

 

· భవిష్యత్తులో మార్కెట్ అస్థిరతను తట్టుకునేలా సామర్థ్యాన్ని పెంచడానికి మెటీరియల్ బ్యాంకుల ఏర్పాటు వంటి నిర్మాణాత్మక చర్యలను కూడా ప్రోత్సహిస్తున్నారు.

 

· పీఎమ్‌జీఎస్‌వై కింద రాష్ట్రాలు ప్రతిపాదించిన ప్రస్తుత రేట్ల షెడ్యూల్ ప్రకారం పనులు మంజూరు చేస్తారు.

 

· పీఎమ్‌జీఎస్‌వై-I, II, IIIతో పాటు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల రోడ్డు అనుసంధానత ప్రాజెక్టుల కింద మంజూరైన అన్ని పనులకు టెండర్లు ఖరారయ్యాయి లేదా వాటి నిర్మాణం ప్రస్తుతం కొనసాగుతోంది. పీఎమ్‌జీఎస్‌వై-III కింద కేవలం కొన్ని వంతెనలకు సంబంధించిన పనులు మాత్రమే మంజూరు దశలో ఉన్నాయి.

· పీఎమ్‌జీఎస్‌వై-IV కింద సుమారు 12,100 కి.మీ రోడ్డు పనులు మంజూరయ్యాయి. అవి ప్రస్తుతం టెండర్ దశలో ఉన్నాయి. ప్రస్తుతం మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో బిటుమెన్ వాటా తక్కువగా ఉన్నందున ప్రపంచ మార్కెట్ అస్థిరతల ప్రభావం పరిమితంగానే ఉంది.

 

· భవిష్యత్తు ప్రాజెక్ట్ బ్యాచ్‌లను అప్పటి మార్కెట్ పరిస్థితులు, వ్యయ ధోరణులను ప్రతిబింబించేలా అప్‌డేట్ చేసిన రేట్ల షెడ్యూల్‌ను ఉపయోగించి అంచనా వేస్తారు. 

 

వ్యవసాయ, సహజ వనరుల దృఢత్వాన్ని పటిష్ఠం చేయటం

 

· భూ వనరుల శాఖ 50 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో డబ్ల్యూడీసీ-పీఎమ్‌కేఎస్‌వై 2.0ను అమలు చేస్తోంది. దీని ద్వారా నీటి సంరక్షణ, వ్యవసాయ సాంద్రతను పెంచడం, ఉద్యానవనం, పచ్చికభూముల అభివృద్ధిని బలోపేతం చేస్తున్నారు.

 

· ఏదైనా కొత్తగా తలెత్తే పరిస్థితులను ఎదుర్కోవడానికి, పథకాల అమలు సజావుగా సాగేలా చూడటానికి వ్యవసాయ- రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖతో పాటు ఇతర సంబంధిత మంత్రిత్వ శాఖల సన్నిహిత సమన్వయంతో ఈ శాఖ పనిచేస్తోంది.

 

ఇంధన సరఫరా, ఇంధన లభ్యత

 

హోర్ముజ్ జలసంధికి సంబంధించి నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్‌పీజీ ఎటువంటి అంతరాయం లేకుండా లభించేలా చూసేందుకు పెట్రోలియం - సహజ వాయువు మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది. మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం:

ప్రజా సూచనలు, పౌర అవగాహన

 

· పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. కాబట్టి ప్రజలు వీటిని కంగారుతో కొనుగోలు చేయొద్దని సూచించారు. 

 

· వదంతులను నమ్మొద్దు. సరైన సమాచారం కోసం అధికారిక ఖాతాలపై మాత్రమే ఆధారపడాలి. 

 

· ఎల్‌పీజీ వినియోగదారులు డిజిటల్ బుకింగ్ ప్లాట్‌ఫా‌మ్‌లను ఉపయోగించాలని, డిస్ట్రిబ్యూటర్ల వద్దకు వెళ్లడం నివారించాలని కోరారు. 

 

· పీఎన్‌జీ, ఎలక్ట్రిక్ లేదా ఇండక్షన్ కుక్‌టాప్‌ల వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించాల్సిందిగా అందరినీ ప్రోత్సహిస్తున్నారు. 

 

· ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రజలందరూ రోజువారీ వినియోగంలో ఇంధనాన్ని పొదుపు చేయడానికి తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరారు.

