ప్రధాన మంత్రి కార్యాలయం
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం శక్తి జిల్లాలోని విద్యుత్ కేంద్రంలో ఘోర ప్రమాదం.. ప్రధానమంత్రి తీవ్ర సంతాపం నష్ట పరిహారాన్ని ప్రకటించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
14 APR 2026 8:15PM by PIB Hyderabad
ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి జిల్లాలో ఓ విద్యుత్ కేంద్రంలో జరిగిన ఘోర ప్రమాదంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రధానమంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు. బాధితులకు స్థానిక యంత్రాంగం అవసరమైన అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోందని పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ. 2 లక్షల చొప్పున నష్ట పరిహారం అందజేయనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది.
‘‘ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి జిల్లాలో ఉన్న విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం అత్యంత విషాదకరం. ఈ ఘటనలో ఆప్తులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు వీలైనంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. బాధితులకు స్థానిక యంత్రాంగం సహాయం అందిస్తోంది.
మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షలు.. గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నాం: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
***
(రిలీజ్ ఐడి: 2252054)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5