పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో కీలక రంగాల తాజా సమాచారం


ఎల్‌పీజీ విషయంలో ఎక్కడా నమోదు కాని కొరత.. నిన్న 52.3 లక్షలకు పైగా గృహ వినియోగ సిలిండర్ల సరఫరా

తనిఖీలను ఉద్ధృతం చేసిన పీఎస్‌యూ ఓఎంసీలు.. నిబంధనలు ఉల్లంఘించిన 219 ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లపై జరిమానా విధింపు, 56 డీలర్ షిప్ లు సస్పెన్షన్

2026 మార్చి నుంచి పూర్తైన 4.24 లక్షలకు పైగా గ్యాస్ సరఫరా పనులు.. కొత్త కనెక్షన్ల కోసం నమోదు చేసుకున్న 4.66 లక్షలకు పైగా వినియోగదారులు

ఎలాంటి రద్దీ లేకుండా దేశ‌వ్యాప్తంగా సాధారణంగా కొనసాగుతున్న ఓడరేవుల కార్యకలాపాలు

పశ్చిమాసియాలోని భారతీయుల భద్రత, రక్షణ, సంక్షేమాన్ని నిర్ధారించడంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం

ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు ఆ ప్రాంతం నుంచి భారత్‌కు వచ్చిన సుమారు 8.97 లక్షల మంది ప్రయాణికులు

నాడు పోస్టు చేయడమైనది: 12 APR 2026 4:51PM by PIB Hyderabad

పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అక్కడి పరిణామాలను నిశితంగా పర్యవేక్షిస్తోందికీలక రంగాలలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన సంసిద్ధతను నిర్ధారించడానికి సమన్వయంతో కూడిన చర్యలను చేపడుతోందిఇంధన సరఫరాసముద్రయాన కార్యకలాపాలుఆ ప్రాంతంలోని భారతీయులకు అవసరమైన సహాయం వంటి అంశాలలో తీసుకుంటున్న చర్యల తాజా సమాచారం ఈ విధంగా ఉంది:

హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో కొనసాగుతున్న పరిణామాల నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులుఎల్‌పీజీ నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చూడటానికి తీసుకుంటున్న చర్యలను పెట్రోలియంసహజ వాయువు మంత్రిత్వ శాఖ వివరించిందిఆ వివరాలు ఇలా ఉన్నాయి:

ప్రజా సూచనలుపౌర అవగాహన

  • పెట్రోల్డీజిల్ఎల్‌పీజీ విషయంలో ప్రజలు భయాందోళనతో కొనుగోళ్లు చేయొద్దని.. కేవలం అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని సూచించారు

  • ఎల్‌పీజీ వినియోగదారులు డిజిటల్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించాలని.. డిస్ట్రిబ్యూటర్ల వద్దకు వెళ్లకుండా ఉండాలని కోరారు.

  • ప్రజలు పీఎన్‌జీఎలక్ట్రిక్ లేదా ఇండక్షన్ కుక్‌టాప్‌ల వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ఉపయోగించాల్సిందిగా ప్రోత్సహించారు

  • ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధనాన్ని పొదుపు చేయాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు

ప్రభుత్వ సంసిద్ధతసరఫరా నిర్వహణ చర్యలు

  • ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ గృహాసరాల ఎల్‌పీజీపీఎన్‌జీ సరఫరాకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందిదీనితో పాటు ఆసుపత్రులువిద్యా సంస్థలకు గ్యాస్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా అధిక ప్రాధాన్యత ఇస్తోంది

  • సరఫరాడిమాండ్ రెండు అంశాల్లోనూ ప్రభుత్వం ఇప్పటికే పలు హేతుబద్ధీకరణ చర్యలను అమలు చేసిందిఇందులో భాగంగా చమురు శుద్ధి కేంద్రాల ఉత్పత్తిని పెంచడం.. ఎల్‌పీజీ బుకింగ్ గడువును పట్టణ ప్రాంతాల్లో 21 నుంచి 25 రోజులకుగ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకు పెంచడం.. కీలక రంగాలకు సరఫరాలో ప్రాధాన్యత ఇవ్వడం వంటి చర్యలు చేపట్టారు

