సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ (ఎంఐబీ) కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ చంచల్ కుమార్
నాడు పోస్టు చేయడమైనది:
02 APR 2026 3:28PM by PIB Hyderabad
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా శ్రీ చంచల్ కుమార్ 2026 ఏప్రిల్ 1న బాధ్యతలు స్వీకరించారు. ఆయన బీహార్ క్యాడర్‌కు చెందిన 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఇప్పటి వరకు కార్యదర్శిగా పనిచేసిన శ్రీ సంజయ్ జాజు, మంత్రిత్వ శాఖలో, వివిధ మీడియా యూనిట్లలో పనిచేస్తున్న ఇతర అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా శ్రీ సంజయ్ జాజు నియమితులయ్యారు.
గతంలో, ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ (డీవోఎన్ఈఆర్), పౌర విమానయాన శాఖ కార్యదర్శిగా, భారత ప్రభుత్వంలో అనేక ఉన్నత పదవుల్లో శ్రీ కుమార్ పనిచేశారు. జాతీయ రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్ఐడీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. వ్యూహాత్మక జాతీయ రహదారులు, మౌలిక వసతుల ప్రాజెక్టులకు గణనీయమైన సేవలు అందించారు.
బీహార్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శితో సహా అనేక ముఖ్యమైన బాధ్యతలను చేపట్టారు. వివిధ జిల్లాలకు జిల్లా మెజిస్ట్రేట్‌గా పనిచేశారు.
ఐఐటీ కాన్పూర్ నుంచి బీటెక్, ఎంటెక్ పట్టాలను, పట్నా విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీని శ్రీ చంచల్ కుమార్ పొందారు. ఇవి ఆయన వృత్తికి అవసరమైన బలమైన విద్యాపరమైన, విధానపరమైన నేపథ్యాన్ని అందించాయి.
***
(రిలీజ్ ఐడి: 2248626)
సందర్శకుల సూచీ సంఖ్య : : 21
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam