సహకార మంత్రిత్వ శాఖ
సారస్వత్ సహకార బ్యాంకుతో పాటు అమూల్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.1 లక్ష కోట్ల వార్షిక టర్నోవరును దాటినందుకు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ప్రశంసలు
• ఈ విజయం సహకార బ్యాంకింగ్, పాడి రంగాల్లో చరిత్రాత్మకం..
ఇది ‘ఆత్మనిర్భర్ భారత్’ సాధన దిశగా చేస్తున్న ప్రయాణానికి సరికొత్త వేగం
నాడు పోస్టు చేయడమైనది:
07 APR 2026 12:35PM by PIB Hyderabad
సారస్వత్ సహకార బ్యాంకు, అమూల్ తమ ప్రగతి ప్రస్థానంలో భాగంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.1 లక్ష కోట్ల మొత్తం వ్యాపారాన్ని నమోదు చేసినందుకు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఆ సంస్థలకు అభినందనలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ అమిత్ షా ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘సారస్వత్ సహకార బ్యాంకుతో పాటు అమూల్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.1 లక్ష కోట్ల వార్షిక టర్నోవరును అధిగమించడం మన సహకార రంగ శక్తి సామర్థ్యాలు అపారమైనవని నిరూపించే ఓ స్పష్టమైన ఉదాహరణ. ఈ విజయం సహకార బ్యాంకింగ్ రంగానికీ, పాడి రంగానికీ చరిత్రాత్మకమైందే కాకుండా, ‘ఆత్మనిర్భర్ భారత్’ సాధన దిశగా సాగుతున్న ప్రయాణానికి కొత్త శక్తిని సమకూరుస్తుంది. గర్వకారణమైన ఈ విజయాన్ని సాధించిన అమూల్, సారస్వత్ సహకార బ్యాంకుల కర్మయోగులందరికీ హృదయపూర్వక అభినందనలను తెలియజేస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2249619)
సందర్శకుల సూచీ సంఖ్య : : 17