  • ఎల్‌పీజీ డిమాండ్ ఒత్తిడిని తగ్గించడానికి కిరోసిన్బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు

  • చిన్నమధ్యతరహా వినియోగదారులకు పంపిణీ చేయడం కోసం రాష్ట్రాలకు అదనపు బొగ్గును సరఫరా చేయాలని కోల్ ఇండియాసింగరేణి కాలరీస్‌ను బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

  • గృహవాణిజ్య వినియోగదారుల విషయంలో కొత్త పీఎన్‌జీ కనెక్షన్‌లు పొందటాన్ని సులభతరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు

రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలుసంస్థాగత యంత్రాంగాలతో సమన్వయ ప్రయత్నాలు

  • నిత్యావసరాల చట్టం- 1955, ఎల్‌పీజీ నియంత్రణ ఉత్తర్వు- 2000 ప్రకారం పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాను పర్యవేక్షించడానికి.. అక్రమ నిల్వలునల్లబజారు క్రయవిక్రయాలపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది

  • 27.03.2026, 02.04.2026 నాటి లేఖల ద్వారా ఇంధనం తగినంతగా అందుబాటులో ఉందన్న భరోసాను ప్రజలకు ఇచ్చేందుకు ముందస్తు ప్రజా సమాచార మార్పిడి అవసరమని కేంద్రం ప్రభుత్వం ప్రధానంగా చెప్పిందిరాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలతో క్రమం తప్పకుండా సమీక్షా సమావేశాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. 02.04.2026న పెట్రోలియంసహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి… 06.04.2026న సమాచార ప్రసారవినియోగదారుల వ్యవహారాల కార్యదర్శులతో కలిసి పెట్రోలియంసహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సమావేశాలు నిర్వహించారుఈ సమావేశాల్లో కింది అంశాలను ప్రముఖంగా చెప్పారు:

    • ప్రతిరోజూ మీడియా సమావేశాలు నిర్వహించడంక్రమం తప్పకుండా ప్రజా సూచనలను జారీ చేయడం.

    • సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ వార్తలుఅవాస్తవ సమాచారాన్ని చురుగ్గా పర్యవేక్షించడంతిప్పికొట్టడం.

    • జిల్లా యంత్రాంగం ద్వారా ప్రతిరోజూ తనిఖీలను ఉద్ధృతం చేయటంఓఎంసీలతో సమన్వయం చేసుకుంటూ దాడులుతనిఖీలను కొనసాగించడం.

    • సంబంధిత రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం.

    • రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా కేటాయించిన కిరోసిన్ (ఎస్‌కేఓకోసం కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం.

    • పీఎన్‌జీ వినియోగంప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం.

    • ఎల్‌పీజీ సరఫరాలో ముఖ్యంగా గృహ అవసరాల ఎల్‌పీజీ సరఫరాలో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల లక్షిత పంపిణీ విధానాన్ని అనుసరించడం.

  • అక్రమ నిల్వనల్లబజారు క్రయవిక్రయాలను అరికట్టడానికి అన్ని రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలు కంట్రోల్ రూంలుజిల్లా స్థాయి పర్యవేక్షక కమిటీలను ఏర్పాటు చేశాయి.

  • ప్రస్తుతం 24 రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలు క్రమం తప్పకుండా మీడియా సమావేశాలను నిర్వహిస్తున్నాయి.

అమలుపర్యవేక్షణ చర్యలు

  • ఎల్‌పీజీ అక్రమ నిల్వనల్లబజారు క్రయవిక్రయాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా అమలు చర్యలు కొనసాగుతున్నాయి. 11.04.2026 నాడు దేశవ్యాప్తంగా 2700 కంటే ఎక్కువ దాడులు నిర్వహించారు

  • ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ఆకస్మిక తనిఖీలను మరింత ముమ్మరం చేశాయినిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఇప్పటివరకు 219 ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్ షిప్‌లపై జరిమానాలు విధించాయి.. 56 డిస్ట్రిబ్యూటర్ షిప్‌లను సస్పెండ్ చేశాయి.

