ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బీహార్‌లోని కటిహార్ ప్రమాద మృతుల పట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి


పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి పరిహారాన్ని ప్రకటించిన పీఎం

प्रविष्टि तिथि: 11 APR 2026 10:56PM by PIB Hyderabad

బీహార్‌లోని కటిహార్ ప్రమాదంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ‌్యక్తం చేశారుఈ ఘటన అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.

ఈ ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రధానమంత్రి సానుభూతిని తెలియజేశారుగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కాంక్షించారుప్రధానమంత్రి జాతీయ సహాయనిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలుగాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహారాన్ని శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

"బీహార్‌లోని కటిహార్‌లో జరిగిన ప్రమాదం అత్యంత విషాదకరంఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తున్నాను.

పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలుగాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహారం అందజేస్తాం"

 

***


(रिलीज़ आईडी: 2251306) आगंतुक पटल : 122
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada