ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రికి ఫోన్ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ద్వైపాక్షిక సహకారంపై సమీక్షతో పాటు పశ్చిమ ఆసియా, హార్ముజ్ జలసంధి అంశాలపై చర్చ
నాడు పోస్టు చేయడమైనది:
14 APR 2026 9:30PM by PIB Hyderabad
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు.
వివిధ రంగాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారంలో సాధించిన గణనీయమైన పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించారు. అన్ని రంగాలలో 'సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని' మరింత బలోపేతం చేసేందుకు నిబద్ధతతో ఉన్నట్లు వారు తెలిపారు.
దీనితో పాటు పశ్చిమాసియాలోని ప్రస్తుత పరిస్థితులపై వారు చర్చించారు. హార్ముజ్ జలసంధిని నిరంతరం తెరిచి ఉంచడం, దాని భద్రతను కాపాడటానికి ఉన్న ప్రాముఖ్యతను వారు ప్రధానంగా పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:
"నా స్నేహితుడు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాకు ఫోన్ చేశారు. వివిధ రంగాలలో మన ద్వైపాక్షిక సహకారంలో సాధించిన విశేషమైన పురోగతిని మేం సమీక్షించాం. అన్ని రంగాల్లో మన సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు మేం కట్టుబడి ఉన్నాం. పశ్చిమ ఆసియాలోని పరిస్థితులపై కూడా చర్చించాం. హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా తెరిచి ఉంచాల్సిన అవసరాన్ని ప్రధానంగా పేర్కొన్నాం.”
***
(రిలీజ్ ఐడి: 2252050)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada