ప్రధాన మంత్రి కార్యాలయం
పరశురాముడి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు
प्रविष्टि तिथि:
19 APR 2026 10:53AM by PIB Hyderabad
భగవాన్ పరశురాముడి జయంతి సందర్భంగా దేశ పౌరులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడటానికి, సత్య మార్గంలో స్థిరంగా కొనసాగడానికి భగవాన్ పరశురాముడు మనకు స్ఫూర్తినిస్తారని శ్రీ మోదీ అన్నారు. పరశురాముడు సాటిలేని శౌర్యానికీ, అపార జ్ఞానానికీ నిదర్శనమని కొనియాడారు.
పరశురాముని ఆశీస్సులతో ప్రతి ఒక్కరి హృదయం నూతన శక్తితో, ఆత్మవిశ్వాసంతో నిండాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ఆయన ఆశీస్సులు అందరి జీవితాల్లో ఆనందం, శాంతి, సిరిసంపదలు నింపాలని కోరారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఈ విధంగా అన్నారు.
‘‘పరశురాముడి జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడటానికి, సత్య మార్గంలో స్థిరంగా నిలవడానికి ఆయన మనకు స్ఫూర్తినిస్తారు. సాటిలేని శౌర్యానికి, జ్ఞానానికి ప్రతీక అయిన పరశురాముని అనుగ్రహం ప్రతి ఒక్కరిలో నూతన శక్తినీ, విశ్వాసాన్నీ నింపాలని కోరుకుంటున్నాను. అందరి జీవితాలూ సుఖశాంతులు, సిరిసంపదలతో తులతూగాలని ఆశిస్తున్నాను’’
***
(रिलीज़ आईडी: 2253624)
आगंतुक पटल : 55
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam