హోం మంత్రిత్వ శాఖ
ఛత్రపతి శివాజీ మహారాజ్ పుణ్యతిథి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
భారతీయ గౌరవానికి అమర చిహ్నంగా, జాతీయ కీర్తికి శాశ్వత సంరక్షకుడిగా నిలిచిపోయిన ఛత్రపతి శివాజీ మహారాజ్
సముద్రాలపై నియంత్రణ ప్రాముఖ్యతను గ్రహించి, శివాజీ నిర్మించిన శక్తిమంతమైన నౌకాదళం ఆయన గొప్ప వ్యూహాత్మక చతురతకు, దూరదృష్టి గల నాయకత్వానికి నిదర్శనం
నాడు పోస్టు చేయడమైనది:
03 APR 2026 10:15AM by PIB Hyderabad
ఛత్రపతి శివాజీ మహారాజ్ పుణ్యతిథి సందర్భంగా ఆయనకు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా నివాళులర్పించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ ఖాతాలో శ్రీ అమిత్ షా ఇలా పేర్కొన్నారు.. ‘‘"భారతీయ గౌరవానికి అమర చిహ్నంగా, జాతీయ వైభవానికి శాశ్వత సంరక్షకుడిగా నిలిచిన ఛత్రపతి శివాజీ మహారాజ్ పాదలకు నేను భక్తిశ్రద్ధలతో నమస్కరిస్తున్నాను. ధర్మం, సంస్కృతిని కాపాడటం కోసం ఆయన ప్రజలను ఏకం చేసి హిందవీ స్వరాజ్యాన్ని స్థాపించారు. సముద్రాలపై నియంత్రణ ప్రాముఖ్యతను గుర్తించి, ఆయన నిర్మించిన శక్తిమంతమైన నౌకాదళం ఆయన అసమానమైన వ్యూహాత్మక చతురతకు, దూరదృష్టి గల నాయకత్వానికి నిదర్శనం. ఒక పాలకుడు తన సొంత సంస్కృతిని, భాషను సంరక్షించుకుంటూనే.. ప్రజా సంక్షేమంలో ఆదర్శవంతమైన ప్రమాణాలను ఎలా నెలకొల్పవచ్చో చెప్పడానికి ఆయన జీవితం ఒక గొప్ప ఉదాహరణ. ఆయన అవిశ్రాంత పోరాటం, జీవిత గాథ ఈ దేశ ప్రజలకు మాతృభూమి పట్ల భక్తి, అంకితభావంతో ఎల్లప్పుడూ స్పూర్తినిస్తూనే ఉంటాయి.’’
***
(రిలీజ్ ఐడి: 2248767)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14