ఎల్‌పీజీ సరఫరా

గృహావసరాల ఎల్‌పీజీ

  • ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఎల్‌పీజీ సరఫరాపై ప్రభావం కొనసాగుతోంది.

  • ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్‌షిప్‌ల వద్ద ఎక్కడా నిల్వల కొరత ఉన్నట్లు నివేదికలు అందలేదు.

  • పరిశ్రమవ్యాప్తంగా ఆన్‌లైన్ ఎల్‌పీజీ బుకింగ్‌లు సుమారు 98 శాతానికి పెరిగాయి.

  • సిలిండర్ల దారి మళ్లింపును అరికట్టడానికి డెలివరీ ఆథెంటికేషన్ కోడ్ (డీఏసీఆధారిత పంపిణీ విధానాన్ని సుమారు 93 శాతానికి పెంచారు

  • గృహావసరాల ఎల్‌పీజీ సిలిండర్ల పంపిణీ సాధారణంగానే కొనసాగుతోంది

  • 11.04.2026 నాడు 52.3 లక్షలకు పైగా గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్లు సరఫరా అయ్యాయి

వాణిజ్య ఎల్‌పీజీ సరఫరాకేటాయింపు చర్యలు

  • మొత్తం వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపులు సంక్షోభానికి ముందు ఉన్న స్థాయిలో సుమారు 70 శాతానికి పెరిగాయిఇందులో 10 శాతం సంస్కరణలతో ముడిపడి ఉన్న కేటాయింపులు కూడా ఉన్నాయి.

  • కేంద్ర ప్రభుత్వం 08.04.2026 నాటి లేఖ ద్వారా.. ఫార్మాఆహార రంగంపాలిమర్వ్యవసాయంప్యాకేజింగ్పెయింట్యురేనియంభార జలంఉక్కువిత్తనాలులోహాలుసిరామిక్ఫౌండ్రీఫోర్జింగ్గాజుఏరోసోల్ మొదలైన రంగాల్లోని పారిశ్రామిక విభాగాలు కూడా 2026 మార్చికి ముందు ఉన్న తమ బల్క్ గృహేతర ఎల్‌పీజీ వినియోగ స్థాయిలో 70 శాతాన్ని పొందుతాయని తెలియజేసిందిఅయితే ఇది రోజుకు 0.2 టీఎంటీ అనే మొత్తం రంగాల పరిమితికి లోబడి ఉంటుంది.

  • గడిచిన రోజుల్లో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (పీఎస్‌యూ ఓఎంసీ) 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లపై సుమారు 3300 అవగాహన శిబిరాలను నిర్వహించాయిఈ శిబిరాల ద్వారా 35,800 కంటే ఎక్కువ కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు విక్రయమయ్యాయి.

  • 11.04.2026 నాడు దేశవ్యాప్తంగా లక్ష కిలోల కంటే ఎక్కువ ఎఫ్‌టీఎల్ సిలిండర్లు విక్రయమయ్యాయిఇది 2026 ఫిబ్రవరి నెలలోని రోజువారీ సగటు అయిన 77,000 కంటే చాలా ఎక్కువ.

  • 2026 మార్చి 23 నుంచి ఇప్పటివరకు 13 లక్షలకు పైగా కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు విక్రయమయ్యాయి

  • వాణిజ్య ఎల్‌పీజీ పంపిణీని ప్రణాళికాబద్ధంగా నిర్వహించడానికి ఐఓసీఎల్హెచ్‌పీసీఎల్బీపీసీఎల్ సంస్థల కార్యనిర్వహక డైరెక్టర్లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ.. రాష్ట్ర ప్రభుత్వ అధికారులుపరిశ్రమల విభాగాలతో సమన్వయం చేసుకుంటోంది.

  • 2026 మార్చి 14 నుంచి ఇప్పటివరకు మొత్తం 1,20,898 మెట్రిక్ టన్నుల (ఎంటీవాణిజ్య ఎల్‌పీజీ విక్రయమైంది. 63.6 లక్షలకు పైగా (19 కిలోల బరువు గలవాణిజ్య సిలిండర్లతో సమానం ఇది

  • 11.04.2026 నాడు ఒక్కరోజే 7665 మెట్రిక్ టన్నుల వాణిజ్య ఎల్‌పీజీ విక్రయమైంది. 4 లక్షలకు పైగా (19 కిలోల బరువు గలవాణిజ్య సిలిండర్లతో సమానం ఇది


 

సహజ వాయువు సరఫరా... పీఎన్‌జీ విస్తరణకు చర్యలు

·        దేశీయ పీఎన్‌జీసీఎన్‌జీ రవాణాకు 100% సరఫరాతో వినియోగదారులకు ప్రాధాన్యం.

·        అందుబాటులోగల నిల్వలుషెడ్యూల్ ప్రకారంఎల్‌ఎన్‌జీ దిగుమతి ఆధారంగాఎరువుల కర్మాగారాలకు వాటి నెలల సగటు వినియోగంలో సుమారు 95 శాతానికి చేరువగామొత్తం గ్యాస్‌ కేటాయింపును 09.04.2026 నుంచి మరో శాతం పెంచారు.

·        వాణిజ్య ఎల్‌పీజీ లభ్యత సంబంధిత సమస్యల పరిష్కారం దిశగా హోటళ్లురెస్టారెంట్లు,  క్యాంటీన్ల వంటి వాణిజ్య సంస్థలకు పీఎన్‌జీ కనెక్షన్లలో ప్రాధాన్యం ఇవ్వాలని సీజీడీ సంస్థలకు ఆదేశాలు.

·        ఐజీఎల్ఎంజీఎల్గెయిల్ గ్యాస్బీపీసీఎల్ వంటి సీజీడీ కంపెనీల ద్వారా దేశీయవాణిజ్య పీఎన్‌జీ కనెక్షన్లకు ప్రోత్సాహకాల మంజూరు.

·        సీజీడీ నెట్‌వర్క్‌ విస్తరణకు సత్వర అనుమతులు ఇవ్వాలని రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలు సహా కేంద్ర మంత్రిత్వ శాఖలకు సూచన.

·        ఎల్‌పీజీ నుండి పీఎన్‌జీకి దీర్ఘకాలిక మార్పు దిశగా రాష్ట్రాల తోడ్పాటుకు ప్రతిగా వాణిజ్య ఎల్‌పీజీలో అదనంగా 10 శాతం కేటాయిస్తామని కేంద్ర ప్రభుత్వం 18.03.2026 నాటి లేఖ ద్వారా అన్ని రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలకు హామీ ఇచ్చింది.

·        ఎల్‌పీజీ నుండి పీఎన్‌జీకి దీర్ఘకాలిక మార్పులో రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలు తమవంతు తోడ్పాటునిస్తేనే ఈ కేటాయింపు వర్తిస్తుందిఅయితేపీఎన్‌జీ విస్తరణలో సంస్కరణలకు అనుసంధానం కింద 21 రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటికే అదనపు వాణిజ్య ఎల్‌పీజీ లభిస్తోంది.

·        ప్రాధాన్య క్రమంలో దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి సీజీడీ మౌలిక సదుపాయాల కోసం మూడు నెలల పాటు సత్వర ఆమోద చట్రాన్ని రోడ్డు రవాణా-రహదారుల మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది.

·        కేంద్ర ప్రభుత్వం 24.03.2026న గెజిట్ ప్రకటన ద్వారానే కాకుండా నిత్యావసర వస్తువుల చట్టం-1955 కింద సహజ వాయువుపెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్‌లైన్లుఇతర సౌకర్యాల కల్పననిర్మాణం-నిర్వహణ-విస్తరణ)ఉత్తర్వు-2026ను జారీ చేసిందిదీంతో దేశవ్యాప్తంగా పైప్‌లైన్ల నిర్మాణంవిస్తరణకు క్రమబద్ధ-వ్యవధి నిర్దేశిత చట్రం అమలులోకి వస్తుందితద్వారా అనుమతులుభూసేకరణలో జాప్యాలను నివారించిఆవాస ప్రాంతాలు సహా సహజ వాయువు మౌలిక సదుపాయాల సత్వర అభివృద్ధికి వీలు కలుగుతుందిదీనివల్ల పీఎన్‌జీ నెట్‌వర్క్ వృద్ధిని వేగిరపరచడమే కాకుండా చివరి అంచె అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందిఅలాగేకాలుష్యరహిత ఇంధనాల వైపు మళ్లేందుకు తోడ్పడుతుందనిదీంతో ఇంధన భద్రత బలోపేతమై గ్యాస్ ఆధారిత భారత ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు.

