రైల్వే మంత్రిత్వ శాఖ
వేసవి సందర్భంగా మూడు నెలల వ్యవధిలో దేశవ్యాప్తంగా 18,262 ప్రత్యేక రైలు ట్రిప్పులను నడపనున్న భారత రైల్వే
రద్దీ సమయాల్లో ప్రయాణికులకు ఊరటనిచ్చేందుకు, విస్తృత అనుసంధానం కోసం ఇప్పటికే 11, 294 రైళ్ల ప్రకటన
అత్యధిక వేసవి ప్రత్యేక రైళ్లను నడిపే జోన్లుగా మధ్య రైల్వే (3,082 ట్రిప్పులు), తూర్పు మధ్య రైల్వే (2,711 ట్రిప్పులు), వాయువ్య రైల్వే (2,245 ట్రిప్పులు)
వేసవి రద్దీ సమయాల్లో లక్షలాది మంది ప్రయాణికులకు వెయిటింగ్ లిస్టు సమస్యను తగ్గించి, సుఖవంతమైన ప్రయాణాన్ని అందించనున్న వేసవి ప్రత్యేక రైళ్లు
నాడు పోస్టు చేయడమైనది:
20 APR 2026 3:39PM by PIB Hyderabad
రాబోయే 2026 వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారికి సుఖవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు భారతీయ రైల్వే సిద్ధమైంది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న ప్రయాణికుల డిమాండును తీర్చడానికి రైల్వే శాఖ భారీ స్థాయిలో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఏప్రిల్ 15, 2026 నుంచి జూలై 15, 2026 వరకు ప్రత్యేక రైలు సేవలను అందుబాటులో ఉండనున్నాయి. ఈ మూడు నెలల కాలానికి 908 వేసవి ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ ఆమోదించింది. ఇవి మొత్తం 18,262 ట్రిప్పులు తిరుగుతూ ప్రయాణికులకు సేవలు అందిస్తాయి.
మొత్తం అనుమతి ఇచ్చిన రైళ్లలో ఇప్పటికే 660 రైళ్లకు సంబంధించిన వివరాలను రైల్వేశాఖ వెల్లడించింది. ఈ రైళ్లకు చెందిన 11, 294 ట్రిప్పుల బుకింగ్‌లు అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకుని.. టికెట్లు బుక్ చేసుకునేందుకు వీలవుతుంది.
వేసవి సెలవులు, పండుగలు, రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు చేపట్టిన ఈ ప్రణాళిక భారతీయ రైల్వే ముందస్తు విధానాన్ని ప్రతిబింబిస్తుంది.
జోన్ల వారీ వివరాలు
భారతీయ రైల్వేకు చెందిన అన్ని ప్రధాన జోన్లలో ఈ వేసవి ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. దీనివల్ల అన్ని ప్రాంతాలకు సమానమైన రవాణా సౌకర్యం కలగడమే కాకుండా, ప్రయాణికుల రద్దీని కూడా సమర్థవంతంగా నిర్వహించడానికి వీలవుతుంది.
· దక్షిణ మధ్య రైల్వే: 124 రైళ్లకు (1,184 ట్రిప్పులు) ఆమోదం తెలపగా, వాటిలో 76 రైళ్ల (324 ట్రిప్పులు) వివరాలను వెల్లడించారు.
· పశ్చిమ రైల్వే: 106 రైళ్లకు (2,078 ట్రిప్పులు) ఆమోదం తెలపగా, వాటిలో 92 రైళ్ల (1,667 ట్రిప్పులు) వివరాలను వెల్లడించారు.
· వాయువ్య రైల్వే: 76 రైళ్లకు (2,245 ట్రిప్పులు) ఆమోదం తెలపగా, వాటిలో 62 రైళ్ల (1,878 ట్రిప్పులు)వివరాలను వెల్లడించారు.
· ఉత్తర రైల్వే: 76 రైళ్లకు (2,090 ట్రిప్పులు) ఆమోదం తెలపగా, వాటిలో56 రైళ్ల (1,535 ట్రిప్పులు) వివరాలను వెల్లడించారు.
· మధ్య రైల్వే: 74 రైళ్లకు (3,082 ట్రిప్పులు) ఆమోదం తెలపగా, వాటిలో 70 రైళ్ల (2,238 ట్రిప్పులు) వివరాలను వెల్లడించారు.
· దక్షిణ రైల్వే: 72 రైళ్లకు (558 ట్రిప్పులు) ఆమోదం తెలపగా, వాటిలో 38 రైళ్ల (133 ట్రిప్పులు) వివరాలను వెల్లడించారు.