 

ప్రభుత్వ సన్నద్ధత, సరఫరా నిర్వహణ చర్యలు

 

· ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య గృహ వినియోగ ఎల్‌పీజీ, గృహావసరాల పీఎన్‌జీ, రవాణా సీఎన్‌జీ విషయంలో సరఫరా 100 శాతం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

 

· వాణిజ్య ఎల్‌పీజీ విషయంలో ఆసుపత్రులు, విద్యా సంస్థలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వీటితో పాటు ఫార్మా, ఉక్కు, వాహనాలు, విత్తన - వ్యవసాయ రంగాలకు కూడా ప్రాధాన్యత కల్పించారు. వలస కార్మికుల కోసం 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల సరఫరా 2026 మార్చి 2, 3 తేదీల్లో ఉన్న సగటు రోజువారీ సరఫరాతో పోలిస్తే రెట్టింపు అయింది.

 

· ప్రభుత్వం ఇప్పటికే సరఫరా, డిమాండ్ రెండింటినీ సమన్వయం చేసేలా పలు హేతుబద్ధీకరణ చర్యలను అమలు చేసింది. ఇందులో చమురు శుద్ధి కేంద్రాల ఉత్పత్తిని పెంచడం.. గ్యాస్ బుకింగ్ గడువును పట్టణ ప్రాంతాల్లో 21 నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకు పొడిగించడం.. ప్రాధాన్యత కలిగిన రంగాలకు సరఫరాను నిర్ధారించడం వంటివి ఉన్నాయి.

· ఎల్‌పీజీ డిమాండ్‌పై ఒత్తిడిని తగ్గించడానికి కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను అందుబాటులోకి తెచ్చారు.

 

· చిన్న, మధ్యతరహా వినియోగదారులకు పంపిణీ చేసేందుకు రాష్ట్రాలకు అదనపు బొగ్గును సరఫరా చేయాలని కోల్ ఇండియా, సింగరేణి కాలరీస్‌ను బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

 

· గృహ, వాణిజ్య వినియోగదారులకు కొత్త పీఎన్‌జీ కనెక్షన్‌ల పొందటాన్ని సులభతరం చేయాలని రాష్ట్రాలకు సూచించారు. 

 

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సంస్థాగత యంత్రాంగాలతో సమన్వయ ప్రయత్నాలు

 

నిత్యావసర వస్తువుల చట్టం-1955, ఎల్‌పీజీ నియంత్రణ ఉత్తర్వులు-2000 ప్రకారం సరఫరాను పర్యవేక్షించడానికి, అక్రమంగా నిల్వ చేయడం, బ్లాక్ మార్కెటింగ్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది.

 

పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ వంటి నిత్యావసర వస్తువుల సరఫరా పరిస్థితిని పర్యవేక్షించడంలో, నియంత్రించడంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంది. భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పలు లేఖలు, వీడియో అనుసంధానాల ద్వారా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించింది.

 

పౌరులకు సరిపడా ఇంధన లభ్యత గురించి భరోసా ఇవ్వడానికి చురుకైన ప్రజా సమాచార ప్రసార ఆవశ్యకతను భారత ప్రభుత్వం 27.03.2026, 02.04.2026 తేదీల నాటి లేఖల ద్వారా స్పష్టం చేసింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో నిరంతర సమీక్షా సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 02.04.2026న (ఎమ్‌వోపీఎన్‌జీ కార్యదర్శి అధ్యక్షతన), 06.04.2026న (ఎమ్‌వోపీఎన్‌జీ కార్యదర్శి, సమాచార-ప్రసార, వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శుల సంయుక్త అధ్యక్షతన) సమావేశాలు నిర్వహించారు. కింది విషయాలను స్పష్టం చేశారు:

రోజువారీ పత్రికా సమావేశాలు నిర్వహించడం, ఎప్పటికప్పుడు ప్రజలకు సూచనలు జారీ చేయడం.

 

సోషల్ మీడియాలో నకిలీ వార్తలు, తప్పుడు సమాచారాన్ని చురుగ్గా పర్యవేక్షించడం, ఎదుర్కోవడం.

 

జిల్లా యంత్రాంగం ద్వారా రోజువారీ అమలు చర్యలను ముమ్మరం చేయడం, ఓఎమ్‌సీల సమన్వయంతో సోదాలు, తనిఖీలను కొనసాగించడం.

 

తమ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం

 

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించిన అదనపు ఎస్‌కేవో కోసం ఎస్‌కేవో కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం.

 

పీఎన్‌జీ వినియోగాన్ని, ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం.