·        పీఎన్‌జీ విస్తరణలో వేగం కొనసాగింపు లక్ష్యంగా జాతీయ పీఎన్‌జీ కార్యక్రమం 2.0ను 2026  జూన్ 30 వరకు పీఎన్‌జీఆర్‌బీ పొడిగించింది.

·        కాలుష్య రహితసురక్షితస్వయంసమృద్ధి సహిత ఇంధన భవిష్యత్తును ప్రోత్సహించే దిశగా ముసాయిదా రాష్ట్ర సీబీజీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించిందిసీబీజీ అభివృద్ధి కోసం రాష్ట్రాలు తమ సొంత పెట్టుబడిదారులకు అనుకూలఅమలు హితవైన వ్యవస్థను ఈ నమూనా విధానం ద్వారా రాష్ట్రాలు సృష్టించుకోవచ్చుఈ మేరకు సమగ్రసరళమార్గదర్శక చట్రంగా ఈ విధానం దోహదపడుతుందిదీన్ని అమలు చేసే రాష్ట్రాలకు వాణిజ్య ఎల్పీజీ అదనపు కేటాయింపులకు సంబంధించి తదుపరి విడతలో ప్రాధాన్యం లభిస్తుంది.

·        2026 మార్చి నుంచి 4.24 లక్షలకు పైగా పీఎన్‌జీ కనెక్షన్ల గ్యాసిఫికేషన్‌ పూర్తయిందిఅలాగేకొత్త కనెక్షన్ల కోసం మరో 4.66 లక్షల మందికి పైగా నమోదు చేసుకున్నారు.

·        మరోవైపు 11.04.2026 నాటికి 30,000 మందికి పైగా పీఎన్‌జీ వినియోగదారులు MYPNGD.in వెబ్‌సైట్ ద్వారా ఎల్పీజీ కనెక్షన్లను వదులుకున్నారు.

ముడిచమురు నిల్వలు... శుద్ధి కర్మాగారాల కార్యకలాపాలు

·        దేశంలో తగినంత ముడి చమురు నిల్వలు అందుబాటులో ఉండటంతో శుద్ధి కర్మాగారాలన్నీ  అదనపు సామర్థ్యంతో పనిచేస్తున్నాయిదీంతోపాటు పెట్రోల్డీజిల్ నిల్వల నిర్వహణ సంతృప్తికరంగా ఉంది.

·        దేశీయ వినియోగానికి కొరత రాకుండా శుద్ధి కర్మాగారాల్లో వంటగ్యాస్‌ ఉత్పత్తిని పెంచారు.

·        దేశలోని ఫార్మాస్యూటికల్స్ఆహార-ప్రజా పంపిణీరసాయనాలు-పెట్రో కెమికల్స్ వంటి కీలక రంగాలకు సి3, సిస్ట్రీమ్‌లను కనీస పరిమాణంలో... అంటేరోజుకు 800 మెట్రిక్ టన్నుల వరకూ అందుబాటులో ఉంచే విధంగా దేశంలోని పెట్రోకెమికల్ ప్రాంగణాలు సహా శుద్ధి కంపెనీలను అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం 01.04.2026న ఒక ఉత్తర్వు జారీచేసింది.

చిల్లర విక్రయానికి ఇంధన లభ్యత... ధరల దిశగా చర్యలు

·        దేశవ్యాప్తంగా అన్ని చిల్లర విక్రయ కేంద్రాలు యథావిధిగా పనిచేస్తున్నాయి.

·        మధ్యప్రాచ్య సంక్షోభం వల్ల ముడిచమురు ధర అసాధారణంగా పెరిగిందిదీంతో వినియోగదారులను ఆదుకోవడానికికేంద్ర ప్రభుత్వం పెట్రోల్డీజిల్‌పై లీటరుకు రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకం తగ్గించింది.

·        దేశీయ మార్కెట్లో ఈ ఉత్పత్తుల లభ్యతకు భరోసా ఇస్తూ ఎగుమతి సుంకాన్ని లీటరు డీజిల్‌పై రూ.55.50కిఒక లీటరు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌పై  రూ.42కు పెంచుతూ 11.04.2026న గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

·        చిల్లర విక్రయ కేంద్రాల్లో పెట్రోల్డీజిల్ సాధారణ ధరలలో ఎలాంటి మార్పు లేదు.

కిరోసిన్‌ లభ్యత... సజావుగా పంపిణీకి చర్యలు

·        సాధారణ కేటాయింపులకు అదనంగా రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలకు 48,000 కిలోలీటర్ల  కిరోసిన్‌ను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.

·        ఈ నేపథ్యంలో 18 రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలు ‘ఎస్‌కేఓ’ కేటాయింపు ఉత్తర్వులు జారీ చేయగాహిమాచల్ ప్రదేశ్లద్దాఖ్‌ తమకు అవసరం లేదని తెలిపాయి.

సముద్ర భద్రతనౌకారవాణా కార్యకలాపాలు

పశ్చిమాసియా ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహించే భారతీయ నౌకలునావికుల భద్రతకు కేంద్ర  ఓడరేవులు-నౌకా రవాణా-జలమార్గాల మంత్రిత్వ శాఖ తగు చర్యలు చేపట్టిన నేపథ్యంలో కిందివిధంగా ప్రకటించింది:

·        భారతీయ నావికులందరూ సురక్షితం.. గడచిన 24 గంటల్లో భారత పతాకంగల నౌకలకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు.

·        నౌకారవాణా కంట్రోల్ రూమ్ 24గంటలూ పనిచేస్తుండగాదీన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటిదాకా 6,053 కాల్స్ స్వీకరించడంతోపాటు 12,787కుపైగా ఈ-మెయిళ్లను  నిర్వహించిందిఈ క్రమంలో గడచిన 24 గంటల్లో, 80 కాల్స్, 112 -మెయిల్స్ అందాయి.

·        మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డీజీ షిప్పింగ్ద్వారా గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల నుంచి 24 గంటల్లో 75 మంది సహా ఇప్పటిదాకా 2,084 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించారు.

·        దేశవ్యాప్తంగా ఓడరేవులలో ఎలాంటి రద్దీ నమోదు కాకపోగాకార్యకలాపాలన్నీ సాధారణ స్థాయిలో సాగుతున్నాయి.

·        సముద్రయాన సిబ్బంది సంక్షేమంనిరంతరాయ సముద్ర కార్యకలాపాలకు భరోసా ఇస్తూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖభారత దౌత్య కార్యాలయాలుసముద్ర రంగ భాగస్వాములతో సమన్వయాన్ని మంత్రిత్వశాఖ కొనసాగిస్తోంది.

పశ్చిమాసియా ప్రాంతంలో భారత పౌరుల భద్రత

పశ్చిమాసియా ప్రాంతంలోని బారతీయులతో పరిసర దేశాలక్లోని భారత రాయబార కార్యాలయాలుశిబిరాలు సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నాయివారి భద్రతశ్రేయస్సు దిశగా అవసరమైన సహాయం అందించడంతోపాటు సలహాలుసూచనలు జారీ చేస్తున్నాయిఈ మేరకు తాము చేపట్టిన చర్యలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కిందివిధంగా ప్రకటించింది:

·        గల్ఫ్పశ్చిమాసియా ప్రాంత పరిణామాలపై ప్రభుత్వం సదా నిశిత పర్యవేక్షణ కొనసాగిస్తోంది.

·        సమాచార ఆదానప్రదానంసమన్వయం మెరుగుదల దిశగా రాష్ట్ర ప్రభుత్వాలుకేంద్రపాలిత ప్రాంతాలతో మంత్రిత్వశాఖ క్రమం తప్పకుండా సంప్రదిస్తోంది.

·        ఈ ప్రాంతంలోని భారతీయుల భద్రతరక్షణసంక్షేమానికి భరోసా ఇస్తూ పటిష్ఠ చర్యలు చేపట్టాం.