· తూర్పు మధ్య రైల్వే: 64 రైళ్లకు (2,711 ట్రిప్పులు) ఆమోదం తెలపగా, వాటిలో 38 రైళ్ల (1,060 ట్రిప్పులు) వివరాలను వెల్లడించారు.
· ఉత్తర మధ్య రైల్వే: 54 రైళ్లకు (1,163 ట్రిప్పులు) ఆమోదం తెలపగా, వాటిలో 46 రైళ్ల (688 ట్రిప్పులు) వివరాలను వెల్లడించారు.
· ఈశాన్య రైల్వే: 52 రైళ్లకు (814 ట్రిప్పులు) ఆమోదం తెలపగా, వాటిలో 34 రైళ్ల (477 ట్రిప్పులు) వివరాలను వెల్లడించారు.
· తూర్పు తీర రైల్వే: 28 రైళ్లకు (410 ట్రిప్పులు) ఆమోదం తెలపగా, వాటిలో 18 రైళ్ల (88 ట్రిప్పులు) వివరాలను వెల్లడించారు.
· పశ్చిమ మధ్య రైల్వే: 28 రైళ్లకు (408 ట్రిప్పులు) ఆమోదం తెలపగా, వాటిలో 18 రైళ్ల (192 ట్రిప్పులు) వివరాలను వెల్లడించారు.
· పశ్చిమ మధ్య రైల్వే: 28 రైళ్లకు (408 ట్రిప్పులు) ఆమోదం తెలపగా, వాటిలో 18 రైళ్ల (192 ట్రిప్పులు) వివరాలను వెల్లడించారు.
· తూర్పు రైల్వే: 24 రైళ్లకు (392 ట్రిప్పులు) ఆమోదం తెలపగా, వాటిలో 10 రైళ్ల (276 ట్రిప్పులు) వివరాలను వెల్లడించారు.
· ఈశాన్య సరిహద్దు రైల్వే: 24 రైళ్లకు (220 ట్రిప్పులు) ఆమోదం తెలపగా, వాటిలో 20 రైళ్ల (141 ట్రిప్పులు)వివరాలను వెల్లడించారు.
· దక్షిణ తూర్పు రైల్వే: 20 రైళ్లకు (276 ట్రిప్పులు) ఆమోదం తెలపగా, వాటిలో 18 రైళ్ల (250 ట్రిప్పులు) వివరాలను వెల్లడించారు.
· దక్షిణ తూర్పు మధ్య రైల్వే: 10 రైళ్లకు (122 ట్రిప్పులు) ఆమోదం తెలపగా, వాటిలో 8 రైళ్ల (70 ట్రిప్పులు) వివరాలను వెల్లడించారు.
· నైరుతి రైల్వే: 76 రైళ్లకు (509 ట్రిప్పులు) ఆమోదం తెలపగా, వాటిలో 56 రైళ్లకు (277 ట్రిప్పులు) వివరాలను వెల్లడించారు.
ప్రయాణికులకు కలిగే ప్రయోజనాలు
వేసవి ప్రత్యేక రైళ్లను భారీ స్థాయిలో ప్రవేశపెట్టడం వల్ల ప్రయాణికులకు ఈ కింది ప్రయోజనాలు చేకూరనున్నాయి.
· రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో వెయిటింగ్ లిస్టు సమస్య తగ్గే అవకాశం.
· మెరుగైన అదనపు బెర్తుల లభ్యత-సులభంగా ధ్రువీకరించిన టికెట్లు.
· ప్రధాన నగరాలు, వివిధ ప్రాంతాల మధ్య మరింత సులభతర ప్రయాణం.
· సులభమైన, సౌకర్యవంతమైన ప్రయాణం.
అధిక డిమాండు ఉన్న మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపడం ద్వారా వేసవి రద్దీ సమయంలో ప్రయాణికులు ఎక్కువ ఇబ్బంది పడకుండా ఉండేందుకు భారతీయ రైల్వే చర్యలు తీసుకుంటోంది.
సమయానుకూల ప్రణాళిక, భారీ స్థాయిలో ప్రత్యేక రైళ్ల ఏర్పాటుతో రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యానికి, సుఖవంతమైన ప్రయాణానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. అన్ని జోన్ల పరిధిలో ఈ సేవలను విస్తరించడం, ఇప్పటికే పెద్ద సంఖ్యలో రైళ్ల వివరాలను వెల్లడించడం ద్వారా ప్రయాణికుల అవసరాలను సమర్థవంతంగా తీర్చడంలోనూ, వేసవి కాలంలో ఎటువంటి ఆటంకాలు లేని ప్రయాణ అనుభవాన్ని అందించడంలోనూ భారతీయ రైల్వేకు ఉన్న అంకితభావాన్ని చాటి చెబుతోంది.
***
(రిలీజ్ ఐడి: 2253951)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11