 

ముఖ్యంగా గృహ అవసరాల కోసం ఎల్‌పీజీ సరఫరాకు ప్రాధాన్యమివ్వడం, నిరంతరాయ సరఫరాను నిర్ధారించడానికి 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల పంపిణీని చేపట్టడం.

 

అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కంట్రోల్ రూమ్‌లను, జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేశాయి.

 

అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పత్రికా సమావేశాలను నిర్వహిస్తున్నాయి.

 

అమలు, పర్యవేక్షణ చర్యలు

 

ఎల్‌పీజీ అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా చర్యలు కొనసాగుతున్నాయి. 19.04.2026న దేశవ్యాప్తంగా 1900కు పైగా సోదాలు నిర్వహించారు.

 

ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆకస్మిక తనిఖీలను ముమ్మరం చేసి, 267 ఎల్‌పీజీ పంపిణీ సంస్థలకు జరిమానాలు విధించాయి. నిన్నటి వరకు 67 ఎల్‌పీజీ పంపిణీ సంస్థల లైసెన్స్‌ను తాత్కాలికంగా నిలిపివేశాయి.

ఎల్‌పీజీ సరఫరా

 

గృహాలకు ఎల్‌పీజీ సరఫరా స్థితి:

 

ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఎల్‌పీజీ సరఫరా ప్రభావితం అవుతూనే ఉంది.

 

గృహాలకు ఎల్‌పీజీ సరఫరా కోసం ప్రాధాన్యమిస్తున్నారు.

 

ఎల్‌పీజీ పంపిణీ కేంద్రాల్లో సరఫరా నిలిచిపోయినట్లు ఎటువంటి నివేదికలు లేవు.

 

నిన్న పరిశ్రమ ప్రాతిపదికన ఆన్‌లైన్ ఎల్‌పీజీ సిలిండర్ బుకింగ్‌లు 99 శాతానికి పెరిగాయి.

 

సిలిండర్ల సరఫరా సక్రమంగా జరిగేలా చూసేందుకు, డెలివరీ అథెంటికేషన్ కోడ్ (డీఏసీ) ఆధారిత డెలివరీలు సుమారు 92 శాతానికి పెరిగాయి. వినియోగదారుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు డీఏసీ అందుతోంది.

 

గృహాలకు ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరాను నిర్ధారించడానికి అనేక ఎల్‌పీజీ పంపిణీ కేంద్రాలు ఆదివారం కూడా పనిచేసాయి.

 

వాణిజ్య ఎల్‌పీజీ సరఫరా, కేటాయింపు చర్యలు:

 

10 శాతం సంస్కరణ-అనుసంధాన కేటాయింపు సహా, మొత్తం వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపును సంక్షోభానికి ముందు స్థాయిల్లో సుమారు 70 శాతానికి పెంచారు.

 

21.03.2026 తేదీ నాటి లేఖలో పేర్కొన్న 20 శాతం పరిమితిని మించి, 2026 మార్చి 2-3 తేదీల్లో వలస కార్మికులకు చేసే సగటు రోజువారీ సరఫరా (సిలిండర్ల సంఖ్య) ఆధారంగా, ప్రతి రాష్ట్రంలో వలస కార్మికులకు పంపిణీ చేయడానికి అందుబాటులో ఉన్న 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల రోజువారీ పరిమాణాన్ని రెట్టింపు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం 06.04.2026 తేదీ నాటి లేఖ ద్వారా తెలియజేసింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల సహాయంతో తమ రాష్ట్రంలోని వలస కార్మికులకు మాత్రమే ఈ 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు సరఫరా చేయడానికి వీలుగా ఇవి రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉంటాయి.

3 ఏప్రిల్ 2026 నుంచి, ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల కోసం 7000కు పైగా అవగాహన శిబిరాలను నిర్వహించాయి. వీటిలో 100,000లకు పైగా 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లూ అమ్ముడయ్యాయి. నిన్న 220కి పైగా శిబిరాల ద్వారా 3360 – 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు అమ్ముడయ్యాయి.

 

23 మార్చి 2026 నుంచి, 18.45 లక్షలకు పైగా 5-కేజీల ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ సిలిండర్లు అమ్ముడయ్యాయి.

 

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వాణిజ్య ఎల్‌పీజీ పంపిణీకి ప్రణాళిక రూపొందించడానికి... ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌లకు చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ రాష్ట్ర అధికారులు, పరిశ్రమ సంస్థలతో సమన్వయం చేస్తోంది.