·        భారత రాయబార కార్యాలయాలుశిబిరాలు 24 గంటల సహాయ కేంద్రాలను నిర్వహిస్తూభారత పౌరులకు చురుగ్గా సహాయం చేస్తున్నాయి.

·        ఆయా దేశాల్లోని ప్రభుత్వ మార్గదర్శకాలువిమాన-ప్రయాణ స్థితిగతులురాయబార కార్యాలయ సేవలపై సమాచారం సహా నవీకృత సలహాలు క్రమం తప్పకుండా జారీ అవుతున్నాయి.

·        ఈ ప్రాంతంలోని భారతీయ సంఘాలువృత్తి బృందాలుభారత కంపెనీలు సహా ఇతరత్రా  భాగస్వాములతో మన రాయబార కార్యాలయాలు చురుగ్గా సమన్వయం చేసుకుంటున్నాయి.

·        గగనతలం తెరిచి ఉన్న దేశాల నుంచి విమాన రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయిఈ మేరకు ఫిబ్రవరి 28 నుంచి భారత్‌కు సుమారు 8,97,000 మంది ప్రయాణించారు.

·        యూఏఈ’లోని విమానయాన సంస్థలు కార్యాచరణ-భద్రత అంశాలను పరిగణనలోకి తీసుకునిభారత్‌కు పరిమిత సంఖ్యలో అనధికార కార్యకలాపాల కింద వాణిజ్య విమానాలను నడుపుతున్నాయిదీని ప్రకారం నేడు సుమారు 95 విమానాలు నడుస్తాయి.

·        సౌదీ అరేబియాఓమన్‌ దేశాల్లోని వివిధ విమానాశ్రయాల నుంచి భారత్‌లోని వివిధ నగరాలకు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి.

·        ఖతార్ గగనతలం పాక్షికంగా తెరవడంతో ‘ఖతార్ ఎయిర్‌వేస్’ ఇవాళ భారత్‌కు 8–10 విమానాలను నడుపుతుందని అంచనా.

·        కువైట్ గగనతలం మూసివేత కొనసాగుతోందిదీంతో కువైట్‌ విమానయాన సంస్థ జజీరా ఎయిర్‌వేస్కువైట్ ఎయిర్‌వేస్సౌదీ అరేబియాలోని దమ్మామ్ విమానాశ్రయం నుంచి భారత్‌కు అనధికార కార్యకలాపాల కింద వాణిజ్య విమానాలను నడుపుతున్నాయికువైట్ నుంచి భారత పౌరుల ప్రయాణానికి సౌదీ అరేబియా ద్వారా సౌకర్యం కల్పించారు.

·        బహ్రెయిన్ గగనతలం తెరిచి ఉండటంతో ‘గల్ఫ్ ఎయిర్’ త్వరలోనే బహ్రెయిన్ నుంచి  భారత్‌కు  పరిమితంగా విమానాలను నడుపుతుందని అంచనాఅయితేప్రస్తుతం సౌదీ అరేబియాలోని దమ్మామ్ విమానాశ్రయం నుంచి భారత్‌కు షెడ్యూల్ చేయని విమానాలు నడుస్తున్నాయిబహ్రెయిన్ నుంచి భారత పౌరుల ప్రయాణానికి సౌదీ అరేబియా ద్వారా సౌకర్యం కల్పించబడుతోంది.

·        ఇరాన్ గగనతలం మూసివేత కొనసాగుతోందిఅయితేఇరాన్ నుంచి ఆర్మేనియాఅజర్‌బైజాన్ మీదుగా భారత్‌కు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం.

·        ఇజ్రాయెల్ గగనతలం మూసివేత కొనసాగుతున్నప్పటికీ జోర్డాన్ఈజిప్ట్ మీదుగా భారత్‌కు ప్రయాణించే సౌకర్యం అందుబాటులో ఉంది.

·        ఇరాక్‌ గగన తలం తెరిచి ఉన్నప్పటికీ విమాన కార్యకలాపాలు పరిమితంగానే సాగుతున్నాయిఈ మేరకు జోర్డాన్సౌదీ అరేబియా మీదుగా భారత పౌరులకు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం.

 

***


(రిలీజ్ ఐడి: 2251391) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Odia , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Bengali-TR , Gujarati , Tamil , Kannada , Malayalam