భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలు 2026: పోలింగ్‌కు ముందురోజు, పోలింగ్ రోజున ప్రింట్ మీడియాలో ప్రకటనలకు మీడియా సర్టిఫికేషన్, ఎంసీఎంసీ ద్వారా ముందస్తు ధ్రువీకరణ

నాడు పోస్టు చేయడమైనది: 06 APR 2026 3:02PM by PIB Hyderabad
  1. అస్సాంకేరళపుదుచ్చేరితమిళనాడుపశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు, 6 రాష్ట్రాల్లో ఉపఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను మార్చి 15, 2026న భారత ఎన్నికల సంఘం (ఈసీఐప్రకటించింది.

  2. ఎన్నికలు జరిగే రోజునపోలింగ్ కు ముందురోజున ఏ రాజకీయ పార్టీ గానీఅభ్యర్థి గానీవ్యక్తి గానీ ప్రింట్ మీడియా ద్వారా ఎలాంటి ప్రకటనలు ఇవ్వకూడదురాష్ట్రజిల్లా స్థాయిలోని మీడియా సర్టిఫికేషన్మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీద్వారా ముందస్తుగా అనుమతి పొందిన ప్రకటనలకు మాత్రమే మినహాయింపు ఉంటుంది.

  3. ప్రకటనలను అనుమతించేందుకు వ్యక్తులుఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు జిల్లా స్థాయి ఎంసీఎంసీకి దరఖాస్తు చేసుకోవచ్చురాష్ట్రంయూటీలో ప్రధాన కార్యాలయం గల రిజిస్టరయిన రాజకీయ పార్టీలు ప్రకటనల ధ్రువీకరణ కోసం రాష్ట్రస్థాయి ఎంసీఎంసీకి దరఖాస్తు చేసుకోవచ్చు.

  4. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలుయూటీల్లో ఇక్కడ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి:

 

సాధారణ ఎన్నికలు జరగనున్న రాష్ట్రంయూటీ పేరు

పోలింగ్ తేదీ

ప్రకటనలకు ముందస్తు ధ్రువీకరణ తప్పనిసరి అయ్యే ప్రచురణ తేదీలు

అస్సాంకేరళపుదుచ్చేరి

09.04.2026

08.04.2026, 09.04.2026

తమిళనాడు

23.04.2026

22.04.2026, 23.04.2026

పశ్చిమబెంగాల్

23.04.2026 (ఫేజ్-I)

22.04.2026, 23.04.2026

29.04.2026(ఫేజ్-II)

28.04.2026, 29.04.2026

 

5. పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలనుకునే అభ్యర్థులు ప్రకటనకు రెండు రోజుల ముందుగానే అనుమతి కోసం ఎంసీఎంసీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

6. సకాలంలో ముందస్తు ధ్రువీకరణ ప్రక్రియను సులభతరం చేసేందుకు రాష్ట్రజిల్లా స్థాయిలో ఎంసీఎంసీ బృందాలు పని చేస్తున్నాయిఇవి ప్రకటనలను పరిశీలించిముందస్తు అనుమతిని ఇవ్వటమే కాకవేగంగా నిర్ణయాలు తీసుకునేలా చూస్తాయి.

7. మీడియాలో పెయిడ్ న్యూస్ గా అనుమానించదగిన కేసులపైనా ఎంసీఎంసీలు కఠిన నిఘా ఉంచితగిన చర్యలు తీసుకోవాలి.

***


(రిలీజ్ ఐడి: 2249379) సందర్శకుల సూచీ సంఖ్య : : 80
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Malayalam , English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Tamil