 

గత 5 రోజుల్లో, సగటున రోజుకు 7000 మెట్రిక్ టన్నులకు పైగా వాణిజ్య ఎల్‌పీజీ అమ్ముడైంది.

 

గత వారంలో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల సగటు ఆటో ఎల్‌పీజీ అమ్మకాలు రోజుకు సుమారు 350 మెట్రిక్ టన్నులు కాగా, ఫిబ్రవరి 26న ఈ సగటు రోజుకు 177 మెట్రిక్ టన్నులుగా ఉంది.

 

ఆటో ఎల్‌పీజీ అమ్మకాలు ప్రైవేట్ రంగం నుంచి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలకు తరలిపోయినట్లు గమనించారు. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి, పీఎస్‌యూ ఓఎమ్‌సీల ద్వారా ఆటో ఎల్‌పీజీ అమ్మకాలను పెంచారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ప్రధానంగా పెరుగుదల నమోదైంది.

 

సహజ వాయువు సరఫరా, పీఎన్‌జీ విస్తరణ కార్యక్రమాలు

 

డీ-పీఎన్‌జీ, సీఎన్‌జీ-రవాణాకు 100 శాతం సరఫరాలతో వినియోగదారులకు ప్రాధాన్యమిస్తున్నారు.

 

ఎరువుల కర్మాగారాలకు కేటాయించే మొత్తం గ్యాస్‌ను, వాటి ఆరు నెలల సగటు వినియోగంలో సుమారు 95 శాతానికి పెంచారు.

 

అదనంగా సీజీడీ నెట్‌వర్క్‌ల ద్వారా జరిగే సరఫరాలు సహా ఇతర పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు గ్యాస్ సరఫరాను 80 శాతం వరకు పెంచారు.

 

వాణిజ్య ఎల్‌పీజీ లభ్యతకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించడానికి, సీజీడీ సంస్థలు తమ అన్ని జీఏల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్ల వంటి వాణిజ్య సంస్థలకు పీఎన్‌జీ కనెక్షన్లకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు.

 

ఐజీఎల్, ఎమ్‌జీఎల్, గెయిల్ గ్యాస్, బీపీసీఎల్ వంటి సీజీడీ కంపెనీలు గృహ, వాణిజ్య పీఎన్‌జీ కనెక్షన్‌ల కోసం ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి.

 

సీజీడీ నెట్‌వర్క్‌ల విస్తరణకు అవసరమైన ఆమోదాలను వేగవంతం చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలను కోరారు.

ఎల్‌పీజీ నుంచి పీఎన్‌జీకి దీర్ఘకాలిక పరివర్తనలో సహాయపడే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వాణిజ్య ఎల్‌పీజీలో అదనంగా 10 శాతం కేటాయింపును తేది 18.03.2026 నాటి లేఖ ద్వారా భారత ప్రభుత్వం ప్రతిపాదించింది.

 

పీఎన్‌జీ విస్తరణ సంస్కరణలకు అనుసంధానంగా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అదనపు వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపును పొందుతున్నాయి.

 

రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 24.03.26 తేదీ నాటి లేఖ ద్వారా సీజీడీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన దరఖాస్తులను ప్రాధాన్యత ప్రాతిపదికన ప్రాసెస్ చేయడానికి, 'తగ్గించిన కాలపరిమితులతో సీజీడీ మౌలిక సదుపాయాల కోసం వేగవంతమైన ఆమోద విధానం'ను 3 నెలల పాటు ప్రత్యేకంగా అమలు చేస్తోంది.

 

నిత్యావసర వస్తువుల చట్టం-1955 కింద సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్‌లైన్‌లు, ఇతర సౌకర్యాల ఏర్పాటు, నిర్మించడం, నిర్వహించడం, విస్తరించడం ద్వారా) ఉత్తర్వులు-2026ను భారత ప్రభుత్వం 24.03.2026 తేదీ గల గెజిట్ ద్వారా జారీ చేసింది. ఈ ఉత్తర్వులు దేశవ్యాప్తంగా పైప్‌లైన్‌లను వేయడానికి, విస్తరించడానికి ఒక క్రమబద్ధమైన, కాలపరిమితితో కూడిన విధాన ప్రణాళికను అందిస్తున్నాయి. ఇది అనుమతులు, భూమి లభ్యతలో జాప్యాలను పరిష్కరించడం సహా, నివాస ప్రాంతాలతో పాటు సహజ వాయువు మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధికి వీలు కల్పిస్తుంది. ఇది పీఎన్‌జీ నెట్‌వర్క్ వృద్ధిని వేగవంతం చేస్తుందని, మారుమూల ప్రాంతాలకు కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని, పరిశుద్ధ ఇంధనాలకు మారడానికి మద్దతునిస్తుందని, తద్వారా ఇంధన భద్రతను బలోపేతం చేసి భారత గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తుందని భావిస్తున్నారు.

 

డీ-పీఎన్‌జీ కనెక్షన్‌లను వేగవంతం చేయాలని పీఎన్‌జీఆర్‌బీ సీజీడీ సంస్థలను ఆదేశించింది. పీఎన్‌జీ విస్తరణలో వేగాన్ని కొనసాగించడానికి నేషనల్ పీఎన్‌జీ డ్రైవ్ 2.0ను 30.06.2026 వరకు పొడిగించారు.

 

పరిశుభ్రమైన, మరింత సురక్షితమైన, స్వయం సమృద్ధిగల ఇంధన భవిష్యత్తును ప్రోత్సహించడం లక్ష్యంగా భారత ప్రభుత్వం రాష్ట్ర సీబీజీ విధానం కోసం నమూనా ముసాయిదాను అభివృద్ధి చేసింది. ఈ నమూనా విధానం సీబీజీ అభివృద్ధి కోసం రాష్ట్రాలు తమ సొంత, పెట్టుబడిదారులకు అనుకూలమైన, అమలుకు అనువుగా ఉండే వ్యవస్థను సృష్టించుకోవడానికి వీలు కల్పించే ఒక సమగ్రమైన, సరళమైన మార్గదర్శక విధాన ప్రణాళికగా పనిచేయడానికి ఉద్దేశించబడింది. దీనిని ఎంచుకున్న రాష్ట్రాలకు వాణిజ్య ఎల్‌పీజీ అదనపు కేటాయింపుల కోసం తదుపరి విడతలో ప్రాధాన్యమిస్తున్నారు.

 

సీజీడీ నెట్‌వర్క్, మౌలిక సదుపాయాల ఏర్పాటు, నిర్వహణ కోసం 15 రోజుల్లోపు అనుమతి మంజూరు చేసేందుకు ఎస్‌పీసీబీ, పీసీసీలకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని ఎమ్ఓఈఎఫ్‌సీసీ 07.04.2026 తేదీ నాటి ఉత్తర్వుల ద్వారా సీపీసీబీని ఆదేశించింది.

· 2026 మార్చి నుంచి 4.93 లక్షలకు పైగా పీఎన్‌జీ కనెక్షన్ల గ్యాసిఫికేషన్‌ పూర్తయింది. అలాగే, కొత్త కనెక్షన్ల కోసం మరో 5.51 లక్షల మందికి పైగా నమోదు చేసుకున్నారు.

 

· మరోవైపు 19.04.2026 నాటికి 39,200 మందికి పైగా పీఎన్‌జీ వినియోగదారులు MYPNGD.in వెబ్‌సైట్ ద్వారా ఎల్పీజీ కనెక్షన్లను వదులుకున్నారు.

 

ముడిచమురు నిల్వలు... శుద్ధి కర్మాగారాల కార్యకలాపాలు

 

· దేశంలో తగినంత ముడి చమురు నిల్వలు అందుబాటులో ఉండటంతో శుద్ధి కర్మాగారాలన్నీ అదనపు సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. దీంతోపాటు పెట్రోల్, డీజిల్ నిల్వల నిర్వహణ సంతృప్తికరంగా ఉంది.

 

· దేశీయ వినియోగానికి కొరత రాకుండా శుద్ధి కర్మాగారాల్లో వంటగ్యాస్‌ ఉత్పత్తిని పెంచారు.

 

· దేశీయ మార్కెట్‌కు పెట్రో రసాయనాల ముడిసరకు సరఫరాకు భరోసా ఇచ్చే లక్ష్యంతో అంతర-మంత్రిత్వ శాఖల సంయుక్త కార్యవర్గాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తదనంతరం సెంటర్ ఫర్ హై టెక్నాలజీ నిర్దేశించిన ప్రకారం కీలక రంగాలకు సి3, సి4 స్ట్రీమ్‌లను నిర్దిష్ట పరిమాణంలో అందుబాటులో ఉంచే విధంగా 01.04.2026న ఒక ఉత్తర్వు జారీచేసింది.

 

· ఔషధ విభాగం, రసాయనాలు-పెట్రో రసాయనాల, పరిశ్రమల ప్రోత్సాహక-అంతర్గత వాణిజ్య విభాగాల అభ్యర్థనల ప్రాతిపదికన ఫార్మా, రసాయన రంగ కంపెనీలకు ఎల్‌పీజి నిధి నుంచి రోజుకు 1000 టన్నులు కేటాయించింది.

