ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి ముద్రా యోజన 11వ వార్షికోత్సవం
పథకం విజయాలను ప్రశంసించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
వివేకం గల వ్యక్తి గుణగణాల్ని చాటిచెప్పే ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
08 APR 2026 9:25AM by PIB Hyderabad
పదకొండు సంవత్సరాల కిందట అమల్లోకి వచ్చిన ప్రధానమంత్రి ముద్రా యోజన యువతీ యువకులు స్వయం ఉపాధికి తోడ్పడిందని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ఒక వ్యక్తికి సరైన అవకాశాలు ఇస్తే ఆ వ్యక్తి సొంత కాళ్ల మీద నిలబడడంతో పాటు దేశ పురోగతికి కూడా తన వంతు తోడ్పాటును అందించగలరని ఈ పథకం సాధించిన ఫలితం నిరూపించిందని ప్రధానమంత్రి అన్నారు. ఈ సందర్భంగా, సంస్కృత భాషలోని ఓ సుభాషితాన్ని ప్రజలతో శ్రీ మోదీ పంచుకున్నారు. వివేకం గల వ్యక్తి గుణగణాలను గురించి ఈ సుభాషితం మనకు చెబుతుంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ -
‘‘ఇవాళ్టికి సరిగ్గా 11 సంవత్సరాల కిందట మొదలుపెట్టిన ప్రధానమంత్రి ముద్రా యోజన యువత స్వయం ఉపాధి కల్పనకు ఎంతో సహాయ పడింది. సరైన అవకాశాలు లభించినప్పుడు వ్యక్తి తన కాళ్ల మీద తాను నిలబడడమే కాకుండా, దేశ ప్రగతికి కూడా తోడ్పడగలుగుతారని ఈ పథకం సాధించిన విజయం నిరూపించింది.
ఆత్మజ్ఞానం సమారంభస్తితిక్షా ధర్మనిత్యతా
యమర్థా నాపకర్షన్తి స వై పండిత ఉచ్యతే
#11YearsOfMUDRA’’ అని పేర్కొన్నారు.
స్వీయ శక్తిసామర్ధ్యాల గురించి తెలుసుకుని, స్వావలంబన కలిగి మంచి పనులు చేస్తూ, ఓరిమితో కష్టాలను అధిగమిస్తూ, ఎప్పుడూ సన్మార్గంలోనే నడుస్తూ, దురాశకు లొంగకుండా ముందుకు సాగిపోయే వ్యక్తి నిజమైన వివేకశాలి.
***
(రిలీజ్ ఐడి: 2249934)
సందర్శకుల సూచీ సంఖ్య : : 26
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Bengali
,
Bengali-TR
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Kannada