సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నాలుగు వారాల పాటు టీవీ వార్తా ఛానళ్ల టీఆర్‌పీల నిలిపివేతకు ప్రభుత్వం ఆదేశం..


సంక్షోభ సమయాల్లో ఊహాజనిత, సంచలనాత్మక ప్రసారాలను కట్టడి చేసేందుకు కేంద్రం చర్యలు

प्रविष्टि तिथि: 02 APR 2026 4:10PM by PIB Hyderabad

ఆపరేషన్ సింధూర్ సమయంలో కొన్ని టెలివిజన్‌ వార్తా ఛానళ్లు అనవసరమైన సంచలనాత్మక, ఊహాజనిత కథనాలను ప్రసారం చేస్తున్నట్లు వెల్లడైంది. యుద్ధం, సంక్షోభ సమయాల్లో టీవీ ఛానెళ్ల  ప్రవర్తన ఇలాగే ఉంటోంది. ఇది ప్రజల్లో ముఖ్యంగా ప్రభావిత ప్రాంతాల్లో స్నేహితులు, కుటుంబ సభ్యులు ఉన్నవారిలో భయాందోళనలను కలిగించే అవకాశం ఉంటుంది.

దీనిని దృష్టిలో ఉంచుకొని ముందుజాగ్రత్త చర్యగా టీవీ వార్తా ఛానెళ్ల టెలివిజన్ రేటింగ్ పాయింట్లను నాలుగు వారాల పాటు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆదేశాలను సంబంధిత భాగస్వాములందరూ విస్తృతంగా ఆమోదించారు. ఇప్పటివరకు దీనికి వ్యతిరేకంగా ఎటువంటి అభ్యంతరాలు అందలేదు.

ఈ సమాచారాన్ని, సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ లోక్‌సభలో శ్రీ ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.

 

***


(रिलीज़ आईडी: 2248619) आगंतुक पटल : 69
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Kannada , Malayalam