 

· దేశవ్యాప్తంగా 2026 ఏప్రిల్ 9 నుంచి 4050 టన్నులకు పైగా ప్రొపిలీన్ విక్రయించారు.

 

చిల్లర మార్కెట్‌లో ఇంధన లభ్యత.. ధరల నిర్ణాయక చర్యలు

 

· దేశవ్యాప్తంగా చిల్లర విక్రయ కేంద్రాల కార్యకలాపాలు సాధారణ స్థాయిలో కొనసాగుతున్నాయి.

 

· పశ్చిమాసియా సంక్షోభం వల్ల ముడిచమురు ధరలు అసాధారణంగా పెరిగినప్పటికీ, వినియోగదారులపై భారం పడకుండా పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని ప్రభుత్వం తగ్గించింది.

 

· దేశీయ మార్కెట్లో ఈ ఉత్పత్తుల లభ్యతకు భరోసాగా 11.04.2026న గెజిట్ నోటిఫికేషన్ ద్వారా డీజిల్‌పై ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ.55.50కి, ఏటీఎఫ్‌పై రూ.42కి పెంచింది.

 

· పెట్రోలు, డీజిల్ సాధారణ చిల్లర ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అలాగే ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల చిల్లర కేంద్రాల్లోనూ ధరల పెంపు లేదు.

 

కిరోసిన్ లభ్యత.. పంపిణీకి చర్యలు

 

· సాధారణ కేటాయింపులకు అదనంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 48,000 కిలోలీటర్ల కిరోసిన్‌ను ప్రభుత్వం కేటాయించింది.

 

· 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎస్‌కెఓ కేటాయింపు ఉత్తర్వులు జారీచేసినా, హిమాచల్ ప్రదేశ్, లద్దాఖ్‌ తమకు అవసరం లేదని తెలిపాయి.

 

సముద్ర భద్రత.. నౌకారవాణా కార్యకలాపాలు

 

పశ్చిమాసియా ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహించే భారతీయ నౌకలు, నావికుల భద్రతకు కేంద్ర ఓడరేవులు-నౌకా రవాణా-జలమార్గాల మంత్రిత్వ శాఖ తగు చర్యలు చేపట్టిన నేపథ్యంలో కిందివిధంగా ప్రకటించింది:

 

· నౌకల తాజా సమాచారం: భారత పతాకంగల ‘దేశ్ గరిమ’ ముడి చమురు ట్యాంకర్ నౌక 97,422 టన్నుల ముడి చమురుతో ఏప్రిల్ 18న హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. ఇందులో 31 మంది భారతీయ నావికులు ఉండగా, ఇది ఏప్రిల్ 22న ముంబయికి చేరుతుందని అంచనా.

· గడచిన 48 గంటల్లో హోర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న భారతీయ నౌకలు ‘వీఎల్‌సీసీ ‘సమ్నార్ హెరాల్డ్’, బల్క్ క్యారియర్ ‘జగ్ అర్ణవ్’పై కాల్పులు చోటుచేసుకోవడంతో అవి తిరిగి పర్షియన్ గల్ఫ్‌ వైపు వెళ్లపోయాయి. అయితే, ఈ సందర్భంగా సిబ్బందిలో ఎవరూ గాయపడలేదు.

 

· ఈ నేపథ్యంలో మంత్రిత్వ శాఖ రెండు నౌకల సిబ్బంది, యాజమాన్యంతో నిరంతరం సంప్రదిస్తూ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. భారతీయ నావికుల భద్రత, రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. ఈ పరిస్థితిని సదా పర్యవేక్షిస్తూ సాధ్యమైన సహాయం చేస్తామని హామీ ఇచ్చింది.

 

· భారతీయ నావికులందరూ సురక్షితం… విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంబంధిత భాగస్వామ్య వ్యవస్థల సమన్వయంతో పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది.

 

· డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూమ్ తాజా సమాచారం: కంట్రోల్ రూమ్ ప్రారంభించిన నాటినుంచి 6,918 కాల్స్, 14,605కు పైగా ఈమెయిళ్లను నిర్వహించింది. ఇందులో భాగంగా గత 24 గంటల్లోనే 25 కాల్స్, 135 ఈమెయిళ్లు అందాయి.

***


(రిలీజ్ ఐడి: 2253968) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam